నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కేసీఆర్‌ పర్యటన | KCR Bus Yatra In Mahabubnagar District | Sakshi
Sakshi News home page

నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కేసీఆర్‌ పర్యటన

Published Fri, Apr 26 2024 11:17 AM | Last Updated on Fri, Apr 26 2024 11:17 AM

KCR Bus Yatra In Mahabubnagar District

సాక్షి, మహబూబ్‌నగర్‌: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. నేడు జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. పాలమూరు పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్ర.. సాయంత్రం జడ్చర్ల నుంచి ప్రారంభం కానుంది. జడ్చర్ల నుండి మహబూబ్‌నగర్‌ వరకు భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్‌ టవర్‌ వద్ద కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడనున్నారు.

రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇంట్లో బస చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపనున్నారు. రేపు(శనివారం) నాగర్‌కర్నూల్‌కు బస్సు యాత్ర చేరుకోనుంది. నాగర్ కర్నూల్, మహబుబ్ నగర్ అభ్యర్థులకు మద్దుతుగా సభ నిర్వహించనున్నారు. భారీగా జనసమీకరణకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు కార్యాచరణ చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement