వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: ఓరుగల్లుకు చెందిన నేత సారథ్యంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మహాజన సోషలిస్ట్ పార్టీ(ఎంఎస్‌పీ) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ జిల్లా నేత కావడం విశేషం. వరంగల్ నగర పరిధిలోని న్యూశాయంపేటకు చెందిన మంద కొమురమ్మ, మంద చిన్న ఓదెలు మూడో సంతానంగా కృష్ణ జన్మించారు. తొలుత విప్లవ భావాలతో సాధారణ జీవితాన్ని గడిపిన కృష్ణ.. 1992లో దళిత, విప్లవ నేతలు కేజీ సత్యమూర్తి, సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో జరిగిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ ఏర్పాటు చేశారు.
ఆయన నేతృత్వంలో 1994 జులైలో జిల్లాలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం ప్రారంభమైంది. రాష్ట్రంలో మాదిగలను ఐక్యం చేశారు. రెండు దశాబ్దాలుగా మాదిగ దండోరా, వికలాంగుల హక్కుల ఉద్యమం నడిపారు. తెలంగాణ ఉద్యమంలో కూడా భాగస్వాములయ్యూరు. అంధుల ఆరాధ్య దైవం లూయీ బ్రెయిలీ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఎంఎస్‌పీ ఆవిర్భావ ప్రకటన చేశారు. పార్టీ ఏర్పాటుతో ఎమ్మార్పీఎస్ శ్రేణులు హర్షం ప్రకటించాయి. జిల్లాలో పార్టీని విస్తరింపజేసేందుకు ఈ నెల 6, 7 తేదీల్లో ఎర్రగట్టు వద్ద రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. తాను పుట్టిన గడ్డ నుంచే పార్టీని బలోపేతం చేయాలని మంద కృష్ణమాదిగ భావిస్తున్నారు.
స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం
నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఇన్‌చార్జ్ డిప్యూటీ డైరక్టర్, అదనపు జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య సూచించారు. ఈ విద్యాసంవత్సరంలో స్కాలర్‌షిప్‌ల రెన్యూవల్ కోసం 20,344 మంది విద్యార్థులు అర్హులని తెలిపారు.
ఓరుగల్లు నేత సారథ్యంలో కొత్త పార్టీ
Published Sun, Jan 5 2014 5:00 AM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM
Advertisement
Advertisement