
చంద్రబాబు చిమ్మినకాలకూటమి విషం
మండుటెండలో పండుటాకులు
రెండోరోజూ అవే కష్టాలు
‘చంద్రబాబూ మా ఉసురు నీకు తగులుతుంది..’
పింఛన్ డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన
ఓ వృద్ధుడి శాపమిది.
‘బాబూ.. మాకు అన్యాయం చేయడం తగదు..’
బ్యాంకు క్యూలో నిలుచోలేక ఓ పింఛన్‌దారు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘చంద్రబాబూ.. మమ్మల్ని బతకనీయవా..’ ఎండలకు తట్టుకోలేక మరో పెన్షన్ లబ్ధిదారు సూటిగా వేసిన ప్రశ్న ఇది. చంద్రబాబు చిమ్మిన కాల‘కూటమి’ విషం పింఛన్‌దారులను నరకయాతన పెడుతోంది. వలంటీర్ల సేవలు వద్దంటూ మొదట ఆయనే తనవాళ్లతో ఫిర్యాదు చేయించారు, బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేయాలంటూ ఎన్నికల కమిషన్‌కు సిఫార్సులు చేశారు, ఇప్పుడు లబ్ధిదారులు అవస్థలు పడుతుంటే.. ప్రభుత్వమే ఇదంతా చేయించిందంటూ నీచ రాజకీయాలకు తెర లేపుతున్నారు. కానీ నిజం తెలిసిన జనాలు మాత్రం ప్రతి బ్యాంకు క్యూలోనూ చంద్రబాబు వైఖరిని దునుమాడుతున్నారు.
మమ్మల్ని బతకనివ్వరా..?
నాయనా చంద్రబాబు నాయుడా మాకు చివరి దశలో చుక్కలు చూపిస్తున్నావు. ఇలా మండుటెండలో బ్యాంకుల చుట్టూ డేకిరిస్తూ కాళ్లాడని నాలాంటివారి ఉసురు పోసుకుంటున్నావు. ప్రతి నెలా కడుపులో చల్ల కదలకుండా ఇంటికి పెన్షన్ తెచ్చి ఇచ్చేవారు. ఇదేం ఘోరం బాబూ...ఎవరికి అడిగినా నీ పుణ్యమే ఇది అంటున్నారు.
– కుప్పిలి రాములు, మర్రిపాడుకాలనీ, సవలాపురం, ఆమదాలవలస నియోజకవర్గం
మా ఉసురు చంద్రబాబుకి తగులుతుంది
పింఛన్ కోసం నా బోటి ముసలోళ్లను ఇన్ని ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబుకి మా ఉసురు తప్పకుండా తగులుతుంది. వలంటీర మ్మ ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయం మా ఇంటికి వచ్చి రూ.3000 లు పింఛన్ డబ్బులు చేతికి అందించేది. ఇప్పుడు పింఛన్ కోసం గుబులుగా ఉంది. నడ్డి ఈడ్చూకుంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా. బాబు చేసిన పాపం మాకు శాపంగా మారింది. మా ఉసురు ఊరికినే పోదు. – తమ్మినాన లత్సమ్మ, పింఛన్ లబ్ధిదారు,
వజ్రపుకొత్తూరు మండలం

చంద్రబాబు చిమ్మినకాలకూటమి విషం

చంద్రబాబు చిమ్మినకాలకూటమి విషం

చంద్రబాబు చిమ్మినకాలకూటమి విషం
Comments
Please login to add a commentAdd a comment