
ఉదయం 9 గంటలకు ఎస్‌టీ రాజపురం నుంచి సీఎం యాత్ర ప్రారంభం
మధ్యాహ్నం ఉందురు క్రాస్ వద్ద భోజన విరామం
గొడిచర్ల క్రాస్ వద్ద రాత్రి బస
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 18వ రోజైన శుక్రవారం(ఏప్రిల్ 19) షెడ్యూల్‌ను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి బస చేసిన ఎస్‌టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.
రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆయన ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
తూర్పుగోదావరి జిల్లా సిద్ధమా?
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ‘తూర్పుగోదావరి జిల్లా సిద్ధమా?’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రజలు కూడా తామంతా సిద్ధమంటూ పెద్ద సంఖ్యలో సీఎం జగన్‌తో కలిసి బస్సు యాత్రలో పాల్గొన్నారు. –సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment