
ఉదయం 9 గంటలకు నంబూరు బైపాస్ నుంచి సీఎం యాత్ర ప్రారంభం
11 గంటలకు సీకే కన్వెన్షన్‌లో చేనేత కార్మికులతో ముఖాముఖి
కేసరపల్లి శివారులో రాత్రి బస
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజైన శనివారం(ఏప్రిల్ 13) షెడ్యూల్‌ను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ శుక్రవారం రాత్రి బస చేసిన నంబూరు బైపాస్ నుంచి శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.
కాజా, మంగళగిరి బైపాస్ మీదుగా 11 గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకొని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత విజయవాడలో వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్‌సింగ్ రోడ్డు, పైపుల రోడ్డు, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం
గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ‘గుంటూరు జిల్లా సిద్ధమా?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్‌తో కలిసి బస్సు యాత్రలో పాల్గొన్నారు. –సాక్షి,అమరావతి