ఆ యాప్‌లు చెల్లవు | - | Sakshi
Sakshi News home page

ఆ యాప్‌లు చెల్లవు

Published Fri, Jul 12 2024 2:20 AM | Last Updated on Fri, Jul 12 2024 9:29 AM

ఆ యాప

ఆ యాప్‌లు చెల్లవు

కరెంటు బిల్లు..
 

పాతపట్నం:

విద్యుత్‌ బిల్లుల చెల్లింపులో కీలకమైన మార్పులు జరిగాయి. డిజిటలైజ్‌ అయ్యాక చాలా మంది విద్యుత్‌ బిల్లులను ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఇతర యూపీఐల ద్వారా నేరుగా కట్టేసేవారు. కానీ ఇప్పుడలా కుదరదు. యూపీఐ యాప్‌ ల ద్వారా విద్యుత్‌ బిల్లుల చెల్లింపులకు ఏపీఈపీడీసీఎల్‌ స్వస్తి పలికింది. ఇక నుంచి కేవలం ఏపీఈపీడీసీఎల్‌ వెబ్‌ సైట్‌, ఈస్ట్రన్‌ పవర్‌ మొబైల్‌ యాప్‌ల ద్వారా మాత్రమే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. థర్డ్‌ పార్టీ యాప్‌లైన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఇతర యూపీల ద్వారా చెల్లింపులకు నో చెప్పింది. ఇందుకోసం ఈస్ట్రన్‌ పవర్‌ మొబైల్‌ యా ప్‌ను సిద్దం చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనల నేపథ్యంలో ఇకపై ఏపీఈపీడీసీఎల్‌ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా మాత్రమే విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని సీఎండీ పృథ్వీతేజ్‌ ఆదేశాలు జారీ చేశారు.

కొత్త మార్గదర్శకాలు

విద్యుత్‌ బిల్లులను చాలామంది వినియోగదారులు కౌంటర్లలో చెల్లిస్తారు. గ్రామాల్లో నెలకు ఒకసారి ఏపీఈపీడీసీఎల్‌కు సంబంధించిన సిబ్బంది వచ్చి కట్టించుకుంటున్నారు. మరి కొందరు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెందిన వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ లలో చెల్లిస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలన్నీ వాటి నుంచే జరుగుతున్నాయి. ముఖ్యంగా గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఆర్‌బీఐ భారత్‌ బిల్‌ పేమెంట్స్‌ మార్గదర్శకాల ప్రకారం నేరుగా యాప్‌ల నుంచి చెల్లింపులను నిలిపివేశారు.

పేమెంట్‌ సులభం

సాధారణంగా యాప్‌ల ద్వారా బిల్లు చెల్లించడం చాలా సులువుగా ఉండడంతో చాలా మంది వినియోగదారులకు ఆ విధానంలో కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్‌ బిల్లుల చెల్లింపు విషయంలో కూడా సులభమైన పేమెంట్‌ సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మేర కు ఏపీఈపీడీసీఎల్‌ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేసింది. ఇప్పటికే వీటిని ప్రజలకు చేరువ చేసింది.

డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం

Aఆన్‌లైన్‌లో విద్యుత్‌ బిల్లులు చెల్లించాలనుకునే వినియోగదారులు ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఈస్ట్రన్‌ పవర్‌ యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. దానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలి. దీని ద్వారా చాలా సులభంగా బిల్లులు కట్టవచ్చు.

A వెబ్‌సైట్‌ ద్వారా బిల్లులు చెల్లించాలనుకునే వినియోగదారులు డబ్లూడబ్లూడబ్లూ.ఏపీఈస్ట్రన్‌పవర్‌.కమ్‌ ద్వారా పేమెంట్‌ చేయవచ్చు.

A యాప్‌, వెబ్‌సైట్‌లలో బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌లతో పాటు డెబిట్‌, క్రెడిట్‌, నెట్‌ బ్యాంకింగ్‌, వాలెట్లను కూడా ఉపయోగించుకోవచ్చు.

 

 

విద్యుత్‌ బిల్లుల చెల్లింపులో కొత్త నిబంధనలు

ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలతో ఇక కుదరదు

ఈస్ట్రన్‌ పవర్‌ మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా బిల్లుల చెల్లింపులు

చాలా సులువు

ఈస్ట్రన్‌ పవర్‌ యాప్‌ను, వెబ్‌సైట్‌ల ద్వారా వినియోగదారులు చాలా సులభంగా విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చు. ఈ మేరకు పాతపట్నంతో పాటు, టెక్కలి డివిజన్‌, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినియోగదారులకు విద్యుత్‌ శాఖ ఉద్యోగులు ద్వారా అధికారులు అవగాహన కల్పిస్తున్నాం. ఆర్‌బీఐ ఆదేశాలను అనుసరించి సంస్థ ఈ విధమైన చర్యలు చేపట్టింది.

– జి.ప్రసాదరావు,

డీఈఈ, విద్యుత్‌శాఖ, పాతపట్నం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement