
మంద కృష్ణ మాదిగ
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావించింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావించింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. మహాజన సోషలిస్టు పేరుతో ఆయన ఈ కొత్తపార్టీ పెట్టారు.
చట్టసభల్లో తమ వాణి వినిపించేందుకు కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు మందకృష్ణ మాదిగ కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో సామాజిక న్యాయం లేదని ఆయన అన్నారు. తమ సమస్యలపై ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా పరిష్కారం దొరకడంలేదని చెప్పారు. అందుకే మహాజన సోషలిస్టు పార్టీని పెట్టినట్లు ఆయన తెలిపారు.