విజయ్‌కు నో.. బాలాకు ఎస్‌ | heroine act to director bala movie | Sakshi
Sakshi News home page

విజయ్‌కు నో.. బాలాకు ఎస్‌

Published Wed, Feb 22 2017 1:50 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

విజయ్‌కు నో.. బాలాకు ఎస్‌

విజయ్‌కు నో.. బాలాకు ఎస్‌

టీనగర్‌: విజయ్‌ చిత్రానికి నో చెప్పిన నటి జ్యోతిక బాలా చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ‘తెరి’ చిత్రం తర్వాత విజయ్‌ నటించే చిత్రానికి రెండవసారి అట్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కాజల్‌ అగర్వాల్, సమంత, జ్యోతిక నటిస్తున్నారు. జ్యోతిక వద్ద దర్శకుడు అట్లి కథ చెబుతుండగా ఆమె కొన్ని మార్పులు చెప్పినట్లు సమాచారం. అందుకు ఓకే చెప్పిన అట్లి ఆ తర్వాత దాని గురించి బదులేమీ చెప్పకుండా చిత్రం షూటింగ్‌ ప్రారంభించారు.

దీంతో జ్యోతిక నిరుత్సాహపడి ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం బ్రహ్మ దర్శకత్వంలో ‘మగలిర్‌ మట్టుం’ చిత్రంలో నటిస్తున్నారు జ్యోతిక. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇలావుండగా ఈఓఎన్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థ, దర్శకుడు బాలా బీ స్టూడియోస్‌తో కలిసి కొత్త చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రముఖ హీరో నటించనున్నారు. ముందుగా ముఖ్యమైన కథాపాత్రలో నటింపజేసేందుకు జ్యోతికను ఒప్పందం చేసుకున్నారు బాలా. మార్చి ఒకటవ తేదీన ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. శశికుమార్, వరలక్ష్మి నటించిన ‘తారై తప్పటై’ చిత్రం తర్వాత ఈ చిత్రాన్ని బాలా రూపొందించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement