20 ఏళ్లయినా అదే క్రేజ్‌.. స్టేజీపై అదరగొట్టేసింది! | Allu Arjun Arya Movie Actress Abhinayashree Dance For Aa Ante Amalapuram Song, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Abhinayashree: 'అ అంటే అమలాపురమే'.. 20 ఏళ్లయినా తగ్గని క్రేజ్‌!

Published Wed, May 8 2024 11:15 AM | Last Updated on Wed, May 8 2024 6:02 PM

Allu Arjun movie Arya Actress Abhinayashree Dance Goes Viral

ఐకాన్ ‍స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్య. సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. మే 7, 2004లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ ఈ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆర్య కేవలం సినిమా మాత్రమే కాదు.. నా కెరీర్‌ను మలుపు తిప్పిన క్షణం అంటూ అల్లు అర్జున్‌ ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఆర్య మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు టాలీవుడ్‌ ప్రమఖులు హాజరయ్యారు.

అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్‌ సినీ ప్రియులను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. 'అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం' ఓ రేంజ్‌లో అలరించింది. ఇప్పటికీ ఈ సాంగ్‌కు క్రేజ్‌ తగ్గలేదు. అయితే ఈ పాటకు డ్యాన్స్‌ చేసిన అభినయశ్రీ అందరికీ గుండెల్లో చోటు దక్కించుకుంది. తాజా ఈవెంట్‌కు హాజరైన ఆమె మరోసారి తన స్టెప్పులను అందరికీ పరిచయం చేసింది. అ అంటే అమలాపురం అంటూ డ్యాన్స్‌తో అదరగొట్టింది. 20 ఏళ్లయినా అదే స్టైల్‌తో డ్యాన్స్‌ చేసి అలరించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement