![Heroine Sunaina Play Lead Role In A Science Fiction Movie - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/24/sunaina.jpg.webp?itok=TpM3XxYi)
సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రంలో నటి సునైనా నటించనుంది. ఆ మధ్య పలు చిత్రాల్లో వరుసగా నటించిన తెలుగు అమ్మాయి ఇటీవల కాస్త వెనుక పడింది. తాజాగా మళ్లీ బిజీ అవుతోంది. యోగిబాబు, కరుణాకరన్ కలిసి నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రం గురించి ప్రకటన రాగానే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇందులో హీరోయిన్‌గా నటి సునైనాను ఎంపిక చేసినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. ప్రవీణ్ అనే వర్థమాన నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. డెన్నీస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలో కథానాయకి పాత్ర సవాల్‌తో కూడుకున్నదన్నారు. ఆ పాత్రకు అనుభవం ఉన్న నటి నటిస్తే బాగుంటుందని భావించామన్నారు.
సునైనా మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీన్‌ప్లే తనను బాగా ఆకట్టుకుందన్నారు. దర్శకుడు కథ చెబుతున్నప్పుడు తాను ఆ కథతో పయనం అవుతున్న ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చింది. హీరో ప్రవీణ్ గురించి మాట్లాడుతూ నూతన నటుడు అన్నది సినిమాలో ముఖ్యం కాదని, వారికి ఇచ్చిన పాత్రకు ఎంత వరకు న్యాయం చేశారన్నదే ముఖ్యం అని అంది. ఈ చిత్రం కోసం నిర్వహించిన రిహార్సల్స్‌లో ప్రవీణ్ తనదైన శైలిలో ఉత్తమ నటనను ప్రదర్శించాడని పేర్కొంది. కాగా సాయి ఫిలింస్ స్టూడియోస్ పతాకంపై ఏ.విశ్వనాథన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment