సినీ ప్రపంచంలో సక్సెస్ కొంతమందిని త్వరగా పలరికరిస్తే.. మరికొంతమందిని చేరుకోవడానికి కాస్త సమయం తీసుకుంటుంది. ఆ సమయం వచ్చే వరకు ప్రయత్నిస్తూ వేచిచూసిన వారే స్టార్స్ అవుతారు. అలాంటి ఓ స్టారే.. సునైనా యెల్లా. పుట్టింది మహారాష్ట్రలోని నాగ్‌పూర్. తండ్రి హరీష్ యెల్లా, తల్లి సంధ్య యెల్లా. బీకామ్ పూర్తి చేసి, మోడల్‌గా మారింది. పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘శివాజీ’ చిత్రంతో రంగుల ప్రపంచంలోకి పరిచయం కావాల్సింది. కానీ, అందులో తను చేసిన పాత్ర ఎడిటింగ్ కత్తెరకు బలైంది. అదృష్టం తలుపు తట్టినట్లు.. ఈ సారి చిన్న పాత్రతో కాదు, ఏకంగా హీరోయిన్ అవకాశమే ఆమెను వరించింది. 2005లో ‘కుమార్ వర్సెస్ కుమారి’ అనే తెలుగు చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తమిళంలో ‘కడలిల్ విసంతిన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తమిళ ‘బిగ్‌బాస్’ సీజన్ 4 కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లింది.
అలా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తర్వాత తమిళంతో పాటు పలు తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో చాలా గ్యాప్ తీసుకొని చేసిన ‘రాజ రాజ చోర’ చిత్రం మంచి విజయం సాధించడంతో వరుసగా ‘లాఠీ’, ‘రెజీనా’ వంటి పెద్ద సినిమాలు ఆమె కాల్‌షీట్స్ తీసుకున్నాయి. ప్రస్తుతం సోనీలివ్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘వండర్ విమెన్’, ‘మీట్ క్యూట్’ లతో వెబ్ ప్రేక్షకులను అలరిస్తోంది.
‘బ్రేకప్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ మధ్యనే పుస్తకాలు చదవడం మొదలుపెట్టా. పుస్తక పఠనం వల్ల ఎంతో ఉపశమనం దొరుకుతోంది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు – సుౖనైనా యెల్లా
Comments
Please login to add a commentAdd a comment