![World Handicrafts Conference In Mangalagiri - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/30/chenetha.jpg.webp?itok=uTkN82lX)
మంగళగిరి/నాతవరం (అనకాపల్లి జిల్లా): చేనేత కేంద్రంగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన మంగళగిరిలో ప్రపంచ చేనేతల సదస్సు ఆదివారం నిర్వహించనున్నారు. నగరంలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న ఆర్‌ఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించే సదస్సు ఏర్పాట్లను ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి శనివారం పరిశీలించారు.
వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సదస్సు నిర్వహించనున్నట్లు చిరంజీవి తెలిపారు. చేనేత సామాజిక వర్గాలకు చెందిన ఎన్నారైలు సభ్యులుగా ఏర్పడిన వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్‌లో చేనేత కుటుంబాల అభివృద్ధి కోసం వివిధ అవగాహనా శిబిరాలు నిర్వహిస్తామన్నారు. సదస్సుకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు చిరంజీవి తెలిపారు.
చేనేత కార్మికులకు రూ.3700 కోట్ల లబ్ది..
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు వివిధ పథకాల రూపంలో రూ.3700 కోట్ల లబ్ధి చేకూర్చిందని రాష్ట్ర ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. అనకాపల్లి జిల్లాలోని గునుపూడిలో శనివారం చేనేత కారి్మకులు మగ్గాలపై తయారు చేస్తున్న పట్టుచీరలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
ఆప్కో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 900 సొసైటీలు ఉన్నాయని,గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉంచిన బకాయిలను రూ.40 కోట్లు చెల్లింపులు చేసి సొసైటీలను ఆరి్థకంగా బలోపేతం చేశారని చెప్పారు. కొత్తగా మరో 50 షోరూమ్‌లు ఏర్పాటు చేసేందుకు దృష్టి సారించామన్నారు. చేనేతలకు రెండు ఎమ్మెల్సీలు, ఎంపీ పదవులిచ్చి జగన్ రాజకీయంగా పెద్దపీట వేశారన్నారు. పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: నర్సాపూర్-ధర్మవరం రైలుకు తప్పిన ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment