ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కల్యాన్ కొత్తపార్టీకి సమయం ఆసన్నమైంది. నగరంలోని హైటెక్స్ వేదికగా పార్టీ ఏర్పాటు అంశానికి సంబంధించి ఆయన శుక్రవారం ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే పవన్ ఏర్పాటు చేయబోయే పార్టీ పేరు జనసేనగా ప్రచారం కొనసాగుతోంది. ఈ అంశంపై ఆయన రేపు 45నిమిషాలపాటు ప్రసంగిస్తారు. ఇప్పటివరకూ చోటు చేసుకున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆయన పార్టీ ఏర్పాటుకు సంబంధించి విషయాలను వెల్లడించేందుకు సిద్ధమైయ్యారు. దీనికి సంబంధించి ఆయన విలేకర్లకు ప్రత్యేక ఆహ్వానం కూడా పంపారు. పార్టీ విషయంలో పవన్ కల్యాణ్ నుంచిగానీ ఆయన సన్నిహితుల నుంచిగానీ ఇప్పటివరకు ఒక్కమాట బయటకు రాకపోయినప్పటికీ ఇందుకు సంబంధించిన ప్రచారం మాత్రం జోరుగా కొనసాగింది.