
సాక్షి, హైదరాబాద్ : తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మనవడు ఆర్యను (నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పరామర్శించారు. ఎంపీ కవిత రెండో కుమారుడు ఆర్య తీవ్ర జ్వరంతో ఈ నెల 15వ తేదీ నుంచి రెయిన్ బో హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నాడు. నిన‍్న మధ్యాహ్నం కేసీఆర్ స్వయంగా హాస్పటల్‌కి వెళ్లి మనవడిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను ఆయన కోరారు. కాగా ఆర్యను ఇవాళ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment