ఆరోగ్య శ్రీ సేవలకి ఎక్కడా అంతరాయం కలగలేదు | DR YSR Aarogyasri Health Care Trust Reacts On Fire Incident | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శ్రీ సేవలకి ఎక్కడా అంతరాయం కలగలేదు

Published Wed, Apr 12 2023 7:02 PM | Last Updated on Wed, Apr 12 2023 7:04 PM

DR YSR Aarogyasri Health Care Trust Reacts On Fire Incident - Sakshi

సాక్షి,  విజయవాడ: మంగళగిరి(గుంటూరు)లోని డాక్టర్‌ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందంటూ వస్తున్న కథనాలపై ట్రస్ట్‌ స్పందించింది. జరిగింది స్వల్ప ప్రమాదమేనని, ఆ ఘటనతో ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని ఓ ప్రకటన విడుదల చేసింది.  

ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రి హెల్త్ కేర్ ట్రస్ట్. మంగళగిరి డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కాలి  పొగలు వ్యాపించడంతో ఉద్యోగులని‌ బయటకి పంపించాం. దీని వలన ఎటువంటి నష్టం వాటిల్లలేదు. అగ్నిమాపక శాఖ సకాలంలో స్పందించి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. సేవలకి ఎక్కడా అంతరాయం కలగలేదు అని ఆ ప్రకటనలో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement