ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాజమండ్రి మాజీ లోక్సభ సభ్యుడు చిట్టూరి రవీంద్ర కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడలో విభజనకు నిరసనగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రవీంద్ర ప్రసంగిస్తూ... కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే జనవరిలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో ముద్దాయి కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ఆరోపించారు. అక్టోబర్ 1 నుంచి సమైక్య ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామన్నారు. ఆ సెమైక్య సెగ ఢిల్లీని తాకుతుందని చిట్టూరి రవీంద్ర తెలిపారు.