తాను రాజకీయాలోకి రావడం ఖాయమని, కాలమే దీన్ని నిర్ణయించిందని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. అభిమానులతో ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రవేశంపై ఆయన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నిల్లోపే సొంతంగా కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. తమిళనాడులోని 234 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు.