కిరణ్ సభకు ఆదిలోనే హంసపాదు | Collector denies permission for Kiran kumar reddy's meeting in Rajahmundry | Sakshi
Sakshi News home page

కిరణ్ సభకు ఆదిలోనే హంసపాదు

Published Mon, Mar 10 2014 1:11 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కిరణ్ సభకు ఆదిలోనే హంసపాదు - Sakshi

కిరణ్ సభకు ఆదిలోనే హంసపాదు

రాజమండ్రి : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభకు జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. ఈనెల 12వ తేదీ గురువారం  సాయంత్రం 4 గంటలకు రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో పార్టీ పేరు సహా జెండా, ఏజెండా ప్రకటిస్తామని  కిరణ్ కుమార్ రెడ్డి  ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే సభకు అనుమతి లేకపోవటంతో కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. దాంతో బహిరంగ సభ ఏర్పాట్లలో నిమగ్నమైన ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్లు సభా స్థలిని మార్చే ఆలోచనలో ఉన్నారు. కాగా సభ ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఇంకా నిర్ణయం కావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement