నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. | Today siddham meeting bus route map | Sakshi
Sakshi News home page

నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..

Published Sat, Apr 20 2024 4:28 AM | Last Updated on Sat, Apr 20 2024 4:28 AM

Today siddham meeting bus route map  - Sakshi

ఉదయం 9 గంటలకు గోడిచర్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభం

మధ్యాహ్నం అచ్యుతాపురం వద్ద భోజన విరామం

సాయంత్రం చింతపాలెం వద్ద బహిరంగ సభ

చిన్నయపాలెం వద్ద రాత్రి బస 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజైన శనివారం(ఏప్రిల్‌ 20) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ శుక్రవారం రాత్రి బస చేసిన గోడిచర్ల ప్రాంతం నుంచి శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.

నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్‌ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చింతపాలెం వద్దకు సీఎం జగన్‌ చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బయ్య­వరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అసకపల్లి మీదుగా చిన్నయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు. 

కాకినాడ జిల్లా సిద్ధమా?
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం కాకినాడ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ‘కాకినాడ జిల్లా సిద్ధమా?’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ప్రజలు కూడా భారీ సంఖ్యలో బస్సు యాత్రలో పాల్గొని సీఎం జగన్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.  –సాక్షి, అమరావతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement