
సహస్ర చిత్రాల సవ్యసాచికి సత్కారం
వెయ్యి చిత్రాలకు సంగీతం అందించడం అంటే సాధారణ విషయం కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సంగీత రారాజు మన ఇళయరాజా అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, మరాఠి, ఆంగ్లం తదితర భాషల్లో మదురమైన పాటలకు బాణీలు కట్టారు. దర్శకుడు బాల తారై తప్పట్టై చిత్రం ఇళయరాజా కెరీర్‌లో సహస్ర చిత్రంగా నమోదు కానుంది.
పముఖ బాలీవుడ్ దర్శకుడు బాల్కి ఈ సహస్ర సంగీత దర్శకుడిని ముంబయిలో ఘనంగా సత్కరించనున్నారు. బాల్కి హిందీలో దర్శకత్వం వహించిన అమితాబ్ బచ్చన్ నటించిన సినీకామ్, పా చిత్రాలకు ఇళయరాజానే సంగీతం అందించారు. తాజాగా తెరకెక్కిస్తున్న అమితాబ్, ధనుష్‌ల చిత్రం షమితాబ్ చిత్రానికి ఆయనే సంగీ తం అందిస్తున్నారు. ఈ నెల 20న నిర్వహించనున్న ఇళయరాజా అభినందన సభలో నటుడు అమితాబ్‌బచ్చన్, గాయని లతా మంగేష్కర్, పి.సుశీల, ఎస్.జానకి తదితరులు పాల్గొననున్నట్లు సమాచారం.