
శరీరాన్ని నచ్చినట్లు మలచడం అంత ఈజీ కాదు. కానీ సినిమాతారలు మాత్రం ఒక్కోసారి ఒక్కో గెటప్‌లో కనిపిస్తారు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్.. అవసరమైతే ఫ్యామిలీ ప్యాక్‌లో కూడా దర్శనమిస్తారు. మళ్లీ యాక్షన్ మూవీ అనగానే వెంటనే కొవ్వును కరిగించేసుకుని.. కండలు తిరిగిన దేహం కోసం శ్రమిస్తారు. పైన కనిపిస్తున్న హీరో కూడా అదే చేశాడు. ఇంతకీ ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా? రాజా రాణి, వరుడు, సైజ్ జీరో, సైంధవ్ సినిమాలతో తెలుగులో బోలెడంత ఫేమ్ సంపాదించుకున్న ఆర్య.
ఏడాదిగా కసరత్తులు
తమిళంలో హీరోగా రాణిస్తున్న ఆర్య గతేడాది మిస్టర్ ఎక్స్ అనే సినిమా ఒప్పుకున్నాడు. లావుగా, కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫోటో అప్పటిదే! సినిమాకు సంతకం చేసిన మరుసటి నెల నుంచే కసరత్తులు చేయడం ప్రారంభించాడు. కండలు తిరిగిన దేహాన్ని సొంతం చేసుకున్నాడు. 'గతేడాది మార్చిలో సినిమా ఒప్పుకున్నాను. ఏప్రిల్‌లో వర్కవుట్స్ స్టార్ట్ చేశా.. సెప్టెంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. చూస్తుండగానే ఏడాది అయిపోయింది. 2023 ఏప్రిల్‌లో.. 2024 మార్చిలో నా లుక్ ఇలా ఉంది' అంటూ ఫోటోలు షేర్ చేశాడు.
మైండ్ బ్లోయింగ్
ఇది చూసిన ఫ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మిస్టర్ ఎక్స్ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందులో మంజు వారియర్, శరత్ కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ కార్తీక్ విలన్‌గా నటిస్తున్నాడు. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
చదవండి: 56 ఏళ్ల వయసులో నటుడి డేటింగ్.. విడిపోయామంటూ పోస్ట్..
Comments
Please login to add a commentAdd a comment