
పిల్లలకు పేరు పెట్టడానికి చాలామంది పెద్ద కసరత్తే చేస్తుంటారు. రకరకాల అక్షరాలను ఒకచోట చేర్చి కొత్త పేర్లకు శ్రీకారం చుడతారు. వాళ్లలాగే మన టీమ్ ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఎన్ని పుస్తకాలు తిరగేశారో కానీ.. మొత్తానికి తన కూతురుకి ‘ఆర్య’ అనే పేరును ఫిక్స్ చేశారు. రహానే, రాధిక దంపతులకు అక్టోబరు 5 న ఆర్య పుట్టింది. ఇన్నాళ్లకు ఆ పాప ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఫొటో కింద ‘ఆర్యా అజింక్యా రహానే’ అని కాప్షన్ ఇచ్చాడు రహానే.
అలా తన కుమార్తె పేరు ఆర్య అని పరోక్షంగా ప్రకటించాడు. ఆర్య అనగానే మగపిల్లాడు అనిపిస్తుంది. నిజానికి అది అమ్మాయి పేరు. ఆర్య అనే మాటకు పదహారేళ్ల యువతి, పార్వతి, దుర్గ, ధాన్యం, తల్లి, అత్తగారు.. ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. శంకరాచార్యుల వారి తల్లి పేరు ఆర్యాంబ. శ్రీరాముడిని సంబోధించే సమయంలో కూడా ‘ఆర్యపుత్రా’ అనటం తెలిసిందే! ఏమైనా ఇంత అందమైన అర్థవంతమైన పేరును తల్లిదండ్రుల చేత పెట్టించుకున్న ఆర్యకు శతాయుష్మాన్‌భవ!!
Comments
Please login to add a commentAdd a comment