
కథ వినకుండానే ఓకే చెప్పాను
దర్శకుడు బాలా పిలిచి మంచి కథ ఉంది చేస్తావా అని అడగ్గానే ఏలాంటి ప్రశ్న వేయకుండా ఓకే అన్నానని యువ నటుడు అధర్వ అన్నారు. బాలా దర్శకత్వంలో పరదేశీ చిత్రంలో అద్భుతమైన అభినయంతో ప్రశంసలు అందుకున్న ఈ నటుడు తాజాగా ఆయన నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం చండీవీరన్. కలవాణి చిత్రం ఫేమ్ సర్గుణం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కయల్ ఫేమ్ ఆనంది హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిత్రం ఈ నెల 7న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో అధర్వ మాట్లాడుతూ పరదేశీ చిత్రం తరువాత ఒక రోజు దర్శకుడు బాలా నుంచి పిలుపొచ్చిందన్నారు. అప్పుడాయన ఒక మంచి కథ ఉంది చేస్తావా? అని అడిగారన్నార న్నారు.
తాను మరో మాట లేకండా ఓకే అన్నానని చెప్పారు. ఆ తరువాత దర్శకుడు బాలా కథ వివరించారని అన్నారు. కథ, కథనాలు కొత్తగానూ, కథానాయకుడి పాత్ర తనకు నప్పేదిగానూ ఉండడంతో మంచి అవకాశంగా భావించినట్లు తెలిపారు. సింగపూర్‌లో పనిచేసే తాను స్వంత గ్రామానికి తిరిగి రావలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఒక సమయంలో ఊరంతా తనకు వ్యతిరేకం అవుతుందన్నారు. అందుకు కారణం ఏమిటి? ఆ సమస్య నుంచి ఎలా భయటపడ్డానన్నది చిత్ర కథ అని అధర్వ పేర్కొన్నారు.