
అరణ్మణై–3 చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న చిత్రం అరణ్మణై –3. ఈయన ఇంతకుముందు రూపొందించిన అరణ్మణై–, 1, 2 చిత్రాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. దీంతో తాజాగా అరణ్మణై–3 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది కూడా రెండు చిత్రాల తరహాలోనే హర్రర్, కామెడీ, థ్రిల్లర్ ఇతి వృత్తంతో రూపొందుంతున్న చిత్రమే అని దర్శకుడు సుందర్ సి తెలిపారు. ఇందులో ఆర్య కథానాయకుడిగా నటించగా, రాశిఖన్నా, ఆండ్రియా, సాక్షి అగర్వాల్ ముగ్గురు కథానాయికలుగా నటించారు. నటుడు వివేక్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సత్య సంగీతం అందించారు. చిత్ర ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్లను గురువారం విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment