
డొక్కా మాణిక్య వరప్రసాద్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెట్టరని, ప్రెస్ కాన్ఫరెన్స్ మాత్రమే పెడతారని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. కొత్త పార్టీ పెట్టడం అనేది ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినంత సులువు కాదని చెప్పారు. తాను, సీఎం ఇద్దరమూ నియోజకవర్గ స్థాయి నేతలం మాత్రమేన్నారు. విధేయులమని భావించి అధిష్టానం తనని మంత్రిని, కిరణ్‌ను సీఎంను చేసిందని తెలిపారు.
ముఖ్యమంత్రి కరడుగట్టిన కాంగ్రెస్ వాదని డొక్కా పేర్కొన్నారు. 24 గంటలూ రెండు చేతులతో సంతకాలు పెట్టినా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంలేదన్నారు. ఆయనకు బ్యాక్ ఆఫీస్ ఉందనేది కొందరి నేతల అభిప్రాయం అన్నారు.