నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా ఆమె విపరీతమైన జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారని తండేల్(Thandel) సినిమా దర్శకుడు చందు మొండేటి తెలిపారు. అంతేకాదు ఆమెకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని, అందుకే ఆమె ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రాలేదని చెప్పాడు.
అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సాయి పల్లవి మినహా మిగతా యూనిట్ అంతా హాజరైంది. దీంతో నేచురల్ బ్యూటీ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఈవెంట్‌కి రాకపోవడానికి గల కారణం ఏంటని ఆరా తీశారు. సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ చందునే క్లారిటీ ఇచ్చాడు.
బెడ్ రెస్ట్
‘సాయి పల్లవి కొన్ని రోజులుగా జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. అందుకే ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి రాలేకపోయింది. ఆమె ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మళ్లీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది’ అని చందూ మొండేటి తెలిపారు.
ఆమీర్ చేతుల మీదుగా హిందీ ట్రైలర్
తండేల్ హిందీ ట్రైలర్‌ని బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండేల్ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఫెంటాస్టిక్ గా ఉంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. దేవిశ్రీ చేసిన డింకచిక డింకచిక సాంగ్ నా ఫేవరెట్. బేసిగ్గా నాకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదు కానీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. తండేల్ ట్రైలర్ లో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ వున్నాయి. చైతన్య ఫెంటాస్టిక్ యాక్టర్. ఐడియల్ కోస్టార్. తనతో వర్క్ చేయడం చాలా అమెజింగ్ ఎక్స్ పీరియన్స్’ అన్నారు.
నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘సాయి పల్లవి తో చేసిన లవ్ స్టోరీ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు చూసి చాలా బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు తండేల్ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు లాంచ్ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. అరవింద్ గారితో చేసిన 100% లవ్ నా కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్. తండేల్’ కూడా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాను.చందు చాలా అద్భుతంగా సినిమాని తీశాడు. దేవిశ్రీ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. మీరంతా ఫిబ్రవరి 7న సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment