ఎవరైనా అందంగా నాట్యం చేస్తే.. అచ్చం నెమలిలా నాట్యం చేసినట్లుందని పొగుడుతాం. అంటే నెమలిని మించిన నాట్యం ఎవరు చేయలేరని అర్థం.నెమలి నాట్యాన్ని వర్ణించడం చాల కష్టం. నెమలి నాట్యం చేయడం చూస్తే.. ప్రకృతిలో ఇంతకు మించిన అందమైన దృశ్యం ఉంటుందా అని అనిపించక మానదు. అలాంటి అనుభూతి తండేల్(Thandel) సినిమా ద్వారా పొందుతారట.
సాయి పల్లవి(Sai Pallavi ), నాగచైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘హైలెస్సో హైలెస్సా... నీవైపే తెరచాపని తిప్పేసా...’ అంటూ సాగే పాట ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. అందులో సాయి పల్లవి వేసే స్టెప్పు ఒకటి బాగా వైరల్ అయింది. పాట ఎంత వినసొంపుగా ఉందో.. ఆ డ్యాన్స్ కూడా అంతే చూడ ముచ్చటగా ఉంది. అయితే లిరికల్ వీడియోలో చూసింది తక్కువేనట. ఆ పాటలో సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులేసిందట.
నెమలిని గుర్తు చేస్తుంది
ఇప్పుడు ఎక్కడ చూసిన హైలెస్సో హైలెస్సా..పాటే వినిపిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ మెస్మరైజ్ వాయిస్‌తో వేరే స్థాయికి తీసుకెళ్లారు. ఈ పాటలో సాయి పల్లవి వేసిన హుక్ స్టెప్ అయితే నెక్ట్స్ లెవెల్ అనే చెప్పాలి. మెలికలు తిరుగుతూ సాయి పల్లవి చేసిన డాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్‌లో వచ్చే మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఆమె తన బాడీని కదిలించింది. అయితే లిరికల్ వీడియోలో చూసింది చాలా తక్కువేనట. మొత్తం పాటలు దాదాపు ఒక నిమిషం పాటు సాయి పల్లవి నాన్‌స్టాప్‌గా డ్యాన్స్ చేస్తుందట. ఆమె వేసిన స్టెప్పులు నెమలి నాట్యాన్ని గుర్తు చేస్తుందని నిర్మాత బన్నీవాసు చెబుతున్నాడు. లవ్‌స్టోరీలో కూడా సాయి పల్లవి ఇలాంటి నెమలి స్టెప్పులు వేసింది. మళ్లీ తండేల్‌లో కూడా అలాంటి డాన్సే చేసింది. సాయి పల్లవి నెమలిలా మెలికలు తిరిగుతూ డాన్స్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంది.
రెండోసారి..
నాగచైతన్య, సాయి పల్లవి తొలిసారి లవ్‌స్టోరీ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం..2021లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ తండేల్ సినిమా కోసం ఒకటయ్యారు.కార్తికేయ--2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలవడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment