tamil hero arya
-
ఈ హీరోను గుర్తుపట్టారా? అప్పుడలా.. ఇప్పుడిలా..!
శరీరాన్ని నచ్చినట్లు మలచడం అంత ఈజీ కాదు. కానీ సినిమాతారలు మాత్రం ఒక్కోసారి ఒక్కో గెటప్‌లో కనిపిస్తారు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్.. అవసరమైతే ఫ్యామిలీ ప్యాక్‌లో కూడా దర్శనమిస్తారు. మళ్లీ యాక్షన్ మూవీ అనగానే వెంటనే కొవ్వును కరిగించేసుకుని.. కండలు తిరిగిన దేహం కోసం శ్రమిస్తారు. పైన కనిపిస్తున్న హీరో కూడా అదే చేశాడు. ఇంతకీ ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా? రాజా రాణి, వరుడు, సైజ్ జీరో, సైంధవ్ సినిమాలతో తెలుగులో బోలెడంత ఫేమ్ సంపాదించుకున్న ఆర్య. ఏడాదిగా కసరత్తులు తమిళంలో హీరోగా రాణిస్తున్న ఆర్య గతేడాది మిస్టర్ ఎక్స్ అనే సినిమా ఒప్పుకున్నాడు. లావుగా, కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫోటో అప్పటిదే! సినిమాకు సంతకం చేసిన మరుసటి నెల నుంచే కసరత్తులు చేయడం ప్రారంభించాడు. కండలు తిరిగిన దేహాన్ని సొంతం చేసుకున్నాడు. 'గతేడాది మార్చిలో సినిమా ఒప్పుకున్నాను. ఏప్రిల్‌లో వర్కవుట్స్ స్టార్ట్ చేశా.. సెప్టెంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. చూస్తుండగానే ఏడాది అయిపోయింది. 2023 ఏప్రిల్‌లో.. 2024 మార్చిలో నా లుక్ ఇలా ఉంది' అంటూ ఫోటోలు షేర్ చేశాడు. మైండ్ బ్లోయింగ్ ఇది చూసిన ఫ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మిస్టర్ ఎక్స్ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందులో మంజు వారియర్, శరత్ కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ కార్తీక్ విలన్‌గా నటిస్తున్నాడు. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. View this post on Instagram A post shared by Arya (@aryaoffl) చదవండి: 56 ఏళ్ల వయసులో నటుడి డేటింగ్.. విడిపోయామంటూ పోస్ట్.. -
ఒక్కటవుతున్నాం
శుభవార్తను పంచుకోవడానికి వేలంటైన్స్ డేను సందర్భంగా చేసుకున్నారు తమిళ నటుడు ఆర్య, నటి సాయేషా. ఈ జంట ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త కొన్నిరోజులుగా ప్రచారంలో ఉంది. ఆర్య, సాయేషా మాత్రం ఆ వార్తకు ‘ఊ’ అనలేదు ‘ఊహూ’ అని కూడా అనలేదు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘మేం ఒక్కటవుతున్నాం’ అని ప్రకటించారు. ‘‘మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో మేం పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మార్చిలో పెళ్లి. మా సరికొత్త ప్రయాణంలో మీ ప్రేమ, అభిమానంతోపాటు ఆశీర్వాదాలను కూడా కోరుకుంటున్నాం’’ అని ఓ లేఖలో ఆర్య, సాయేషా పేర్కొన్నారు. మార్చి మొదటివారంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది. ‘‘ఆర్యను మా ఇంటి అల్లుడిగా స్వాగతించడానికి ఆనందిస్తున్నాం’’ అని సాయేషా తల్లి షహీన్ అహ్మద్ పేర్కొన్నారు. ‘అఖిల్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సాయేషా ప్రస్తుతం తమిళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ∙ఆర్య, సాయేషా -
నా రాణి ఎక్కడుందో?
'వరుడు' చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన తమిళ హీరో ఆర్య తన జీవితాన్ని పంచుకునే రాణి ఇంకా తారసపడలేదంటున్నాడు. ప్లేబాయ్ నటుడిగా పేరొందిన ఆర్య....ఏ హీరోయిన్‌తో నటించినా వారిద్దరిపై వదంతులు పుట్టుకొస్తుంటాయి. ఆర్య వ్యవహార శైలి ఈ ప్రచారానికి దోహదపడే విధంగా ఉండడం గమనార్హం. తనతో నటించే హీరోయిన్లు అందరూ తనకు స్నేహితురాళ్లు అని అతను చెప్పటం విశేషం. అందులో నయనతార ప్రత్యేకం అనడం లాంటి వాక్యాలు మరింత సంచలనం కలిగిస్తుంటాయి. తాజాగా నయన్‌తార..ఆర్య మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఆర్య చెబుతున్న తాజా కబుర్లేమిటో తెలుసుకుందామా.. ప్ర : ప్రస్తుతం నటిస్తున్న రాజారాణి చిత్ర కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి? జ : దర్శకుడు అట్లీ చిత్ర కథను నెరేట్ చేసినప్పుడే సంభాషణలతో సహా వివరించారు. అవి చాలా క్యాచీగా, వినోదభరితంగా ఉన్నాయనిపించింది. మంచి ఎమోషనల్ సన్నివేశాలూ ఉన్నాచయి. పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధాలు చాలా వరకు ఆనందమయం కాకపోవడానికి కారణం ఇగోనే. ఈ కాన్సెప్ట్‌తో కూడిన కథను దర్శకుడు అట్లీ తెరపై అందంగా ఆవిష్కరించారు. ప్ర : ఈ చిత్రం కోసం మీరు ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారో చెబుతారా? జ : రాజారాణి చిత్రంలో నా పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. సగటు భర్తగా, మంచి ఎనర్జిటిక్‌తో కూడిన ప్రేమికుడిగా కనిపిస్తాను. ఈ విభిన్న తరహా పాత్రలకు బాడీ లాంగ్వాజ్ మార్పు కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అదేమిటో చిత్రం చూస్తే మీకే అర్థమవుతుంది. ప్ర : ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాల సంఖ్య పెరుగుతోంది. ఇంతకు ముందు మీరు ఈ తరహా చిత్రాలలో నటించారు కదా. ఎలాంటి అనుభూతి కలిగింది.? జ : ప్రతి నటుడికీ తన ప్రతిభపై నమ్మకం ఉంటుంది. నా వరకు నేను ఇతర హీరోలతో నటించేటప్పుడు చాలా కంఫర్టబుల్‌గా ఫీలయ్యాను. సాధారణంగా మల్టీస్టారర్ చిత్రాలంటే కథలు చాలా కొత్తగా ఉంటాయి. అదే విధంగా ప్రేక్షకులు తమ అభిమాన హీరోల కోసం చిత్రాలను చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్ర : ఆర్య వెడ్స్ నయనతార అంటూ రాజారాణి చిత్రం కోసం వెలసిన పోస్టర్ల గురించి ఏమంటారు? జ : అవి పూర్తిగా చిత్ర కాన్సెప్ట్‌ను అనుసరించి ముద్రిం చినవి. రాజారాణి చిత్రంలో నేను నయనతార భార్యాభర్తలుగా నటించాం. అలా చిత్ర ప్రచారం కోసం ప్రచురించినవే ఆ పోస్టర్లు. ప్ర : మీ గురించి ప్రచారం అవుతున్న వదంతుల గురించి పట్టించుకుంటారా? జ : అలాంటి ప్రచారాల గురించి పట్టించుకోను. ప్రేక్షకులకు నాపై అభిమానం ఉంది. అది చాలు. సినీ పరిశ్రమలో నేను ఒంటరినే. ప్ర : మరి తోడు కోసం అన్వేషిస్తున్నారా? జ : ప్రస్తుతం నా చుట్టూ ఉన్నవాళ్లందరూ తెరపై రాణులే. జీవితంలో నన్నేలే రాణి ఇంకా తారసపడలేదు.