నాకిప్పుడు బాయ్‌ఫ్రెండ్ లేడు | i don't have boy friend | Sakshi
Sakshi News home page

నాకిప్పుడు బాయ్‌ఫ్రెండ్ లేడు

Published Fri, Sep 12 2014 11:49 PM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

నాకిప్పుడు బాయ్‌ఫ్రెండ్ లేడు - Sakshi

నాకిప్పుడు బాయ్‌ఫ్రెండ్ లేడు

తనకిప్పుడు బాయ్ ఫ్రెండ్ లేదంటున్నారు నటి సునైనా. పేరుకు తగ్గట్టే సొగసైన నయనాల సుందరీమె. ఇంతకుముందు కంటే కాస్త బరువు,పరువాలు పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ అభినయంలోనూ ఆరితేరారన్నది నీర్‌పరవై చిత్రంతో నిరూపించుకున్నారు. తమిళంలో కథానాయికగా రాణిస్తున్న ఈ భామ పదహారణాల తెలుగమ్మాయి. అయితే ఆశించిన స్థాయిని మాత్రం చేరుకోలేదు. అందుకు తన వంతు కృషి, శ్రమ చేస్తున్నట్లు చెబుతున్నారు సునైనా. ఇటీవల అనూష అంటూ పేరు మార్చుకుని మళ్లీ అసలు పేరుకే మారిపోయారు. ఆ కథేంటో ఈ సుందరి యవ్వారం ఏమిటో చూద్దాం.
 
నీర్‌పరవై చిత్రం తరువాత తెరపై కనిపించలేదే?
నిజం చెప్పాలంటే నీర్‌పరవై చిత్రం నా ఇమెజ్‌ను హోటల్‌గా మార్చేసింది. నే ను మంచి నటినేనని తమిళ ప్రేక్షకులకు నమ్మకాన్ని కలిగించిన చిత్రం అ ది. అయితే ఆ తరువాత వచ్చిన అవకాశాలన్నీ ఆ తరహాలోనే ఉండటం వల్ల అంగీకరించలేదు. అందుకే ఈ గ్యాప్.
 
ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
శ్రీకాంత్‌కు జంటగా నంబియా ర్, కృష్ణ సరసన వన్నం చిత్రాలు చేస్తున్నాను. ఈ రెండు చిత్రాలలో తన పాత్రలు వేర్వేరు గా ఉంటాయి.
 
ఈ చిత్రంలో నాగర్‌కోవిల్ యాసలో మా ట్లాడుతారటగా?
అవును. చిత్రం లో విజయ్ సేతుపతి, కృష్ణ పోటీపడి నటిస్తున్నారు. అలాంటప్పుడు నా వంతు నేనూ బాగా నటించాలిగా. నీర్‌పరవై చిత్రంలో నటనకు ఈ వర్నం చిత్రంలో నటనకు చాలా మార్పు కనిపిస్తుంది. షూటింగ్ స్పాట్‌లో నాకు నాగర్‌కోవిల్ యాస నేర్పించారు. మొదట్లో మాట్లాడటం కాస్త కష్టం అనిపించింది.
 
నటిగా ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చింత ఉందా?
అందుకని మూలన కూర్చుని బాధపడితే ఫలితం ఉంటుందా? అందరికీ మంచి కాలం అంటూ ఒకటొస్తుంది.
 
తొలి రోజుల్లో అందాలారబోసినట్లున్నారు?
నాయికగా పరిచయమైయిన తొలి రోజుల్లో ఒకటి రెండు చిత్రాల్లో అలా నటించిన విషయం నిజమే. ఇప్పుడు అలాకాదు. కథ విన్న తరువాతనే కాల్‌షీట్స్ ఇస్తున్నాను. గ్లామర్ విషయంలో నాకం టూ కొన్ని హద్దులున్నాయంటూ ముందే  చెప్పేస్తున్నాను. ఇప్పుడు నన్నెవరూ వివాదాల నటి అని పోకస్ చేయరు.
 
తమిళనాడులో నివాసం ఏర్పరుచుకోలేదే?

నా మాతృభాష తెలుగు. మాకు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉంది. షూటింగ్‌లుంటే చెన్నైకి వస్తాను. ఖాళీ దొరికితే నా సొంత ఊరు నాగపూర్‌కు వెళ్లతాను.
 
ఇటీల పేరు మార్చుకున్నట్లున్నారు?
సునైనా అన్నది అందరికీ తెలిసిన పేరు. అయితే న్యూమరాలజీ ప్రకారం అనూషగా మార్చుకున్నాను. అయినా ఆ పేరు అచ్చిరాలేదు. దీంతో మళ్లీ అసలు పేరుకు వచ్చేశాను. అయితే నా పేరు పక్కన ఆంగ్ల అక్షరం ఏను అదనంగా చేర్చుకున్నాను. సునైనా అనే పేరును ఇక మార్చుకునే ప్రసక్తే లేదు.
 
ది దర్టిపిక్చర్, క్వీన్ లాంటి చిత్రాల్లో నటిస్తారా?

ఎందుకు నటించను? నటించడానికి సిద్ధమైన తరువాత ఎలాంటి పాత్రనయినా చెయ్యగలననే నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. ది దర్టిపిక్చర్, క్వీన్ లాంటి చిత్రాలు తమిళంలో తెరక్కెక్కడం మంచిదే. అలాంటి పాత్రలో నటించాలని ఎవరయినా అడిగితే అంతకంటే సంతోషం ఏముంటుంది?
 
బాయ్ ఫ్రెండ్ ఉన్నారా?
నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఇప్పుడూ నిజమే చెబుతున్నాను. ఇప్పుడు నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు. వెంటనే ఒకప్పుడుండేవారా? అతనెవరు? అని అడక్కండి. నేను కాదలిల్ విళుందేన్ (ప్రేమలో పడ్డాను) చిత్రంలో మాత్రమే నటించాను. ఎవర్నీ ప్రేమించలేదు. నిజంగా నన్ను నమ్మండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement