united movement
-
సమైక్య ఉద్యమమే విరుగుడు!
అభిప్రాయం శాసనసభలో రోజాను ఎదుర్కోవడం సాధ్యం కాక అప్రజాస్వామికంగా ఏడాది పాటు బహిష్కరించారు. ఒకవేళ రోజాను ఐదేళ్లూ సభకే రాకుండా మందబలంతో పాలకపక్షం శాసనసభలో తీర్మానం చేయగలిగినా ప్రజాకోర్టులో ఇప్పటికే వారు దోషులుగా నిలబడ్డారు. ఏపీ ముఖ్యమంత్రిలో ఇంతటి అసహనం, ఆందోళన, అభద్రత ఎందుకు గూడు కట్టుకున్నాయి? ఆయన శైలిలో ఆత్మస్థుతి పరనింద అధికమయింది? ‘నేను నిప్పులా బ్రతికాను’ నాతెలివితేటలను చూసి సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ‘అమరావతి’ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది’ అని స్వస్థుతికి పాల్పడుతున్నారు. శాసనసభలో తన పార్టీ.. ప్రభుత్వంలో కొనసాగేందుకు తగినంత సంఖ్యాబలం ఉండనే వుంది! చివరకు శాసనసభాపతితో సహా అందరూ చంద్రబాబుకు ‘జీ హుజూర్‌లే’! అయినా ఆయనలో ఎందుకంత చిరాకు, చికాకు చోటు చేసుకుంటున్నాయి? తన అనుయాయులైన ఎం.ఎల్.ఎ.లపై తగిన విశ్యాసం లేదా? తెలుగుదేశాన్ని ‘జాతీయ పార్టీ’గా మార్చినట్లు ప్రకటించుకుని ముచ్చటగా మూడు నెలలకాకముందే, తెలంగాణాలో టీడీపీలో ముచ్చటగా ముగ్గురు శాసన సభ్యులు మిగిలారు! అందులో ఇద్దరు తన ఓటుకు కోట్లు కుంభకోణంలో ముద్దాయిలు! ఇప్పుదేదో టి.ఆర్.యస్. అధినేత కేసీఆర్‌తో కాస్త సంధి కుదిరింది. కానీ,ఓటుకు నోట్లు కుంభకోణాన్ని కె.సి.ఆర్. అవసరమైనప్పుడు చంద్రబాబుపై ప్రయోగించవచ్చని దాన్ని అలా ఉంచి ఉంటారు. దానితో అది చంద్రబాబుకు మెడపై వేళ్లాడే కత్తిగా ఉంది. వీటన్నింటికంటే తన పాలనపై ప్రజలలో నానాటికీ పెరుగుతున్న అవిశ్వాసం, అసంతృప్తి వ్యతిరేకతను గుర్తించలేనంత అమాయకుడు కాడు చంద్రబాబు. 2014లో అధికారం చేపట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. అందుకోసం, అమలు చేయడం అసాధ్యమని తెలిసిప్పటికీ ఎడాపెడా వాగ్దానాలు చేశారు. అవి ఇప్పుడు అనివార్యంగానే వమ్ము అవడంతో ప్రభుత్వం పట్ల భ్రమలు తొలిగిపోయాయి. రైతు రుణ మాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ప్రతివారికి ఉపాధి, నిరుద్యోగులకు 1000 నుండి 2000వరకు నిరుద్యోగభృతి, ఇలాంటివన్నీ నీటిమీద రాతలవలే, అబద్దాలని జనం గ్రహిస్తున్నారు. వీటికి తోడు ఒక సుడిగాలిలాగా- ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు ఉద్యమం ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఇదీ చంద్రబాబు ఎన్నికల వాగ్దానం భంగ వల్లనే జరిగింది! ఆపసోపాలుపడి, ఆ ఉద్యమాన్ని తాత్కలికంగా నిరోధించగలిగారు కానీ, చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధత. ఆ ఉద్యమ సందర్భంగా జరిగిన విధ్యంసంతో బహిర్గతమైంది. ఒకవైపున కాపులకు బీ.సీలకూ మధ్యవైరుధ్యం సృష్టిస్తూ ‘కులాల కుమ్ములాటలవలన రాష్ట్రం నష్టపోతుంది’ అనీ ‘నా దృష్టిలో రెండే కులాలు. ఉన్నవారు లేనివారు.. రెండేరెండు కులాలు’ అంటూ అపర మార్క్సిస్టు వలే మాట్లాడారు చంద్రబాబు! అవును! తన కులంవారందరికీ తన పరిధిలో చేయగలిగినంత చేసిన తర్వాత ఈ కులవ్యతిరేక రూపమెత్తడం పాలకులకు సహజమే! పైగా టీడీపీకి చెందిన నేతలు వారి తనయులు తమను ఎవరూ ఏమీ చెయ్యలేరన్న అధికార అహంకారంతో ప్రజలలో అప్రతిష్ట తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక దందాను నివారించే యత్నం చేస్తున్న ఒక ప్రభుత్వాదికారిపై చేయిచేసుకోవడం ‘నిర్భయచట్టం’ క్రింద ముద్దాయిలవడం, కాల్‌మనీ సెక్స్‌రాకె ట్ కుంభకోణం, వీరందరినీ కేసులనుండి తప్పించవలసి రావడం వీటన్నింటి వలన ప్రభుత్వపై ప్రజలలో ఏహ్యభావం ఏర్పడింది. వీటన్నింటినీ చిన్నవి చేసే పెద్ద కుంభకోణం రాజధాని ప్రాంతంలో తమ పార్టీ వారి భూదందా! ప్రపంచ స్థాయి క్యాపిటల్ అంటూ అమాయక రైతులను, కౌలుదార్లను, దళితులను మోసగించి భూసేక రణ జరిపారు. తన అనుయాయులకు అతి చౌకగా రాజధాని ప్రాంతంలో అయిదారువేల ఎకరాలు కట్టబెట్ట్టి అసలే కోటీశ్వరులైనవారికి శత, సహస్త్ర కోటీశ్వరులను తె.దే. పార్టీ చేసిందన్న వార్త గుస గుసలుగా పాకి మీడియాకు ప్రధానమైన అంశంగా మారింది. దానితో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ‘ఆ కొన్నారు కొంటే తప్పేంటి? మీ దగ్గర డబ్బుంటే మీరు కొనుక్కోండి’ అని పత్రికా సమావేశంలోనే ఆవేశంతో ఊగిపోయారు. పైగా ఇలాంటిరాతలు రాసినవారిని కూడా అరెస్టు చెయ్యలంటూ బెదిరించారు! విమర్శను తట్టుకొని సరైన సమాధానం యివ్వలేక చంద్రబాబు సంయమనం కోల్పోవడం ఇటీవల కాలంలో ప్రస్పుటంగా కన్పిస్తున్నది! దళితులకు కించపరుస్తూ, మహిళల మనోభావాలకు వ్యతిరేకంగా పనికి మాలిన పాత సామెతలు చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలో తను, తన పార్టీ, తన ప్రభుత్వం నానాటికీ ప్రజా వ్యతిరేకంగా మారిందనీ, అందుకే ఇక అన్ని ప్రజాస్వామిక పద్ధతులకూ తిలోదకాలిచ్చి, తిట్లకు, వ్యక్తిగత దాడులకు, దబాయింపులకు టీడీపీ సిద్ధపడిం దని ఇటీవలి శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో నిరూపితమైంది. వైఎస్సార్సీపీలో బుగ్గిన రవీంద్రనాథ్, శ్రీకాంత్ రెడ్డి వంటి వారే కాకుండా, ప్రత్యేకించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. గణాంకాలతో సహా సమర్థవంతమైన వాదనద్వారా ప్రభుత్వ వంచనను స్పష్టంగా సమావేశాల్లో బయటపెట్టారు. దీంతో గుక్క తిప్పుకోలేకపోయిన పాలకపక్షం జగన్మోహన్రెడ్డిపై, ఆయన తండ్రి దివంగతనేత వైఎస్‌పై అసెంబ్లీ అనికూడా మర్చిపోయి తిట్లపురాణం అందుకున్నారు. మరొక ముఖ్య అంశం ఏదంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను సంవత్సరం పాటు బహిష్కరించడం. ఇది ప్రభుత్వాన్ని పూర్తిగా అప్రదిష్ట పాలు చేసింది. శాసనసభలో రోజాను ఎదుర్కోవడం సాధ్యం కాక, ఆమె అంటేనే భయపడుతున్నవారిలాగా, ఒక్క సంవత్సరం కాదు.. ఈ శాసనసభ పూర్తి కాలంపాటు బహిష్కరించాలని చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. అంతగా ప్రభుత్వాన్ని రోజా గడగడలాడించారా అనిపించేవిధంగా స్పీకర్, టీడీపీ ఎమ్మెల్యే లు కలిసి శాసనసభ చరిత్రలోనే ఆమెకు ప్రత్యేక స్థానం కల్పించారు. నేడు ఏం జరిగినా, ఒకవేళ రోజాను ఐదేళ్లూ శాసనసభకే రాకుండా మందబలంతో పాలకపక్షం శాసనసభలో తీర్మానం చేయగలిగినా ప్రజాకోర్టులో ఇప్పటికే వారు దోషులుగా నిలబడ్డారు. ఈస్థితిలో చంద్రబాబు పాలనపై అయిదారు నిర్దిష్టమైన డిమాండ్లు ఆధారంగా సమైక్య ప్రజా ఉద్యమం అవసరం. ఇదే ఈ ప్రభుత్వ పతనాన్ని నిర్దేశిస్తుంది.ఇప్పుడు రాష్ట్రంలో వివిధ సమస్యలపై వైఎస్సార్సీపి, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఇతర సామాజిక న్యాయ పోరాట సంఘాలు, పౌర సమాజం ఎవరికి వారుగా పోరాటాలు చేస్తున్నారు. అలా కాకుండా వీరందరూ, ఏ వేలికి ఆ వేలు వలే కాకుండా పిడికిళ్లు బిగించి ఐక్య పోరాటం నడపాలి. కాంగ్రెస్ సైతం రానున్న ఎన్నికల్లో తమ ప్రాతినిధ్యాన్ని నిరూపించుకునేందుకు కొంత మేరకైనా కోలుకునేందుకు ఇలాంటి సమైక్య ఉద్యమమే మార్గం కావాలి. వైఎస్సార్సీపీకి అయితే ఈ సమైక్య ఉద్యమం టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఉపయోగపడే మరొక మహత్తర ఆయుధం. ఇక కమ్యూనిస్టులు మట్టుకు ముందు తాము ఐక్యమై ఇలాంటి ఉద్యమానికి చొరవ చూపగలగాలి. మార్క్స్ చెప్పినట్లు వారికి పోయేదేమీ లేదు.. ప్రజల్లో వారిపై ఉన్న నిరాసక్తత, నిర్లిప్తత, నిరాశా నిస్పృహలు తప్ప! - డాక్టర్. ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు 98480 69720 -
పైసల్లేవ్!
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : పైసల్లేక ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కుంటుపడ్డాయి. జనం ఇబ్బందులు పడుతున్నా ఏమీ చేయలేని స్థితిలో అధికారులు ఉన్నారు. కొత్త బడ్జెట్ విడుదలయ్యే దాకా అవస్థలు తప్పవని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో గత ఆరు నెలలుగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు నిధుల విడుదల ఆగిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమం కారణం గా మూడు నెలలు, ఎన్నికల కోడ్ వల్ల మరో రెండు నెలలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజ ధానిలో శాఖల విభజన జరుగుతుండడంతో నెల రోజులుగా ప్రభుత్వం నుంచి పైసా విడుదల కావడం లేదు. కొన్ని నెలలుగా గ్రామాల్లో ప్రజలు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.5.50 కోట్లు కావాలని జిల్లా అధికారులు గత ఏడాది డిసెంబర్లోనే ప్రభుత్వానికి నివేదిక పంపారు. 135 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, స్థానిక రైతుల నుంచి వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకొని 65 గ్రామాలకు నీటి సరఫరా, 119 గ్రామాల్లోని ఆర్డబ్ల్యూఎస్ బోర్ల ఫ్లషింగ్, ఎండిపోయిన 209 బోర్లను మరింత లోతుకు వేయడం.. తదితర పనుల కోసం ఈ నిధులను కోరారు. అయితే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ప్రస్తుతం 120 గ్రామాల్లో నీటిఎద్దడి జఠిలం కావడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వాటికి కూడా బిల్లులు చెల్లించలేని స్థితిలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు. మరోవైపు రెండు నెలలుగా వేతనాలందక ఉపా ధి హామీ పథకం కూలీలు అవస్థ పడుతున్నా రు. జిల్లాలో 1006 గ్రామ పంచాయతీలు ఉం డగా.. 885 పంచాయతీల్లో ఉపాధిహామీ ప థకం పనులు జరుగుతున్నాయి. కూలీలకు మా ర్చి నుంచి వేతనాలు ఆగిపోయాయి. దాదాపు రూ.12 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో పనులు కూడా పూర్తిస్థాయిలో కల్పించలేని స్థితిలో అధికారులు ఉన్నారు. 2,62,202 మంది కూలీలకు గాను 80 వేల మందికి మాత్రమే కల్పిస్తున్నారు. జిల్లాలోని పింఛన్‌దారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసినప్పటి నుంచి పింఛన్లకు సంబంధించిన నిధులు విడుదల కాలేదు. అధికారులు మూ డు నెలలు సర్దుబాటు చేసినా... రెండు నెలల నుంచి మాత్రం అవస్థ పడుతున్నారు. ఈ నెల లో ఇంత వరకూ పింఛన్ ఇవ్వలేదు. ఇంది రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా రూ.1.50 కోట్ల బిల్లులు పెండింగ్ పడ్డాయి. వైఎస్సార్ అభయహస్తం, 108,104 వైద్య సేవ లు తదితర కార్యక్రమాలపైనా నిధుల ఎఫెక్ట్ పడుతోంది. -
‘చింతా’ హౌసింగ్ గేమ్!
ఓట్ల కోసం రాజీవ్ ఆవాస్ యోజన మూడు నెలల్లో పదివేల ఇళ్లు నిర్మిస్తారట! ఆరేళ్లుగా మొండిగోడలకే పరిమితమైన దామినేడు హౌసింగ్ స్కీం పట్టించుకోని ఎంపీ చింతామోహన్ సాక్షి, తిరుపతి: ఓట్ల కోసం పేదలతో చింతా మోహన్ ‘హౌసింగ్ గేమ్’ మొదలు పెట్టారు. ఆ గేమ్ పేరు ‘రాజీవ్ ఆవాస్ యోజన’ (ఆర్‌ఏవై). సీమాంధ్ర ప్రాంతం సమైక్య ఉద్యమంతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. చింతామోహన్ మాత్రం ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నారు. అయితే ప్రజల ఆకాంక్షను చింతా ఆలస్యంగా గుర్తించారు. మౌనంగా ఉంటే త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖాయమనుకున్నారు. ఢిల్లీ స్థాయిలో పావులు కదిపి ‘రాజీవ్ ఆవాస్ యోజన’ పేరుతో ఓట్ల రాజకీయం మొదలు పెట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తన లోక్‌సభ పరిధిలోనిది కావటంతో అందులోని వికృతమాల పంచాయతీ వద్ద ఎయిర్‌పోర్టు పక్కన పది వేల ఇళ్లు నిర్మిస్తామని, తిరుపతిలోని పేదలందరికీ అక్కడ గృహాలు కేటాయిస్తామని మహిళాగ్రూప్ల వద్ద, తన అనుచరుల ద్వారా దరఖాస్తులు సేకరించటం ప్రారంభించారు. హడావుడిగా వికృతమాల వద్ద ఆర్‌ఏవై కింద నిర్మాణాలు చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. దామినేడు ఇళ్లు కనిపించలేదా? తిరుపతిలోని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే చిత్తశుద్ధి చింతామోహన్‌కు లేదు. ఎందుకంటే ఆరేళ్లుగా దామినేడు వద్ద 4,087 ఇళ్లు మొండిగోడలతోనే ఉన్నాయి. తిరుపతి లోని పేదలందరికీ ఇళ్లు కట్టించేందుకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక ల్పించారు. ఈ క్రమంలో 2008లో ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ ఫర్ స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఐహెచ్ఎస్డీపీ)లో భాగంగా దామినేడు, పాడిపేట, తనపల్లె, అవిలాల వద్ద అపార్ట్మెంట్ల నిర్మాణం ప్రారంభించారు. ఇవి పూర్తయితే తిరుపతికి చెందిన 4087 కుటుంబాలకు సొంతింటి కల సాకారమవుతుంది. మహానేత మరణం తర్వాత ఈ నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించలేదు. నేటికీ మొండిగోడలు, పిల్లర్లకే పరిమితమయ్యాయి. ఈ వేలాది ఇళ్లన్నీ చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. నిర్వహణ తిరుపతి కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నా, అక్కడి ఇళ్లలో చేరితే ఓటర్లంతా చంద్రగిరి అసెంబ్లీ, చిత్తూరు ఎంపీ పరిధిలోకి వెళతారు. దీంతో అక్కడ నిర్మాణం ఆపి, తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వచ్చే శ్రీకాళహస్తి పరిసరాల్లో ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలని ఆర్డీవో, తహశీల్దార్ల పైన ఎంపీ ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఐహెచ్ఎస్డీపీతో పాటు జేఎన్ఎన్యుఆర్ఎం కింద చేపట్టిన మొత్తం పదివేల ఇళ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ఇళ్లను పూర్తి చేయించాల్సిన చింతామోహన్ గాలికి వదిలేశారు. తాజాగా రాజీవ్ ఆవాస్ యోజన తెరపైకి తెచ్చారు. మూడు నెలల్లో ఎలా సాధ్యం? దామినేడు చుట్టుపక్కల ఆరేళ్ల క్రితం చేపట్టిన 4087 ఇళ్లు ఇంకా పూర్తి కాలేదు. మరి మూడు నెలల్లో వికృతమాలవద్ద 10 వేల ఇళ్లను చింతామోహన్ ఎలా పూర్తి చేయగలరు? ఇంత పెద్ద ఎత్తున నిర్మించే గృహనిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వెంటనే ఎలా వస్తాయి? ఆర్‌ఏవై కింద చేపడుతున్న ఇళ్లను రానున్న మూడు నెలల్లో పూర్తి చేసి కేటాయించటం సాధ్యమా ? ఇవీ సగటు జీవి ప్రశ్నలు. సొంతింటి కల సాకారం చేసుకోవాలనే పేదల ఆకాంక్షతో చింతామోహన్ ఆడుతున్న ‘హౌసింగ్ గేమ్’గా పలువురు అభిప్రాయపడుతున్నారు. -
భోగిమంటల్లో టీ బిల్లులు
బద్వేలు అర్బన్, న్యూస్‌లైన్: బద్వేలులో జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం భోగి మంటల్లో తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సాంబశివారెడ్డి, కో కన్వీనర్ ఆవుల శ్రీనివాసరావు మాట్లాడుతూ నెలల తరబడి సమైక్య ఉద్యమం కొనసాగిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా విభజనవైపు మొగ్గు చూపడం బాధాకరమన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్వార్థ పూరిత రాజకీయాల కోసం రాష్ట్రానే విడదీయాలనుకోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ బి.మునెయ్య, వైఎస్సార్ సీపీ నాయకుడు బోడపాడు రామసుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీవీఎన్. ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకుడు నరసింహనాయుడు, ఉపాధ్యాయసంఘం నేతలు రామక్రిష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, జేఏసీ నాయకులు పెద్దిరెడ్డి చెన్నాక్రిష్ణారెడ్డి, రామానాయుడు, పుష్పరాజ్, శివరామిరెడ్డి, కొండయ్య, సత్యనారాయణరెడ్డి, శోభన్‌బాబు,నరసింహారెడ్డి, వార్డన్లు ఆనందరావు, రమణారెడ్డి, పాల్గొన్నారు. ఎర్రగుంట్లలో: సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్టీపీపీ గేటువద్ద సోమవారం తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను దహనంచేసి నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ వి.సుబ్బిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనవల్ల దేశంలో అనేక ప్రాంతీయ ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న యూపీఏ ప్రభుత్వం ప్రజల ఆగ్రహావేశాల్లో దగ్ధమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు నరసింహులు, ఓబుళయ్య, ప్రతాప్, ఆనందరావు, రామారావు, గంగయ్య చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
అందరినీ కలుపుకుపోతాం : అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఇదివరకు పోరాడినట్లే ఇక ముందూ ఉద్యమిస్తామని, ఉద్యమంలో అందరినీ కలుపుకుపోతామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. సోమవారమిక్కడ జరిగిన ఏపీఎన్జీవో కార్యవర్గ తొలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్న 22 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షలకు తగ్గకుండా సాయం చేయాలని కార్యవర్గం తీర్మానించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఉద్యోగి నుంచి వారి అనుమతిపై రూ.100ను విరాళంగా సేకరించనున్నట్లు వెల్లడించారు. ఎపీఎన్జీవో ఎన్నికల్లో ఓడిపోయినవారితో పాటు అందరినీ ఉద్యమంలో కలుపుకుపోతామన్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా రెండో విడత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, పదవీ విరమణ దగ్గర్లో ఉన్నప్పటికీ లెక్కచేయకుండా సమ్మెలో పాల్గొన్న ఏపీఎన్జీవో విశాఖ జిల్లా కార్యదర్శి తురగా గోపాలకృష్ణను ఎపీఎన్జీవో భవన్లో ఘనంగా సన్మానించారు. -
సమైక్య ఉద్యమానికి ఊపిరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-
సమైక్య ఉద్యమకారులపై 108 కేసులు
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సుమారు మూడు నెలలుగా గుంటూరు రేంజ్ పరిధి ఆందోళనలు నిర్వహిస్తున్న ఉద్యమకారులపై ఇప్పటి వరకు మొత్తం 108 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో మొత్తం 1067 మందిని అరెస్టు చేసి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. రేంజ్‌లోని గుంటూరు అర్బన్, రూరల్, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ప్రసుతం ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ శాంతిభద్రతలు అదుపులో ఉండటంతో కేంద్ర బలగాలను సగానికి తగ్గించి వెనక్కు పంపారు. మిగిలిన వారిని సమస్యాత్మక ప్రా ంతాల్లో వినియోగిస్తున్నారు. రేంజ్ పరిధిలో అధికంగా ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 40కిపైగా కేసులు నమోదు చేసి 380 మందిని అరెస్టు చేశారు. తర్వాతి స్థానాల్లో పొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు అర్బన్ జిల్లాలు నిలిచాయి. గుంటూరు రూరల్ జిల్లాలో కేసులు నామమాత్రంగా ఉన్నాయి. శాంతిభద్రతల పరిస్థితి, అధికారుల పనితీరు తదితరాలను స్వయంగా పరిశీలించేందుకు బుధవారం ఐజీ సునీల్‌కుమార్ ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వెళ్లారు. -
సీమాంధ్ర ఎంపీలు మోసం చేస్తున్నారు: అశోక్ బాబు
సీమాంధ్ర ఎంపీలు ప్రజలను మోసం చేస్తున్నారని, దీనిపై ప్రజల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. అసెంబ్లీ తీర్మానం వస్తే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థలలో వైఫల్యం వల్లే తాము రోడ్డు మీదకు వచ్చామని తెలిపారు. సమ్మె విరమించినంత మాత్రాన సమైక్యాంధ్ర పోరాటం ఆగిపోదన్నారు. పోరాటంలో సమ్మె ఒక భాగం మాత్రమేనని తెలిపారు. రాష్ట్ర విభజన సమస్య సమస్య రాజకీమైంది కాబట్టే రాజకీయంగా మాట్లాడుతున్నాం తప్ప, తాము రాజకీయ వేత్తలం కాదని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ప్రస్తుతం గాడిదపని గుర్రం, గుర్రం పని గాడిద చేయాల్సి వస్తోందని తెలిపారు. విజయనగరంలో జరిగిన లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదేనని ఆయన అన్నారు. రాజీనామాలు చేయకుండా పదవులు పట్టుకుని వేలాడుతున్న మంత్రులకు భవిష్యత్తు అన్నది లేకుండా చేస్తామని అశోక్‌బాబు హెచ్చరించారు. విభజన విషయంలో రాజకీయ నాయకులు అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి, మళ్లీ ఎన్నికల్లో వాళ్లకు ఎవరూ ఓట్లు వేయకుండా చూస్తామని చెప్పారు. పార్టీల కంటే, ఉద్యమంలో ముందుంటున్న వ్యక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన వివరించారు. -
అదే మాట.. అదే బాట...
= కొనసాగుతున్న సమైక్య ఉద్యమం = రిలేదీక్షలు, వినూత్న ప్రదర్శనలు = నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆటోలు, మోటారుసైకిళ్ల ర్యాలీ సాక్షి, మచిలీపట్నం : సమైక్య పోరు ప్రారంభమై 78 రోజులు గడిచినా ఉద్యమ వాడివేడీ తగ్గలేదు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి వీల్లేదంటూ సమైక్యవాదులు ఇంకా ఆందోళన బాటలోనే ఉన్నారు. జిల్లాలో బుధవారం వినూత్న నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యోగ సంఘాలు, వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. పామర్రులో జేఏసీ నేతలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గుడివాడలో జేఏసీ నేతలు, మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. మండవల్లిలో పంచాయతీ కాంట్రాక్టు వర్కర్లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ముదినేపల్లిలో మండల సమైక్యాంధ్ర సాధన సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవోల దీక్షలు 64వ రోజుకు చేరాయి. మహిళా నేతలు దీక్షలు చేపట్టారు. చల్లపల్లిలో సమైక్యవాదులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఘంటసాలలో అంబేద్కర్‌నగర్‌కు చెందిన డ్వాక్రా మహిళలు దీక్ష చేశారు. మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఎదుట మండల డ్వాక్రా గ్రూపు మహిళలు రిలే దీక్షలు చేపట్టారు. నాగాయలంకలో సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలలో పర్రచివర శివారు మెరకపాలెం దళితవాడకు చెందిన అంబేద్కర్ సంఘం సభ్యులు దీక్షలో కూర్చున్నారు. నందివాడ మండలం టెలిఫోన్‌నగర్ కాలనీ ఉద్యోగ,ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు 46వ రోజుకు చేరాయి. తొలుత ఎంఎన్కే రహదారిపై పొయ్యిలు పెట్టి గారెలు, బజ్జీలు వండుతూ నిరసన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో వివిధ ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు, సమైక్యవాదులు చేస్తున్న నిరసనలు 78వ రోజుకు చేరుకున్నాయి. కలిదిండిలో జేఏసీ నాయకులు విభజన కమిటీ మంత్రుల దిష్టిబొమ్మను దహనం చేసి జాతీయ రహదారిపై బైఠాయించారు. నూజివీడు చిన్నగాంధీ బొమ్మ సెంటరులో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. ఆగిరిపల్లి బస్టాండ్ సెంటర్ల మండల ఫాస్టర్ల ఫెలోషిప్ సభ్యులు దీక్షలో కూర్చున్నారు. మొవ్వ మండలంలోని ఆశా వర్కర్లు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. వీరు కూచిపూడి సెంటర్లో రాస్తారోకో చేశారు. పెడన మహాత్మాగాంధీ షాఫింగ్ కాంప్లెక్స్‌లో దస్తావేజు రైటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మాజీ వీఆర్వోలు ఒకరోజు దీక్ష చేశారు. కంకిపాడు వద్ద జాతీయ రహదారిపై నృత్యాలు చేస్తూ మహిళలు నిరసన తెలిపారు. సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో... తిరువూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభాయ్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు 15వ రోజు కొనసాగాయి. కైకలూరులో రిలే దీక్షలు 71వ రోజుకు చేరాయి. గోనెపాడు గ్రామానికి చెందిన మహిళా కార్యకర్త పి.కరుణ ఆధ్వర్యంలో 20 మంది మహిళలు రిలే దీక్షల్లో కూర్చున్నారు. నేడు డెల్టాకు నీరు నిలిపివేత.. కృష్ణాడెల్టాకు గురువారం సాగునీటి సరఫరా నిలిపివేయాలని ఇరిగేషన్ ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. ఇప్పటికే శివారు ప్రాంతాలకు నీరందని పరిస్థితి ఉండడంతో సాగునీటి నిలిపివేతపై తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా ఆటోలు, సైకిల్రిక్షాల ర్యాలీలు నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ సమాయత్తమవుతోంది. -
75 రోజులుగా సడలని సమైక్య ఉద్యమ స్ఫూర్తి
ఊరూ వాడా కదిలాయి.. ఒక్కటై నిలిచాయి.. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఉద్యమించాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 75 రోజులుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ అధిష్ఠానం గాంధారీ అంధత్వాన్ని నటిస్తున్నా వాళ్లు మాత్రం ఉద్యమ దీక్షను ఏమాత్రం సడలనివ్వలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా సమైక్య ఉద్యమానికి పూర్తిస్థాయి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో వారు మానవత్వాన్నీ మరువలేదు. పై-లీన్ తుఫాను విరుచుకుపడుతోందన్న సమాచారం అందగానే, సమ్మెలో ఉన్నామన్న విషయాన్ని పక్కన పెట్టి వెంటనే రంగంలోకి దిగారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారి బాగోగులను స్వయంగా చూసుకోవడం, కేంద్ర భద్రతా దళాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకోవడం లాంటి పనులన్నీ దగ్గరుండి చేశారు. తమలోని మానవత్వాన్ని నిరూపించుకున్నారు. ఈనెల 8వ తేదీన తుఫాను రానుందన్న సమాచారం రాగా.. 9వ తేదీనే సీమాంధ్ర ప్రాంతానికి ఉద్యోగులంతా విధులకు హాజరయ్యారు. తుఫాను తీరం దాటి, ఇక తమ అవసరం అంతగా లేదని తెలియగానే.. మళ్లీ దీక్షాధారులై ఉద్యమంలోకి దూకారు. విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నందున ఉపాధ్యాయులు, అత్యవసర సర్వీసు అయినందున విద్యుత్ ఉద్యోగులు, పండుగలు సమీపించి.. ప్రజలకు ప్రైవేటు బస్సు చార్జీలు భారం కాకూడదన్న సదుద్దేశంతో ఆర్టీసీ కార్మికుల వరకు సమ్మెను విరమించినా, మిగిలిన ఉద్యోగులు, పార్టీలకు అతీతంగా ప్రజలు మాత్రం తమ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఏదో ఒక రూపంలో సీమాంధ్ర వ్యాప్తంగా ఉద్యమిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న పలు ప్రజాస్వామ్య ఉద్యమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈజిప్టులో గానీ, ఇతర మధ్యప్రాచ్య దేశాల్లో గానీ ఈ తరహా స్ఫూర్తి మనకు బాగా కనిపిస్తుంటుంది. సమైక్య ఉద్యమంలోనూ ఇదే తరహా స్ఫూర్తి కనిపిస్తోంది. రాజకీయ నాయకులెవరూ పిలుపునివ్వకుండానే.. ఒకేసారి పలు ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. జేఏసీలు ఏవీ లేనప్పుడు కూడా ఒకరోజు మూడు నాలుగు జిల్లాల్లోను, మరో రోజు అక్కడ కాక మరో నాలుగు జిల్లాల్లోను లక్ష గళ ఘోష లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడికక్కడే మర్నాటి ఉద్యమానికి కావల్సిన ఏర్పాట్ల కోసం పలువురు ముందుకొచ్చారు. ఇలా ప్రతి హృదయంలోనూ రగిలిన స్ఫూర్తి వల్లే నిరాటంకంగా 75 రోజులుగా సమైక్య ఉద్యమం కొనసాగుతూనే ఉంది. -
ఉద్యమంలోకి అడుగు పెడుతున్నాం-సీమాంధ్ర ఎక్సైజ్ శాఖ
-
మహోగ్రరూపం
=ఉద్యమంలోకి కొత్తగా ఎక్సైజ్ అధికారులు = నేటి నుంచి మద్యం విక్రయాలకు బ్రేక్ = విద్యుత్ కోతలతో జనం విలవిల = గన్నవరం ఎయిర్‌పోర్టుకూ ‘కట్’కట సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమం మహోగ్రరూపు సంతరించుకుంటోంది. బుధవారం ఎక్సైజ్ అధికారులు విజయవాడలో ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డారు. రేపటి నుంచి సమ్మెలోకి దిగాలని, మద్యం సరఫరా బంద్ చేయాలని నిర్ణయించారు. మరోవైపు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కూడా జేఏసీగా ఏర్పడి 17న సాగునీటిని 24 గంటలపాటు బంద్ చేసి రైతులను చైతన్యవంతం చేయాలని నిర్ణయించారు. దీంతో సీమాంధ్రలో ఉద్యమ ఉధృతి పెరిగింది. జిల్లాలో విద్యుత్ కోతలతో జనం విలవిలలాడుతున్నారు. మంచినీరు కూడా అందక ప్రజలు అగచాట్లకు గురవుతున్నారు. విద్యుత్ లేకపోవటంతో చిరు వ్యాపారాలు గణనీయంగా తగ్గిపోయాయి. పరిశ్రమలు వరుసగా మూడోరోజూ మూతపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమలు నడపటం కష్టమని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. విమానాశ్రయానికీ విద్యుత్ సెగ... విద్యుత్ సెగ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు కూడా తగిలింది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కోత విధించారు. విమాన సర్వీసులకు ఎటువంటి అంతరాయం కలగలేదు. రాష్ట్ర విభజన ప్రక్రియకు నిరసనగా సమైక్య ఆందోళనలు కొనసాగాయి. ఏపీ ఎన్జీఓ జేఏసీ పిలుపు మేరకు జిల్లాలో ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. బ్యాంకులు, పోస్టాఫీసులు పనిచేయలేదు. టెలిఫోన్ ఎక్ఛేంజ్‌లు మూతపడ్డాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైద్య సిబ్బంది విధులు బహిష్కరించటంతో ఆస్పత్రిలో కాన్పులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కుంటుపడ్డాయి. కొనసాగిన రిలే దీక్షలు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణదీక్షకు మద్దతుగా అవనిగడ్డలో నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం ముందు చేపట్టిన రిలేదీక్షలు ఐదోరోజుకు చేరాయి. కోడూరు, నాగాయలంక మండలాల్లో దీక్షలు కొనసాగుతున్నాయి. చల్లపల్లిలో జేఏసీ చేపట్టిన దీక్షలు 61వ రోజుకు చేరాయి. చల్లపల్లి ప్రధాన సెంటర్లో జేఏసీ నాయకులు జిలేబీలు, సమోసాలు అమ్మి నిరసన తెలియజేశారు. అవనిగడ్డ న్యాయవాదుల సమైక్యాంధ్ర చైతన్యయాత్ర చల్లపల్లి మండలంలో సాగింది. స్థానిక హీరోహోండా షోరూం సిబ్బంది దీక్ష చేశారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 49వ రోజుకు చేరాయి. జేఏసీ పిలుపు మేరకు దివిసీమలో ప్రభుత్వ రంగ సంస్థలు బంద్ పాటించాయి. జేఏసీ నాయకులు బ్యాంకులు, ఎల్ఐసీ, టెలికాం, పోస్టాఫీస్‌లను మూసివేయించారు. గుడివాడలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో జరుగుతున్న దీక్షలలో రెవెన్యూ అసోసియేషన్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు దీక్షలు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. గుడ్లవల్లేరు సెంటర్లో గాదేపూడి పంచాయితీ పాలకవర్గ సభ్యులు బుధవారం రిలేదీక్షలలో పాల్గొన్నారు. నందివాడ మండలం టెలిఫోన్ నగర్ వద్ద ఉపాధ్యాయులు దీక్షలు కొనసాగుతున్నాయి. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు బుధవారానికి 64వ రోజుకు చేరాయి. కలిదిండి, మండవల్లి మండలాల్లో ఆదర్శరైతులు దీక్షలు చేపట్టారు. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవో దీక్షలు 57వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా కైకలూరు వివేకానంద యూత్ సభ్యులు రిలే దీక్షలు చేశారు. ముదినేపల్లిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 48వ రోజుకు చేరాయి. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల పరిధిలో సమైక్యాంధ్ర కోసం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని మున్సిపల్ కూడలి సమీపంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో విద్యుత్ ఉద్యోగులు కూర్చున్నారు. జేఏసీ రిలేదీక్షలు 51వ రోజుకు చేరుకున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో రైల్‌రోకో జగ్గయ్యపేటలో రైల్వే స్టేషన్ వద్ద రైల్‌రోకో నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు పట్టాలపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. మైలవరంలో జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ రిలే నిరాహారదీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 44వ రోజుకు చేరుకున్నాయి. తిరువూరులో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల బంద్ రెండోరోజు కూడా నిర్వహించారు. టెలిఫోన్ ఎక్ఛేంజ్, బ్యాంకులు, పోస్టాఫీసు, ఎల్ఐసీ కార్యాలయాల్ని జేఏసీ నాయకులు మూసివేయించారు. తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు ఎనిమిదోరోజూ కొనసాగాయి. బోస్‌సెంటర్, సినిమాహాల్స్ సెంటర్లలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించిన రిలేదీక్షల్లో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 63వ రోజుకు చేరాయి. చిన్నగాంధీబొమ్మ సెంటరులోని రిలేదీక్ష శిబిరంలో ప్రింటర్స్ అసోసియేషన్ నాయకులు కూర్చున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 44వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను వైఎస్సార్సీపీ నేత అభినేష్ ప్రారంభించారు. విజయవాడలో ఉద్యోగ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మాసివేయించారు. -
కలెక్టర్, జేసీ ఔట్
సాక్షి, మచిలీపట్నం : సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణంలో జిల్లాలో ఇద్దరు ప్రధాన ఉన్నతాధికారులను ఒకేసారి సాగనంపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. వారు జిల్లాకు వచ్చి 14 మాసాలు గడవకముందే బదిలీ వేటు పడటానికి బలమైన కారణాలే ఉన్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో ఒకేసారి 14 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్‌గా ఉన్న బుద్ధప్రకాష్ ఎం.జ్యోతిని రూరల్ హెల్త్ మిషన్ డెరైక్టర్ (హైదరాబాద్)గా, జాయింట్ కలెక్టర్‌గా ఉన్న పి.ఉషాకుమారిని శ్రీకాకుళం జిల్లా జేసీగా బదిలీ చేసింది. రాజకీయ ఒత్తిళ్లే కారణం... జిల్లాలో పాలన సజావుగా సాగించడం మాటెలా ఉన్నా కీలక విషయాల్లో కూడా ఠ మొదటి పేజీ తరువాయి ఈ ఉన్నతాధికారులిద్దరూ నిర్లిప్తతతో వ్యవహరించడం వల్ల రాజకీయనాయకులకు ఇబ్బందికరంగా మారిందనే ప్రచారం ఉంది. కేవలం ఒకరిద్దరు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని మిగిలినవారిని పట్టించుకోకపోవడంతో వారందరూ గుర్రుగా ఉన్నారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ వీరిద్దరి గురించి సీఎంకు జిల్లా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అందువల్లే వారిద్దర్నీ ఒకేసారి బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ (హైదరాబాద్) సీఈవోగా పనిచేస్తున్న 2002 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎం.రఘునందన్‌ను జిల్లాకు కొత్త కలెక్టర్‌గా, సీఎం పేషీలో పనిచేస్తున్న జె.మురళిని జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. కలెక్టర్ పనితీరుపై అసంతృప్తి... కలెక్టర్‌గా బుద్ధప్రకాష్ పనితీరు అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తినే మిగిల్చింది. 2002 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన కర్నూలులో జేసీగా పనిచేస్తూ పదోన్నతిపై కలెక్టర్‌గా 2012 జూలై 31న జిల్లాకు వచ్చారు. ఆయన హయాంలో కీలక విషయాలు, అర్జీలు, ఇతర అనుమతులకు సంబంధించిన ఫైళ్లు నెలల తరబడి కలెక్టరేట్లోనే మగ్గిపోయాయనే ఆరోపణలు వచ్చాయి. రొటీన్ కార్యక్రమాలు మినహా కీలక పనులేమీ జరగలేదు. పలు శాఖల అధికారులు సైతం ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరించడంతో పాలనపై కలెక్టర్ పట్టుసాధించలేకపోయారు. వారిని సమన్వయం చేసి ముందుకు నడపడంలోనూ ఆయన దృష్టిపెట్టలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. విజయవాడ, మచిలీపట్నం క్యాంపులు మినహా జిల్లాలోని కీలక విషయాలను అవగాహన చేసుకుని వాటిని పరిష్కరించే దిశగా పర్యటించిన సందర్భాలు తక్కువే. ఇటీవల ఎదురైన నీటి ఎద్దడి, చెరువుల తవ్వకం సమయంలో అడపాదడపా ఆయన పర్యటించినా ప్రజల్లోను, ప్రజాప్రతినిధుల్లోను కలెక్టర్ పనిచేస్తున్నారన్న నమ్మకాన్ని కల్పించలేకపోయారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో మినహా మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో కలెక్టర్‌కు సఖ్యత లేదనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలువురు తెరవెనుక చక్రం తిప్పారని, కొద్దినెలలుగా వారు చేసిన ప్రయత్నాలు ఫలించి బదిలీకి మార్గం సుగమమైందని వినికిడి. జేసీ తీరుపై గుర్రు... కలెక్టర్ తరువాత కీలక పోస్టులో ఉండే జేసీ పి.ఉషాకుమారి తీరుపైనా ప్రజాప్రతినిధులు గుర్రుగానే ఉన్నారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో పనిచేస్తూ 2012 ఆగస్టు 29న ఆమె ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి అనేక విషయాల్లో ఆమె మాటతీరు, వ్యవహారశైలి నచ్చని ప్రజాప్రతినిధులు బదిలీకి పావులు కదిపినట్టు సమాచారం. ఇసుక ర్యాంపులు, ఆక్వా చెరువులు తదితర విషయాల్లో జేసీ పనితీరుపై ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. కలెక్టరేట్‌కు అంటుకున్న అవినీతి మకిలి.. జిల్లాను అనేక రంగాల్లో ముందుకు నడపాల్సిన కలెక్టరేట్‌కు సైతం అవినీతి మకిలి అంటుకుంది. రెండు నెలలక్రితం కలెక్టరేట్లోని సి-సెక్షన్‌కు చెందిన రాజశేఖర్ ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసి) కోసం రూ. 25 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. చిరుద్యోగి అయిన ఆయన రూ.25 వేలు ఎలా డిమాండ్ చేస్తాడని, పైఅధికారులకు కూడా వాటాలిచ్చేందుకే అలా చేశాడంటూ కలెక్టరేట్లోని ఇతర ఉద్యోగులు వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఏదేమైనా కలెక్టర్, జేసీ ఉండే క్యాంపస్‌లోనే చిరుద్యోగి పట్టుబడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇసుక క్వారీల వివాదంలోనూ... తమకు అనుకూలంగా ఉంటే కాసుల గలగలలు, అడ్డొస్తే అంతే సంగతులు అనే తీరులో జిల్లాలో ఇసుక సిండికేట్లు వ్యవహరిస్తుంటారు. ఇసుక ర్యాంపుల వివాదం కూడా జిల్లాలోని ఈ ఇద్దరు కీలక అధికారుల మెడకు చుట్టుకున్నట్టు సమాచారం. కొద్ది నెలల క్రితం పామర్రు నియోజకవర్గ పరిధిలోని ఇసుక ర్యాంపు విషయంలో ఎమ్మెల్యే డీవై దాసు కలెక్టరేట్‌ను లక్ష్యంగా చేసుకుని పెనువివాదాన్ని రేపారు. ఇసుక క్వారీకి అనుమతి ఇవ్వాలని అనేక రోజులపాటు అధికారులను కోరిన డీవై దాసు కొద్దినెలల క్రితం నేరుగా కలెక్టరేట్‌కు వచ్చి ధర్నా చేశారు. అదే సమయంలో కలెక్టర్ బుద్ధప్రకాష్, ఎమ్మెల్యే దాసు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన డీవైదాసు ఈ ఇద్దరు అధికారులను బదిలీ చేయిస్తానని సవాల్ చేశారు. కారణమేదైనా, ఎవరైనా, జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీకి మంత్రి, సీఎం వద్ద రాజకీయ ఒత్తిళ్లే పనిచేశాయని తెలుస్తోంది. -
ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తం
సాక్షి, నెల్లూరు : సమైక్య ఉద్యమంలో భాగంగా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి వైఎస్సార్సీపీ సోమవారం యత్నించింది. ఈ ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్దకు వెళ్లకుం డా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోవూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నేతల అరెస్ట్ సమయంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. నేతల అరెస్ట్‌ను అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలు కార్యకర్తలను పక్కకు లాగి పడేశాయి. దీంతో పలువురు కార్యకర్తలు, విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వచ్చి ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్వార్థంతో రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ధ్వజమెత్తారు. కొడుకు రాహుల్‌ను ప్రధానిగా చేసేందుకు సోనియాగాంధీ విభజనకు ఆమోద ముద్ర వేశారని, ప్రతిపక్ష నేత చంద్రబాబు మద్దతు పలకడంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్నిప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తం ముక్కలు చేస్తోందని విమర్శించారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్ర తీవ్రంగా నష్ట పోతుందన్నారు. అన్ని ప్రాంతాల వారు 60 ఏళ్లపాటు కష్టపడగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ఇవాళ హైదరాబాద్‌ను వీడి పొమ్మంటే ఎలా వెళతారని కోటంరెడ్డి ప్రశ్నించారు. డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల కుట్రల వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందన్నారు. మంత్రి ఆనం సీఎం పదవి కోసం గోతి కాడ గుంటనక్కలా కాచుక్కూర్చున్నారని ధ్వజమెత్తారు. మరో వైపు ఆనం వివేకా తాను సమైక్యవాదినంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని అనిల్ విమర్శించారు. ఆనం సోదరులకు ధైర్యం ఉంటే కాంగ్రెస్ జెండాలు పట్టుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలోకి వచ్చి చూడాలని సవాల్ విసిరారు. అనంతరం ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడికి కార్యకర్తలతో వెళ్లాలనుకున్న వైఎస్సార్సీపీ నేతలను పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శివారెడ్డి నేతృత్వంలో పోలీసులు చుట్టు ముట్టారు. ఒక్కసారిగా కాకాణి, అనిల్, కోటంరెడ్డిలను జీపుల్లో తరలించేందుకు ముందుకు వచ్చారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తాము శాంతియుతంగా ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద ధర్నా చేస్తామంటుంటే అడ్డుకోవడం ఏంటంటూ డీఎస్పీ వెంకటనాథ్రెడ్డిని నిలదీశారు. అయినా వినిపించుకోని పోలీసులు కాకాణి, అనిల్‌లను తొలుత బలవంతంగా పోలీసు జీపులో ఎక్కించారు. వీరిని అడ్డుకునేందుకు కార్యకర్తలతో పాటు కోటంరెడ్డి సైతం ప్రయత్నించారు. సీఆర్పీఎఫ్ బలగాలు వీరిని లాగి పక్కకు నెట్టేసి కాకాణి, అనిల్‌ను కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అరెస్టులకు నిరసనగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కొద్దిసేపు ధర్నా చేశారు. ఏఆర్ డీఎస్పీ శివారెడ్డి నేతృత్వంలో పోలీసులు కోటంరెడ్డిని సైతం అరెస్టు చేసి జీపులో కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య పెనుగులాటలో పలువురు కార్యకర్తలు స్వల్ప గాయాలతో సొమ్మ సిల్లారు. వారిని కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత పోలీసులు సొంత పూచీకత్తుపై పార్టీ నేతలను వదిలి పెట్టారు. ఈ కార్యక్రమంలో బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, కెవి రాఘవరెడ్డి, మందా బాబ్జీ, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మునీర్ సిద్ధిక్, ముప్పసాని శ్రీనివాసులు, దార్ల వెంకటేశ్వర్లు, ఎస్కె. ఖాసీం, బాల కోటేశ్వరరావు, రఘురామిరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, ఎస్కె. మంజూర్, ఇంతియాజ్, వేనాటి శ్రీకాంత్‌రెడ్డి, పిగిలాం సుధాకర్, శ్రావణ్ కుమార్, జయవర్ధన్, హరి ప్రసాద్, ఎస్కె. హాజీ, హరికృష్ణ, సత్యకృష్ణ, సుభాషిణి, సోనీ, మీనమ్మ పాల్గొన్నారు. -
విద్యుత్ కోతతో విలవిల
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సమైక్య ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగులు, కార్మికులు సోమవారం మెరుపుసమ్మెకు దిగడంతో పెట్రోలు, డీజిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ రెండిటి ప్రభావంతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. సమ్మె ఎఫెక్ట్ రైతులు, సాధారణ ప్రజలు, వ్యాపారులనే కాదు...ఆస్పత్రులనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరెంట్ కోతలతో ఆస్పత్రుల్లో ఎక్స్‌రే నుంచి సిజేరియన్ దాకా అన్నిటికీ వైద్యులు ఫుల్స్టాప్ పెట్టారు.జనరేటర్లు ఉన్నా డీజిల్ సమస్యతో అవి నడవని పరిస్థితి. గత్యంతరం లేక రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. కరెంటులేకపోవడంతో సాగునీరు అందక వరి రైతులూ అల్లాడుతున్నారు. కడప, సాక్షి: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఆదివారం కరెంటు కష్టాలతో ఇబ్బంది పడిన జిల్లా వాసులకు సోమవారం అదే పరిస్థితి తలెత్తింది. ఆర్టీపీపీలో ఉద్యోగుల సమ్మెతో వరుసగా మూడోరోజు పూర్తిస్థాయిలో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతోజెన్కోకు రోజుకు రూ. 5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. కరెంటు షాక్ ఆస్పత్రులకూ తాకింది. అత్యవసర ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితులకూ కరెంటు అడ్డుతగలడం...ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో రోగులు తీవ్ర వేదన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 72 పీహెచ్సీ(ప్రెమరీ హెల్త్ సెంటర్)లు ఉన్నాయి. 448 సబ్‌సెంటర్లు ఉన్నాయి. 24 గంటలూ పనిచేసే ఆస్పత్రులు 34 ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదానిలో జనరేటర్ లేదు. కొన్నిటిలో ఇన్వర్టర్లు ఉన్నా వాటితో అధికారులకు మినహా వైద్యానికి ఉపయోగం లేని స్థితి. కొన్ని ఆస్పత్రులలో మాత్రం ఇన్వర్టర్ల సాయంతో ఫ్రిజ్‌లలో ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్లు నిల్వ చేస్తున్నారు. పీహెచ్సీలలో కుటుంబనియంత్రణ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపేశారు. ఏరియా ఆస్పత్రుల్లో నరకమే: రిమ్స్‌లో కరెంటు సమస్య లేకున్నా వైద్యులు, సిబ్బంది సమ్మెలో ఉండటంతో ఓపీ సేవలు నిలిచిపోయాయి. రోజూ ఓపీకి వచ్చే 1000-1500 మంది రోగులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రితో పాటు పులివెందుల, రాయచోటి, రాజంపేట, లక్కిరెడ్డిపల్లిలోని ఏరియా ఆస్పత్రులు, జమ్మలమడుగులోని కమ్యూనిటీ హెల్త్సెంటర్పై కరెంటు ప్రభావం పడింది. ఇక్కడ ఉదయం 9 నుంచి12.30 గంటల వరకూ ఓపీ ఉంటుంది. సోమవారం ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ కరెంటు లేదు. దీంతో ఎక్స్‌రే మిషనరీ, రక్తపరీక్షలు చేసే ల్యాబ్‌లు, ఆపరేషన్ థియేటర్లు పూర్తిగా మూతపడ్డాయి. రోగుల వద్ద నుంచి రక్తం తీసుకుని, ఫలితం కోసం మరుసటి రోజు రావాలని చెబుతున్నారు. దీంతో రోగులు ప్రైవేటు క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులలో కరెంటు కోతతో పనిలేకుండా 24 గంటలూ కరెంటు ఉండేలా జనరేటర్లు అమర్చుకున్నారు. జనరేటర్లు ఉన్నా...ఫలితం సున్నా: లక్కిరెడ్డిపల్లి మినహా తక్కిన ఐదు ఏరియా ఆస్పత్రులలో జనరేటర్లు ఉన్నాయి. ఆస్పత్రికి సరిపడా కరెంట్ కావాలంటే గంటకు 10-12 లీటర్ల డీజిల్ అవసరం. ఈ లెక్కన 6 గంటలు కరెంట్ ఉండాలంటే 60-70 లీటర్ల డీజిల్ కావాలి. ప్రభుత్వం మాత్రం మూన్నెళ్లకు 2-3 వేల రూపాయలు మాత్రమే డీజిల్‌కు కేటాయింపులు చేస్తోంది. దీంతో పూర్తిస్థాయిలో జనరేటర్లు నడపలేని పరిస్థితి. గైనకాలజీ లాంటి అత్యవసర చికిత్సలకు మినహా మిగిలిన చికిత్సలను నిలిపేశారు. జిల్లాలో అన్ని ఏరియా ఆస్పత్రులలో రోజుకు సగటున 40 ఆపరేషన్లు చేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 5-10లోపు మాత్రమే ఉంది. విద్యుత్‌కోత దెబ్బకు బ్లడ్‌బ్యాంకులకు ఆటంకం ఏర్పడుతోంది. ఇన్వర్టర్లు ఉన్నా, అవి పూర్తిస్థాయిగా ‘బ్యాంకు’ను పరిరక్షించడం లేదు. దీంతో రక్తం చెడిపోతోంది. అన్ని రంగాలకూ తీరని నష్టం: కరెంటు ప్రభావం జిల్లాలోని అన్ని రకాల రిటైల్వ్యాపారులపై పడింది. దసరా సీజన్ కావడంతో వ్యాపారులు బాగా ఉంటాయని ఆశించివారికి కరెంటుకోత దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యాపారాలకు రోజుకు 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అంచనా! అలాగే కరెంటుపై ఆధారపడి జీవించే మెకానిక్‌లు ఇబ్బంది పడుతున్నారు. వరుసగా రెండోరోజూ పట్టణాలతో పాటు పల్లెవాసులు తాగునీటి సమస్యతో అల్లాడిపోయారు. చాలాచోట్ల మినరల్‌వాటర్‌ను ఒక్కో క్యాన్ కు 35 రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు. రెండురోజులుగా కోతలతో సాగునీరు లేక వరిసాగు చేసిన రైతులు వేదన చెందుతున్నారు. పెట్రోలు, డీజిల్.. నోస్టాక్ భారత్ పెట్రోలియం లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియల్ ఆయిల్ కార్పొరేషన్ డిపోలు కడపలో ఉన్నాయి. వీటి నుంచి రోజుకు 36 లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్ అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్జిల్లాలకు, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సరఫరా అవుతోంది. డిపో డీలర్లతో పాటు ట్యాంకర్లకు లోడింగ్ చేసే కార్మికులు సోమవారం మెరుపుసమ్మెకు దిగారు. దీంతో ఆయిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దాదాపు అన్ని పెట్రోలు బంకుల్లో నోస్టాక్ బోర్డు పెట్టారు. పెట్రోలు లేకపోవడంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డీజిల్ లేకపోవడంతో ఆటోలు, జీపులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు మరింత ఇబ్బంది పడ్డారు. -
ముగిసిన కేంద్ర కేబినెట్ భేటి
-
జనవరిలో కొత్త పార్టీ ఏర్పాటు: మాజీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాజమండ్రి మాజీ లోక్‌సభ సభ్యుడు చిట్టూరి రవీంద్ర కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడలో విభజనకు నిరసనగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రవీంద్ర ప్రసంగిస్తూ... కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే జనవరిలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో ముద్దాయి కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ఆరోపించారు. అక్టోబర్ 1 నుంచి సమైక్య ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామన్నారు. ఆ సెమైక్య సెగ ఢిల్లీని తాకుతుందని చిట్టూరి రవీంద్ర తెలిపారు. -
సమైక్య ఉద్యమంలో YSRCP కీలక పాత్ర
-
టెన్త్ విద్యార్థులకు పాఠాలు చె ప్పండి
చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థులకు మానవతా దృక్పథంతో పాఠాలు చెప్పాలని జిల్లా విద్యాశాఖాధికారి బి.ప్రతాప్‌రెడ్డి ఉపాధ్యాయులను కోరారు. బుధవారం ఆయన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్స్ జేఏసీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా కొన్ని రంగాలకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రం అలాంటి అవకాశం లేదన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సమ్మెలోకి వెళ్లడంతో రెండు నెలలుగా పాఠశాలలు జరగడంలేదని, ప్రైవేటు పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. అందువల్ల ఉపాధ్యాయులు మానవతా దృక్పథంతో 10వ తరగతి విద్యార్థులకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీమాంధ్ర జిల్లాల్లోని విద్యార్థులకు సిలబస్ 15 శాతం కూడా పూర్తికాలేదన్నారు. ఇలా అయితే పబ్లిక్ పరీక్షల్లో తెలంగాణ వారికంటే మన విద్యార్థులు వెనుకబడిపోతారన్నారు. బుధవారం చంద్రగిరిలో పాఠాలు చెబుతుంటే కొందరు అడ్డుకున్నారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి అందరూ సహకరించాలని కోరారు. విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు టీచర్స్ జేఏసీ నేతలు సైతం అంగీకరించారు. వద్దు అంటే అన్నీ బంద్ చేయండి టెన్త్ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు మేం ఒప్పుకోం అనే వాళ్లు తమ ప్రాంతాల్లో అన్నీ బంద్ చేయించాలని డీఈవో డిమాండ్ చేశారు. ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులను, ఆటోలను, సినిమా థియేటర్లను, వైన్ షాపులు ఇలా సకలం ఆపివేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ఇందులో విద్యాశాఖ ముందుం టుందని చెప్పారు. త్రైమాసిక పరీక్షలు వాయి దా పడ్డాయన్నారు. టీచర్లు సమ్మె విరమించిన తర్వాత 15 నుంచి 20 రోజుల్లో సిలబస్ పూర్తి చేసి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా త్రైమాసిక పరీక్షల ప్రశ్నపత్రాలు ఇవ్వలేమని, వాళ్లు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మదనపల్లె డీవైఈవో శామ్యూల్, అధికారులు దినకర్‌నాయుడు, నిరంజన్‌కుమార్, టీచర్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ ఏఎం గిరిప్రసాద్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రవీంద్రారెడ్డి, చంద్రశేఖర్‌నాయుడు, మధు, నరేంద్ర, సహదేవనాయుడు పాల్గొన్నారు. -
రేపు కేబినెట్ ముందుకు టీ నోట్!
-
53వ రోజు ఉదృతంగా కొనసాగుతున్న సమైక్యాంధ్ర సమరం
-
సమైక్య ఉద్యమంలో మనదే ముందంజ: షర్మిల
సమైక్య ఉద్యమంలో వైఎస్సార్సీపీ ముందంజలో ఉందని పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొని.. నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలంతా వైఎస్సార్సీపీ వెంటే ఉన్నారని, విభనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయడంతో ప్రజల్లో మనపట్ల విశ్వాసం పెరిగిందని తెలిపారు. నిర్ణయం వెలువడక ముందే విభజనను వ్యతిరేకించిన పార్టీ వైఎస్సార్సీపీ ఒక్కటేనని ఆమె అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు కూడా అత్యంత ప్రాధాన్యమైనవని ఈ సందర్భంగా షర్మిల చెప్పారు. మన ఉద్యమానికి ఉద్యోగుల నుంచి మంచి మద్దతు లభిస్తోందని, ఉద్యమంలో మరింత దూకుడుగా వెళ్తామని తెలిపారు. నియోజకవర్గాల సమన్వయ కర్తలంతా సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్నారని, ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని షర్మిల తెలిపారు. ఓట్ల కోసం సీట్ల కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తోందని, టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు పూర్తిగా సహకరించారని మండిపడ్డారు. తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసమే మనం పోరాడుతున్నామని, రాష్ట్ర ప్రజలు సంక్షేమంగా ఉండడం కోసం పోరాడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల రాజీనామాకు ఒత్తిడి పెంచాలని సూచించారు. విభజనకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయాలని సమావేశంలో షర్మిల పిలుపునిచ్చారు. -
ఊరూ వాడా హొరెత్తుతున్న సమైక్య ఉద్యమం
-
సమైక్య ఉద్యమానికి సీఎం కన్వీనర్
నర్సంపేట, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య ఉద్యమానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తూ అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నాడని టీజేఏసీ రాష్ర్ట కోకన్వీనర్ వుల్లేపల్లి లక్ష్మయ్యు ఆరోపించారు. విభజను అడ్డుకోవాలని సీమాం ధ్రులు కృత్రిమ ఉద్యమాలు చేయడం సిగ్గుచేట ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెం ట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి హైదరాబాద్‌తో కూడిన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా మల్లేపల్లి లక్ష్మయ్య హాజరై మాట్లాడారు. తెలంగాణ కోసం 56 ఏళ్లుగా ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారని, రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసిన వెంటనే సీమాంధ్రుల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడిన తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు. హైదరాబాద్ వూది అనే నినాదంతో త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వూనవహారం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇకపై సీవూంధ్రుల స్కూళ్లకు వెళ్లకుండా, సినివూలను చూడకుండా తెలంగాణ ప్రాంత ప్రజలను చైతన్యవంతం చేస్తావున్నారు. సదస్సులో నున్నా అప్పారావు, కోడి సోవున్న, ఆబర్ల రాజన్న, తోటకూరి రాజు, లావుడ్యా రాజు, బూర్క వెంకటయ్యు, నర్సక్క, గుండె శ్రీను, రాజేం దర్, యూకన్న పాల్గొన్నారు. కాగా, సదస్సుకు ముందుకు న్యూడెమోక్రసీ కళాకారులు పట్టణంలో ఆటపాటలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ వచ్చే వరకూ తెగించి కొట్లాడుడే.. అంటూ చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాకారులు గుండె శ్రీను, తిరువుల, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో ఉద్ధృతంగా కొనసాగిన సమైక్య ఉద్యమం
సాక్షి, రాజమండ్రి : సమైక్య ఉద్యమంలో 52వ రోజైన శుక్రవారం జిల్లా నిరసనలు, ర్యాలీలతో మారుమోగింది. ఏపీ ఎన్జీఓల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వరుసగా రెండవ రోజు కూడా జిల్లా అంతటా బీఎస్న్ఎల్, తపాలా శాఖ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను ముట్టడించారు. జిల్లాలో 250కి పైగా ప్రధాన బ్యాంకుల శాఖలు మూతపడగా రూ.300 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. విజయవాడలో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు బస్సులు, ఇతర వాహనాల్లో ఉదయాన్నే తరలి వెళ్లారు. ధవళేశ్వరంలో దీక్షా శిబిరం వద్ద ఇరిగేషన్ ఉద్యోగి ఏడుకొండలు కట్టబ్రహ్మన్న వేషంతో, మరో ఉద్యోగి వై. సూర్యనారాయణ పొట్టి శ్రీరాములు వేషంతో ఆకట్టుకున్నారు. రాజమండ్రిలో గోకవరం బస్టాండు వద్ద ఎన్జీఓలు మానవహారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ రిక్షా తొక్కి నిరసన తెలిపారు. పశుసంవర్థక శాఖ జేఏసీ జిల్లా చైర్మన్ డాక్టర్ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో రోడ్డుపై డప్పులు కొడుతూ నిరసన తెలిపారు. బొమ్మూరులో మాజీ సర్పంచ్ మత్స్యేటి ప్రసాద్ 50 గంటల దీక్షను జిల్లా టీడీపీ అధ్యక్షులు నిమ్మకాయల చినరాజప్ప విరమింప చేశారు. ఉద్యోగులు ఓఎన్జీసీ కార్యాలయాన్ని రెండవ రోజు కూడా ముట్టడించారు. తెలుగుతల్లికి దిష్టితీత కాకినాడ జెడ్పీ సెంటర్లో న్యాయశాఖ ఉద్యోగులు మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు రోడ్డుపై బూరాలు ఊదుతూ, దస్తావేజు లేఖరులు విల్లంబులతో నిరసన ప్రదర్శన చేశారు. న్యాయశాఖ గుమస్తాలు రామారావుపేటలో తెలుగుతల్లి విగ్రహాలకు కొబ్బరికాయలతో దిష్టి తీశారు. పీఆర్ డిగ్రీ కళాశాలలో కొందరు అధ్యాపకులు విధులు నిర్వహిస్తుండడంతో సమైక్యవాదులు అక్కడకు చేరుకుని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణకు పసుపు, కుంకుమ, గాజులతో చీర అందచేసి నిరసన తెలిపారు. అనంతరం ఆయనను జేఏసీ శిబిరం వద్దకు తీసుకువచ్చి సమైక్య నినాదాలు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థులు అచ్చంపేట సెంటర్లో నిరసన ప్రదర్శన చేశారు. విలియమ్స్ విద్యాసంస్థల విద్యార్థులు, నిర్వాహకులు రాయుడుపాలెంలో ర్యాలీ, రాస్తారోకో చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తూరంగి నుంచి సర్పవరం జంక్షన్ వరకూ బెక్ ర్యాలీ చే శారు. సమైక్యాంధ్రను కోరుతూ బుర్రకథాగానం అమలాపురం గడియారస్తంభం సెంటర్ శిబిరంలో కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిమ్ క్రీడాకారులు రిలే దీక్షలు చేపట్టారు. భీమనపల్లిలో బుడగ, బేడ జంగాలు బొబ్బిలి బుర్రకథలు ఆలపించి సమైక్య రాష్ట్రం కోసం మద్దతు పలికారు. ఉప్పలగుప్తంలో మండల రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి, రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. గొల్లవిల్లిలో రైతు సంఘం నేతలు, ఎన్.కొత్తపల్లిలో ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేశారు. ముమ్మిడివరంలో బుడగా, బేడ సంఘం ఆధ్వర్యంలో బుర్రకథలో కేసీఆర్, సోనియాలను ప్రధాన పాత్ర లుగా చేసి వారికి శాపనార్థాలు పెడుతూ ప్రదర్శన చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కొత్తపేట మండలంలోని పలు గ్రామాల్లో యాత్ర చేశారు. రావులపాలెం సెంటర్, గోపాలపురంలో జాతీయ రహదారిపై మహిళలు మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. ఆత్రేయపురంలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలుకు జిల్లా టీడీపీ అధ్యక్షులు చిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం సంఘీభావం తెలిపారు. రాజోలు నుంచి అప్పనపల్లికి పాదయాత్ర రాజోలు ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాజోలు నుంచి అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ ఆలయం వరకూ 16 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దారిలో మామిడికుదురు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అప్పనపల్లి చేరుకుని శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మామిడికుదురులో జాతీయ రహదారిపై మండల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు డ్రిల్ చేస్తూ నిరసన తెలిపారు. తూర్పుపాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ సెంటర్‌ను సమైక్య వాదులు ముట్టడించి, కార్యకలాపాలను అడ్డుకున్నారు. వాహనాలు బయటికి రాకుండా ప్రధాన గేటు ముందు బైఠాయించి సమైక్య నినాదాలు చేశారు. మలికిపురంలో అధ్యాపకులు డప్పు వాయిస్తూ రాష్ట్ర విభజనకు నిరసన తెలిపారు. బట్టేలంక సెంటర్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. సామర్లకోటలో వీఆర్ఓ అవసరాల గోపాలకృష్ణ 24 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. పెద్దాపురం జేఏసీ శిబిరంలో కళాకారుడు అశోక్‌కుమార్ జూనియర్ ఎన్టీఆర్‌గా సమైక్య గీతాలకు డ్యాన్స్ చేసి అలరించాడు. ఉద్యోగులు తహశీల్దారు కార్యాలయం వద్ద రాస్తారోకో చేశారు. గృహ నిర్మాణశాఖ ఉద్యోగులు జేఏసీ దీక్షల్లో పాల్గొన్నారు. తుని అల్లూరి సీతారామరాజు సెంటర్లో తుని, పాయకరావుపేట పండ్ల వర్తక సంఘం సభ్యులు దీక్షల్లో పాల్గొన్నారు. రెవెన్యూ కార్యాలయం వద్ద ఉద్యోగులు జేఏసీ దీక్షల్లో పాల్గొన్నారు. రోడ్డుపై బ్యాడ్మింటన్, కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పురపాలక సంఘ ఉద్యోగులు దీక్షలు కొనసాగించారు. ఏలేశ్వరంలో నాయీ బ్రాహ్మణులు బ్యాండుతో ర్యాలీ చేసి, అనంతరం రోడ్డుపై క్షవరాలు చేస్తూ నిరసన తెలిపారు. జగ్గంపేటలో జర్నలిస్టుల బంద్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జగ్గంపేట బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల సమైక్యవాదులు ఒకే వేదికపై చేరి సమైక్య నినాదాలు చేశారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలు దహనం చేశారు. గండేపల్లి, కిర్లంపూడి ప్రాంతాల జేఏసీ సభ్యులు బంద్‌కు మద్దతు పలికారు. కె.గంగవరంలో ఉపాధ్యాయులు రైల్‌రోకో చేపట్టారు. కాకినాడ, కోటిపల్లి రైల్ కారును 10 నిమిషాలు అడ్డుకున్నారు. ద్రాక్షారామ, కాజులూరుల్లో జేఏసీ వంటా వార్పూ చేపట్టింది. రంపచోడవరంలో ప్రధానోపాధ్యాయులు, వార్డెన్ల సమావేశాన్ని సమైక్య వాదులు అడ్డుకున్నారు. రాజమండ్రిలో ప్రైవేట్ కళాశాలల జేఏసీ సమావేశం ప్రైవేట్ కళాశాలల జేఏసీ రాజమండ్రి మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో సమావేశమై 23 నుంచి నగరంలో పూర్తి బంద్ చేసేందుకు నిర్ణయించారు. నర్సరీ నుంచి పీజీ వరకూ ప్రైవేట్ విద్యా సంస్థల వరకు బంద్ పాటిస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తారు. నగరంలో 25న విద్యార్థులతో మహా సైకిల్ ర్యాలీ, 26న పుష్కరాల రేవులో స్కేటింగ్, కోలాటం, విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. 27న విద్యార్థి గళ ఘోష, 28న మోరంపూడి సెంటర్లో విద్యార్థి లక్ష గళార్చన నిర్వహిస్తారు. 30న పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు పుష్కరాల రేవు వద్ద రిలే దీక్షలు చేపడతారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ టి.కె.విశ్వేశ్వరరెడ్డి, కన్వీనర్ గంగిరెడ్డి తదితర నేతలు హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. ముమ్మిడివరం మండలం అయినాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన వంటా వార్పూ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఏలేశ్వరంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత అలమండ చలమయ్య ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులో కుండలు చేస్తూ నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మామిడికుదురులో కార్యకర్తలు చేపట్టిన దీక్షలు 32వ రోజుకు చేరాయి. రాజోలు కో ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ పాల్గొన్నారు. మలికిపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హోరెత్తిన మహా ‘జన’ గర్జన అమలాపురం/అంబాజీపేట, న్యూస్‌లైన్ : అంబాజీపేట సమైక్య నినాదాలతో హోరెత్తింది. మండల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం అంబాజీపేట సెంటర్లో మహాజన గర్జన ఉద్ధృతంగా జరిగింది. మండలవ్యాప్తంగానే కాకుండా ఇతర మండలాల నుంచి సైతం వేలాదిగా సమైక్యవాదులు తరలిరావడంతో అంబాజీపేట సెంటర్ జనసంద్రమైంది. విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, రైతులు తదితరులు ఈ గర్జనకు హాజరయ్యారు. ఉదయం భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో రైతులు బలరామ హలపూజ, గోపూజ నిర్వహించారు. అనంతరం మహాజనగర్జనలో జేఏసీ నేతలు, ప్రతినిధుల ప్రసంగాలు, విద్యార్థులు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, సమైక్యాంధ్ర, దేశభక్తి గేయాలతో హోరెత్తింది. గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు అలరించాయి. తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, ఝాన్సీలక్ష్మీబాయి, జవహర్లాల్ నెహ్రూ, రైతులు, రాక్షసుల వేషధారణల్లో విద్యార్థులు ఆకట్టుకున్నారు. కళాభారతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హస్యవల్లరి కరతాళ ధ్వనులందుకుంది. జిల్లా టైలర్స్ అసోసియేషన్ నాయకుడు ఎం.వి.వి.రామారావు హిజ్రా వేషదారణతో చేసిన ప్రసంగం ఆలోచింపజేసింది. 450 అడుగుల జాతీయ పతాకాన్ని పురవీధుల్లో ఊరేగించడం హైలైట్‌గా నిలిచింది. మండల ఉద్యోగ జేఏసీ నాయకుడు డి.రాంబాబు, వివిధ సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో జరిగిన ఈ మహజన గర్జనలో కోనసీమ సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ వి.ఎస్.దివాకర్, కన్వీనర్లు బండారు రామ్మోహనరావు, కల్వకొలను తాతాజీ, ఆర్టీసీ ఉద్యోగ సంఘం నాయకులు గణపతి, కె.సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. -
భస్మాసుర హస్తం
జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి భస్మాసుర హస్తాన్ని తలపిస్తోంది. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం బరితెగించితే... జిల్లా నాయకులు నోరెత్తకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉవ్వెత్తున ఎగసిన సమైక్య ఉద్యమానికి దూరంగా ఉండడం, ఇంకా పదవులను పట్టుకువేలాడడంతో ఆ పార్టీ నేతలు జనం మధ్యకు వచ్చే అవకాశం లేకుండా పోతోంది. ప్రజాగ్రహ జ్వాలకు జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్యవాదులనుంచి ఎదురైన పరాభవం జిల్లాలోని కాంగ్రెస్ నేతల ను ఆలోచనలో పడేసింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో చక్రం తిప్పుతున్న స్థానిక నేతలు జిల్లాలో తిరిగితే ఇటువంటి చేదు అనుభవాన్నే ఎదుర్కోక తప్పని పరిస్థితులు తలెత్తాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కేంద్రమంత్రి కావూరికి బుధవారం సమైక్యసెగ తగిలింది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కావూరి.. సీడబ్ల్యూసీ, యూపీఏ భాగస్వామ్యపార్టీలు తెలంగాణ అంశంపై తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని తొలుత సమర్థించి ఆ తర్వాత మాట మార్చారు. ఆయన ధోరణిని సమైక్యవాదులు జీర్ణించుకోలేకపోయారు. జిల్లా పర్యట నకు వచ్చిన ఆయనను సమైక్యవాదులు అడ్డుకొని, నిరసన తెలపడంతో కావూరి అవమాన భారంతో వెనుదిరిగారు. కేంద్రమంత్రికే ఇటువంటి పరిస్థితి ఎదురైతే.. తమ సంగతి ఏమిటని కాంగ్రెస్ నేతలు మధనపడుతున్నారు. ప్రజల మధ్యకు రాని ఎంపీ పరిస్థితులను ముందుగానే పసిగట్టిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ జనం మధ్యకు రావడమే మానేశారు. అడపాదడపా వచ్చినా మీడియా సమావేశాలతో సరిపెడుతున్నారు. గతంలో మాదిరిగా జనంలో ఉండలేకపోతున్నారు. ఏదో విధంగా ప్రచారం కోరుకునే లగడపాటి ఈసారి మౌనంగా ఉండిపోయారు. ఏ వైఖరి తీసుకున్నా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న భయంతోనే ఆయన కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారని ఆ పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ఎంపీ పదవికి సైతం రాజీనామా చేస్తానంటూ ప్రకటనలు గుప్పించిన లగడపాటి వాయిస్‌లో బేస్ తగ్గిందని ప్రజలు దుయ్యబడుతున్నారు. మంత్రి సారథిదీ అదే దారి రాష్ర్ట మంత్రి సారథి సైతం జనంలోకి వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ను, మంత్రి పదవిని పట్టుకుని వేలాడుతున్న సారథి.. జిల్లాలో సమైక్యవాదులకు తన ముఖం చూపలేకపోతున్నారు. హైదరాబాద్, ఢిల్లీల్లో సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్టు మీడియా సమావేశాలు నిర్వహించడం మినహా జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతున్న ఉద్యమానికి ఆయన చేరువకాలేకపోతున్నారు. జిల్లాకు చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్న మంత్రి తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం తన మంత్రి పదవికైనా రాజీనామా సమర్పిస్తే ఆయనపై కొంత గౌరవం ఉంటుందని జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కార్యాలయాల మొహం చూడని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విష్ణు, దాసు, వెలంపల్లి , రవి, పద్మజ్యోతి, ఇతర ముఖ్యనేతలు సమైక్య ఉద్యమం దరిదాపులకు వెళ్లే ప్రయత్నం చేయలేకపోతున్నారు. మీడియా పులిగా పేరున్న మల్లాది సమైక్య ఉద్యమంలో పాల్గొనకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గంలోకే కాదు, కనీసం వారి కార్యాలయాల్లోకి అడుగుపెట్టే సాహసం చేయలేకపోతున్నారు. ప్రజాభీష్టం కంటే పదవులే పరమావధిగా భావించే మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహంతో ఉన్నారు. సీమాంధ్రకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని, పదవులను పట్టుకువేలాడుతున్న వారిని నిలదీసేందుకు ప్రజలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో అడుగుపెడితే నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు. -
సమైక్యం సాధిస్తాం
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో ఉద్యమం హోరెత్తుతోంది. సింహపురిలో 49వ రోజైన మంగళవారం సమైక్య పోరులో ఉద్యమకారులు, విద్యార్థులు సమై క్య రాష్ట్రాన్ని సాధిస్తామని ప్రతినబూనారు. నగరంలో నీటిపారుదలశాఖ ఉద్యోగులు మాస్కులు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓ హోంలో పశుసంవర్థకశాఖ ఉద్యోగులు నిరసనదీక్షలు ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగులు బస్టాండ్ నుంచి బస్సులతో ర్యాలీ నిర్వహించారు. వీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థి, అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి గాంధీవిగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. చిట్టమూరు మండలం కొత్తగుంటలో సమైక్యవాదులు కేసీఆర్‌కు శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు. ముత్తకూరులో క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల నిరసనదీక్షలు సాగుతున్నాయి. ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. విద్యాలయాలు, ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. ఉద్యమ కార్యాచరణపై ఎన్జీఓ హోంలో ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలో విధులు నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖ ఉద్యోగులపై రెవెన్యూ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. కంప్యూటర్లను ఆపేసి ఉద్యోగులను బయటకు పంపారు.నెల్లూరు స్వర్ణాల చెరువులో నగర, రూరల్ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర జెండా ఆవిష్కరించి జలాభిషేకం నిర్వహించారు. ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో 20వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. ఐకేపీ మహిళలు దీక్షలో కూర్చొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు బస్టాండ్ సెంటర్లో 30వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. సీతారాంపురంలో 20వ రోజు ఉపాధ్యాయ రిలే దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలో తెలంగాణ ఉపాధ్యాయునికి సన్మానం చేశారు. కలిగిరిలో బుధవారం నిర్వహించనున్న మహిళా గర్జనపై ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాన్ని విభజించడంతో సీమాంధ్రలో ప్రతి గుండె మండుతోందని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు టవర్‌క్లాక్ సెంటర్లో నిర్వహిస్తున్న రిలే దీక్షలకు ఎల్లసిరి, నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ సంఘీభావం తెలిపారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు టవర్‌క్లాక్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి అక్కడే ఆటలు ఆడుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. చిల్లకూరు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు దీక్షకు దిగారు. దీక్షా శిబిరాన్ని గూడూరు ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌రావు సందర్శించి సంఘీభావం తెలిపారు.కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయిబ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో మంగళవారం కోట క్రాస్‌రోడ్డు వద్ద రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. వాకాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేఏసీ నాయకులు ముట్టడించి తరగతులను నిలిపివేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యానాది, జేఏసీ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంటలో కేసీఆర్‌కు శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు. పొదలకూరులో మంగళవారం రెడీమేడ్ వస్త్ర దుకాణదారులు, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ నుంచి ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మంగళవారం నాల్గోరోజు పాదయాత్ర ప్రారంభించారు. నాలుగు గ్రామాల మీదుగా సాగిన పాదయాత్ర పేడూరులో ముగిసింది. వెంకటగిరిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం వెంకటగిరిలో సమైక్య గర్జన నిర్వహిస్తున్నట్టు పద్మశాలి సంఘం నాయకులు తెలిపారు. సూళ్లూరుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య పోరు ఉధృతంగా సాగుతోంది. రిలే నిరాహారదీక్షలు 38వ రోజుకు చేరాయి. తడలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. వీఆర్వోలు దీక్షలో కూర్చుని నిరసన పాటించారు. వీరికి సంఘీభావంగా ఐటీఐ విద్యార్థులు బజారు సెంటర్లో మానవహారం నిర్వహించారు. నాయుడుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహాదీక్షలు కొనసాగుతున్నాయి. -
అలుపెరుగని పోరు
సాక్షి, కాకినాడ : సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్రతరమవుతోంది. ఆదివారంతో సమైక్య ఉద్యమం 47వ రోజుకు చేరుకోగా, సర్వజనుల సమ్మె 34వ రోజుకు చేరుకుంది. అయినా పట్టు విడవకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ర్ట విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉన్నామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆదివారం జిల్లాలో పలుచోట్ల క్రైస్తవులు సమైక్యాంధ్ర పరిరక్షణను కాంక్షిస్తూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అమలాపురంలో కార్ల్‌డేవిడ్ కొమానపల్లి ఆధ్వర్యంలో వేలాది మంది క్రైస్తవులు సమైక్యాంధ్ర కోసం అమలాపురం బాలయోగి స్టేడియం సమీపంలోని మన్నా జూబ్లీ చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చి నుంచి నల్లవంతెన వరకు ర్యాలీగా తరలి వచ్చి వంతెనపై బైఠాయించారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్రంలోని కాంగ్రెస్ పాలకుల మనసు మార్చాలని ఏసుప్రభువును వేడుకుంటూ గంటన్నరపాటు ప్రార్థనలు చేశారు. క్రైస్తవ చిన్నారులు రోడ్డుపైనే కోలాటాలు, నృత్యాలు చేస్తూ, క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ నిరసన తెలిపారు. కొమానపల్లి మాట్లాడుతూ రాష్ర్టవిభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక పోతే ఇరుప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే అధికారం సోనియాకు ఎక్కడిదని ప్రశ్నించారు. 47 రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున సమైక్య ఉద్యమాలు జరుగుతున్నా సోనియా చెవికెక్కకపోవడం బాధాకరమన్నారు. పిఠాపురం సెంటినరీ చర్చి ఆధ్వర్యంలో 300 మందికి పైగా క్రైస్తవులు 216 జాతీయ రహదారిపై చర్చి సెంటర్లో బైఠాయించిప్రార్థనలు చేశారు. పెద్దాపురం, సామర్లకోట తహశీల్దార్ కార్యాలయాల వద్ద జేఏసీ శిబిరాల ఎదుట క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. పిఠాపురం మున్సిపల్ కల్యాణమండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షతన జరుగుతున్న జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. నాయకుల కార్లకు గాలి తీసేసి, బ్యానర్లు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సమైక్యవాదులను శాంతింపచేశారు. బీజేపీ నేతలు చేసేది లేక అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించి వెనుదిరిగారు. మంత్రులకు మంచిబుద్ధినివ్వు వినాయకా! భారత వికాస పరిషత్ ఆధ్వర్యంలో మండపేట కలువపువ్వు సెంటర్లో మానవ హారంగా ఏర్పడి నిరసన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణతో పాటు ఇతర పార్టీల నాయకుల ఆధ్వర్యంలో వివిధ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు మండపేటలో ర్యాలీ నిర్వహించి కేంద్ర మంత్రులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటూ వినాయకునికి వినతి పత్రం సమర్పించారు.రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్టర్ కిషోర్కుమార్గౌడ్ గుండు గీయించుకొని విభజన నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. విజయవంతమైన ‘అపరిచితుడు’ సినిమాలోని పాత్ర బొమ్మతో ఈ నెల 16న ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి నాగదేవి థియేటర్‌కు రానున్నాడని, సమైక్య ఉద్యమకారులంతా తరలి రావాలని నగరంలో వెలసిన పోస్టర్లు ఆసక్తిని రేపాయి. కాకినాడ కలెక్టరేట్ ఎదుట జేఏసీ శిబిరంలో ఆయుష్, లునానీ, ఆయుర్వేద వైద్యులు, సిబ్బంది దీక్షలు చేపట్టారు. దీక్షలో పాల్గొన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగి పాపయ్యను సన్మానించారు. లునానీ వైద్యుడు శ్రీనివాస్ ఆసనాలు వేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ శిబిరం వద్ద విద్యార్థినులు నృత్య ప్రదర్శనలతో నిరసన తెలిపారు. ఈ శిబిరాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. బస్సుల్ని శుభ్రం చేసిన ఆర్టీసీ కార్మికులు కాకినాడలో ఆర్టీసీ కార్మికులు డిపో గ్యారేజ్‌లోని బస్సులను శుభ్రం చేసి నిరసన తెలిపారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ సెంటర్లో గ్రామస్తులు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ముమ్మిడివరంలో ఫీల్డు అసిస్టెంట్లు చేపట్టిన 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. తహశీల్దార్ కార్యాలయం ఎదుట 216 జాతీయ రహదారిపై సమైక్యవాదం అనే నినాదంతో కోనసీమ కవులు నిర్వహించిన కవిసమ్మేళనం ఆకట్టుకుంది. కొత్తపేటలో జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గొడుగులతో నిరసన ప్రదర్శన చేశారు. రావులపాలెం మండలం గోపాలపురం వద్ద రైతులు వంటావార్పు చేసి నిరసన తెలిపారు. విద్యార్థులు మానవహారం నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం తెలిపారు. మామిడికుదురు మండలం కొమరాడ సెంటర్లో మోకాళ్లపై నిల్చొని ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. రాజోలు యూత్ ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై కోడిపందాలు నిర్వహించారు. పెద్దాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద జేఏసీ శిబిరం వద్ద క్రైస్తవులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు రాస్తారోకో చేశారు. జేఏసీ నాయకులు సామర్లకోటలో మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఏలేశ్వరంలో లారీలతో హారం ఏలేశ్వరం బాలాజీచౌక్‌లో లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో 50కి పైగా లారీలతో ప్రదర్శన నిర్వహించారు. సెంటర్ చుట్టూ లారీలతో హారంగా ఏర్పడి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో బాలాజీచౌక్ ప్రధాన రహదారిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు ధర్నా నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పాల్గొన్నారు. జగ్గంపేట సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు మానవ హారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. రామచంద్రపురం మెయిన్‌రోడ్డులో విద్యార్థులు తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు తదితర వేషధారణలతో ర్యాలీ నిర్వహించారు. ద్రాక్షారామలో రజకుల ఆధ్వర్యంలో వంటావార్పు చేసి నిరసన తెలిపారు. మామిడికుదురులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు 27వ రోజుకు చేరుకున్నాయి. పార్టీ రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ, మండల కన్వీనర్ బొలిశెట్టి భగవాన్, పలువురు కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. కాగా 72 గంటల సమ్మె ముగియడంతో విద్యుత్ అధికారులు, సిబ్బంది విధుల్లో చేరారు. విభజనపై నోట్ ప్రవేశపెట్టే పరిస్థితి ఏర్పడితే తామంతా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. -
ప్లాన్ ఒక్కటే లక్ష్యాలు రెండు
సాక్షి, తిరుపతి: స్వచ్ఛంద సమైక్య ఉద్యమం అధికార కాంగ్రెస్ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. విభజన ప్రకటన అపవాదు నుంచి బయటపడటంతోపాటు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జనాన్ని నమ్మించేందుకు జిమ్మిక్కులకు తెరతీశారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి వ్యూహాత్మకంగా ఇళ్ల పట్టాల డ్రామా తెరపైకి తెచ్చారు. కొంత కాలంగా తిరుపతి నగరంలో ఆ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఇళ్లు ఇస్తామంటూ మహిళలను పిలిపించుకుని మంతనాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పేరుతో ముద్రించిన పత్రాలను పంచి పెడుతున్నారు. ఆ పత్రాలను తీసుకున్న మహిళల వివరాలను నమోదు చేసి, ఫొటో అంటించి గెజిటెడ్ అధికారి వద్ద సంతకం తీసుకుంటారు. ఆ పత్రాన్ని మహిళా సంఘాల్లోని ఓ లీడర్ చేతికి చేరుస్తారు. ఈ తతంగమంతా ఓ పథకం ప్రకారం చేస్తున్నారు. ఐకేపీకి చెందిన ఓ ఉన్నతాధికారి, కొందరు మహిళా సంఘాల లీడర్లుఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. డ్రామా అసలు స్వరూపం ఇదీ.. ఇళ్ల పట్టాల పంపిణీ వెనుక అధికార ప్రజాప్రతినిధికి రెండు లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడం, ఉద్యమంలో మహిళలు పాల్గొనకుండా నిలువరించే ప్రయత్నం. ‘సొంతిల్లు లేని వారందరికీ ఈసారి ఇళ్లిప్పిస్తాం. అందుకు మీరు చేయాల్సిందల్లా సమైక్య సమ్మెలో పాల్గొనకూడదు. వచ్చే ఎన్నికల్లో నాకు ఓటేసి మరోసారి గెలిపించాలి. నేను అడిగిన ఈ చిన్న హామీలను నెరవేరిస్తే సొంతింటి కలను నేను నెరవేరుస్తాను’ అని మహిళలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి నగరంలో 15వేల మంది నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. మరో 10వేల మంది నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు కాంగ్రెస్ పత్రాలను పంపిణీ చేస్తున్నారు. నివాస స్థలం కోసం పెట్టుకుంటున్న దరఖాస్తు పత్రంలో గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి. అందుకోసం కొందరు డ్వాక్రా లీడర్లు ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వసూలు చేస్తున్న మొత్తాన్ని అధికారికి ఇస్తారా అనేది ప్రశ్నార్థకమే. అసంపూర్తి నిర్మాణాల మాటేంటి? తిరుపతి కార్పొరేషన్ పరిధిలో నిర్మించ తలపెట్టిన పక్కా ఇళ్ల నిర్మాణం నాలుగేళ్లుగా పిల్లర్స్కే పరిమితమయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తి నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో కోట్ల రూపాయల నిధులు మట్టిపాలవుతున్నాయి. జేఎన్ఎన్యూఆర్ఎం, మినిస్టరీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ పథకం కింద పాడిపేట, దామినేడు, అవిలాల సమీపంలో వెక్కిరిస్తున్న అసంపూర్తి గృహాలే ఇందుకు నిదర్శనం. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తిరుపతికి 2009లో రూ.2,223 కోట్లు మంజూరు చేసింది. అందులో మొదటి విడతగా రూ.100 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ నిధులతో అర్బన్ హౌసింగ్, నీటి సరఫరా, మురికికాలువలు, రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆ నిధులు నీటి సరఫరా, మురికి కాలువలు, రోడ్ల నిర్మాణాలకే చాల్లేదని తెలిసింది. దీంతో అర్బన్ హౌసింగ్ నిర్మాణం అసంపూర్తిగా నిలిపేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. మంజూరైన ఇళ్లనే పూర్తి చేయలేక ఇబ్బంది పడుతుంటే ఆ ప్రజాప్రతినిధి కొత్తగా మళ్లీ ఇళ్లు నిర్మించి ఇస్తామనడం నమ్మశక్యంగా లేదని అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆ నేత అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తే వాటిలో వేలాది మంది నిరుపేదలకు నీడ కల్పించిన వారవుతారని అంటున్నారు. -
సమైక్యశక్తి
సమైక్య ఉద్యమ సెగలు మిన్నంటుతున్నాయి. రోజురోజుకూ ఉద్యమానికి మద్దతు పెరుగుతుండటంతో సమైక్యశక్తి బలీయమవుతోంది. విజయవాడలో మలయాళీలు ఉద్యమానికి మద్దతుగా ఓనం వేడుకలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మానవహారాలు, వినూత్న నిరసనలు ఆదివారమూ కొనసాగాయి. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో జరుగుతున్న ఉద్యమం మరింత బలపడుతోంది. ఉద్యమం ప్రారంభించి ఆదివారానికి 48 రోజులకు చేరినా జోరు తగ్గలేదు. సమైక్యాంధ్రను కాపాడుకోవడానికి మరింత ఉధృతంగా ఉద్యమం కొనసాగించేందుకు సమైక్యవాదులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 17న ప్రైవేటు ఆస్పత్రులు బంద్ పాటిస్తుండగా, 18న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కోసం ర్యాలీలు, 20న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ, 21న హనుమాన్‌జంక్షన్‌లో రైతుగర్జన నిర్వహించాలని నిర్ణయించారు. పెరుగుతున్న మద్దతు.. సమైక్యాంధ్రకు తెలుగువారే కాకుండా ఈ ప్రాంతంలో స్థిరపడిన వివిధ రాష్ట్రాలకు చెందినవారు కూడా తమ వంతు మద్దతు తెలుపుతున్నారు. దశాబ్దాలుగా విజయవాడ నగరంలో స్థిరపడిన మలయాళీలు ఏటా ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఓనం వేడుకలను సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దుర్గగుడికి వచ్చిన కాకినాడ శ్రీపీఠానికి చెందిన శ్రీ పరిపూర్ణానందస్వామి రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొని ఉందని, దీని కోసం శాంతి కమిటీని వేయాలని సూచించారు. మరోవైపు ఆదివారం కూడా ఉద్యోగులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. విజయవాడలో ఐసీడీఎస్ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలని కోరుతూ న్యూ రాజరాజేశ్వరీపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన జరిపారు. కేంద్రమంత్రుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ ఎదుట మంత్రుల రాజీనామాలు కోరుతూ 108 కొబ్బరికాయలు కొట్టారు. మాజీ మంత్రి సుభాష్‌చంద్రబోస్ మద్దతు.. నందివాడ మండలం జనార్థనపురం శివారు టెలిఫోన్ నగర్ కాలనీలో మండల ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 15వ రోజుకు చేరాయి. వైఎస్సార్సీపీ రాష్ట్ర కిసాన్ సెల్ కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డితో కలసి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శిబిరంలో దీక్ష చేస్తున్న తుమ్మలపల్లి రైతులకు సంఘీభావం తెలిపారు. సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు ఎడారిగా మారటం ఖాయమని ఈ సందర్భంగా బోస్ అన్నారు. తొలుత ఉపాధ్యాయులు ఎంఎన్కే రహదారిపై సమైక్యాంధ్రకు మద్దతుగా చెవిలో పూలతో భజన కార్యక్రమం నిర్వహించారు. పునాదిపాడు-కంకిపాడు సెంటరు వరకు రోడ్ రోలర్స్ అసోసియేషన్, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్స్ ర్యాలీ నిర్వహించారు. గన్నవరం రోడ్డు కూడలిలో మానవహారం నిర్మించారు. పామర్రు నాలుగురోడ్ల కూడలిలో రిమ్మనపూడి పంచాయతీ పాలకవర్గ సభ్యులు రిలేదీక్షల్లో కూర్చున్నారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో, మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. నెహ్రూచౌక్‌లో టైలర్స్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. గుడ్లవల్లేరులో పాలిటెక్నిక్ విద్యార్థులు రిలేదీక్షలకు కూర్చున్నారు. తిరువూరు మండలంలోని పలు గ్రామపంచాయతీ సర్పంచులను కలిసిన జేఏసీ నాయకులు సమైక్యాంధ్ర కోసం పంచాయతీ తీర్మానాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వస్తే అధిష్టానాన్ని ధిక్కరించి సమైక్యాంధ్రకు అనుకూలంగా ఓటు వేస్తానని తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి ప్రకటించారు. తాళ్లతో బస్సులు లాగి నిరసన.. విస్సన్నపేట మండల జేఏసీ నాయకులు ఆర్టీసీ అద్దె బస్సులను తాళ్లతో లాగి నిరసన తెలిపారు. రాష్ట్రం విడిపోతే ఆర్టీసీ పరిస్థితి కుదేలవుతుందని, బస్సుల్ని నడపలేక, కార్మికులకు జీతాలివ్వలేక తీవ్ర ఇబ్బందికర స్థితిలోకి ఆర్టీసీ దిగజారుతుందని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పామర్రులోని ఆర్యవైశ్య యువజన సంఘం, జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి సుదర్శన హోమం నిర్వహించారు. జగ్గయ్యపేట జేఏసీ ఆధ్వర్యంలో పేట నుంచి తిరుమలగిరి వరకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్‌లు పాల్గొని సంఘీభావం తెలిపారు. కైకలూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు 40వ రోజుకు చేరాయి. ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మోపిదేవిలో డ్వాక్రా మహిళలు దీక్ష చేశారు. గన్నవరంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతృత్వంలో జరుగుతున్న రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి. కైకలూరులో ముస్లిం చిన్నారుల ఆందోళన... కైకలూరు పట్టణంలో ముస్లిం చిన్నారులు జేఏసీ ఆధ్వర్యంలో పామర్రు-కత్తిపూడి 214 జాతీయ రహదారిపై బైఠాయించి దువా (ప్రార్థన) చేసిన అనంతరం సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. గుర్వాయిపాలెం సెంటరులో యూత్ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో చేశారు. మచిలీపట్నంలో మునిసిపల్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 33వ రోజుకు చేరింది. కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారి పక్కన ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్లో రిలేదీక్షలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఉధృతంగా సమైక్య ఉద్యమం
జిల్లాలో సమైక్య సెగలు ఉధృతమవుతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంపై నిరసనలు పెల్లుబుకుతున్నాయి. సమైక్యవాదులు సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం మానవహారాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, వినూత్న నిరసనలు, నిరాహారదీక్షలతో వాడవాడలా సమైక్యవాదాన్ని హోరెత్తించారు. సాక్షి, విజయవాడ : జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా వరుసగా 33వ రోజైన ఆదివారం కూడా కొనసాగాయి. మచిలీపట్నంలో ఐక్య క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. మతగురువులు, మహిళలు, యువకులతో పాటు పిల్లాపాపలు సైతం పాల్గొని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. జగ్గయ్యపేటలో ఆర్సీఎం చర్చి ఫాదర్ దామాల విజయకుమార్ ఆధ్వర్యంలో సంఘస్తులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులు ఆటోలు తుడుస్తూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కూడలి వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఆదివారంతో 13వ రోజుకు చేరాయి. జననేత జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ వైఎస్సార్ సీపీ మహిళా నేతలు ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పామర్రు మండల ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. పామర్రు సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు రిలేదీక్షలలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో రహదారిపై వంటావార్పు నిర్వహించారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి 3 రోజుల పాటు 72 గంటల సమ్మెకు జేఏసీ పిలుపునిచ్చింది. గన్నవరంలో జరుగుతున్న రిలే దీక్షలు 19వ రోజుకు చేరాయి. గుడివాడ నెహ్రూచౌక్‌లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షల్లో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ దీక్షలకు రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ మద్దతు తెలిపారు. వైఎస్ జగన్ దీక్షను భగ్నంచేయటాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్ధతుగా వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యాసం చిట్టిబాబు, గుడివాక శివరావ్ ఆధ్వర్యంలో అవనిగడ్డలో రహదారులను ఊడ్చి వాహనాలను తుడిచి నిరసన వ్యక్తం చేశారు. కోడూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. నడకుదురులో వైఎస్సార్ సీపీ నాయకులు రిలే దీక్ష చేశారు. శిబిరాన్ని నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ప్రారంభించారు. మైలవరం కార్పెంటర్లు రహదారిపై పనులు చేసి నిర సన వ్యక్తం చేశారు. కైకలూరులో ఏపీ ట్రక్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 100 ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కలిదిండి మండలం సంతోషపురం పంచాయతీ శివారు నరసింహపురం గ్రామానికి చెందిన మహిళలు, గ్రామస్తులు కలిదిండి సెంటరులో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్ష చేశారు. మహిళలు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉయ్యూరు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలో ఆదివారం కొబ్బరితోట, జనాత బజారుకు చెందిన యువత పాల్గొని తమ నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా పెద ఓగిరాల నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. తోట్లవల్లూరులో జేఏసీ ఆధ్వర్యాన జరుగుతున్న రిలే దీక్షలలో ఆర్ఎంపీ వైద్యులు పాల్గొన్నారు. జగన్ కోసం పూజలు.. నందిగామ మండలంలోని చందాపురం సమీపంలో సయ్యద్ బాలే మస్తాన్ షా వలి దర్గాలో జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరువూరులో విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారిపై వంటా వార్పు నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం కుదుటపడటంతో పాటు, ఆయన సోదరి షర్మిల చేపట్టనున్న బస్సు యాత్ర విజయవంతం కావాలని కోరుతూ తోట్లవల్లూరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం బాగుపడాలని కోరుతూ జిల్లా హోల్‌సేల్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమ్మతల్లి రవీంధ్రనాధ్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిటాల హనుమంతునికి ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పంజా సెంటర్లో ముస్లిములు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ హాజరయ్యారు. పెదపారుపూడిలో గుడివాడ-కంకిపాడు ప్రధాన రహదారిపై వైఎస్సార్ సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. దీనికి పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన నేతృత్వం వహించారు. నూజివీడు జంక్షన్‌రోడ్డులో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలను జిల్లా కన్వీనర్ ఉదయభాను, నియోజకవర్గ కన్వీనర్ మేకా ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు. రేపు విజయవాడలో ఆస్పత్రుల బంద్.. ఈ నెల మూడో తేదీన విజయవాడలో ఆస్పత్రులు బంద్ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయించింది. మరోవైపు ఎన్టీటీపీఎస్లో కేంద్ర బలగాలను దింపడం వివాదాస్పదంగా మారింది. ఉద్యోగుల సమైక్య నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాలను దింపి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 207 మందితో డీఎస్పీ స్థాయి అధికారి వీటిని పర్యవేక్షిస్తున్నారు. -
అస్త్ర సన్యాసం
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజన ప్రకటన సీమాంధ్రలో అగ్గి రాజేసింది. కాంగ్రెస్ కుటిల నిర్ణయంతో కడుపు మండిన సమైక్య వాదులు రోడ్లెక్కి ఆందోళనలకు దిగారు. పర్యవసానంగా సమైక్యాంధ్ర ఉద్యమం చరిత్రలో ఎన్నడూ లేనంతగా జోరుగా సాగుతోంది. అంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులు సైతం విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యమం కోసం విధులను వదలి వీధులకెక్కారు. ఏ ప్రజల ఓట్లతో అధికార దర్పం అనుభవిస్తున్నారో ఆ ప్రజల ఆకాంక్షతో తమకెందుకు అన్నట్టుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, సిటీ ఎమ్మెల్యే శ్రీధరకృష్ణారెడ్డి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరిచినట్టున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కనీసం ఉద్యమకారులకు మద్దతు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఉద్యమ ప్రారంభంలో ఒకటిరెండు ప్రకటనలు, మొక్కుబడి కార్యక్రమాలతో తమ బాధ్యత పూర్తయినట్టు చేతులు దులుపు కున్నారే తప్పించి ఆ తర్వాత పత్తా లేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ సమైక్యాంధ్రంటే తామే అన్నట్టుగా మీడియాలో నానా హంగామా చేసిన ఆనం సోదరులు, తీరా ఉద్యమం మొదలయ్యాక అస్త్ర సన్యాసం చేయడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఒక వైపు ఉద్యమం తీవ్రరూపం దాల్చి జిల్లా ఆందోళనలతో అట్టుడికి పోతుంటే ఎమ్మెల్యేలు,మంత్రి మాత్రం ఉద్యమం పక్కన పెట్టి నియోజక వర్గాలలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు పరిమిత మయ్యారన్న విమర్శలున్నాయి. పనికంటే మిగిలివన్నీ ఎక్కువ చేసే ఆనం వివేకా కనపడకుండా తిరుగు తుండడం ఆనం సోదరుల నైజాన్ని తెలియ జేస్తోందని సమైక్య వాదులు మండిపడుతున్నారు. రూరల్ ఎమ్మెల్యే కనుసన్నలలో మెలిగే నగర ఎమ్మెల్యే ముంగమూరు విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మంత్రి ఆనం మాత్రం స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని వెళ్లారు. ఆ తర్వాత నెల్లూరు వైపు తిరిగి చూడలేదు. జిల్లాలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర కోసం తమవంతుగా దీక్షలకు దిగారు. ఆందోళనల బాట పట్టారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టే ఆనం సోదరులు మాత్రం ఆచరణలో చూపకపోవడంతో జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పోరు హోరు
సాక్షి, నెల్లూరు: వేర్పాటువాదానికి వ్యతిరేకంగా సింహపురిలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. చినుకు..చినుకు కలిసి మహాసముద్రమైనట్టు సమైక్య పోరు రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి గెజిటెడ్ ఆఫీసర్లు నిరవధిక సమ్మెకు దిగుతుండటంతో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించనుంది. మరోవైపు శుక్రవారం జిల్లా నలుమూలాల నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. సమైక్య ఉద్యమంలో 24వ రోజూ అదే హోరు, అదే జోరు కనిపించింది. రాజీవ్ విద్యామిషన్ స్టేట్‌ప్రాజెక్ట్ డెరైక్టర్ ఉషారాణి హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌ను కలెక్టరేట్లో ఏపీ ఎన్జీఓ నాయకులు అడ్డుకున్నారు. కాన్ఫరెన్స్ హాలులోనికి చొచ్చుకెళ్లి ఆర్వీఎం అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంటే కాన్ఫరెన్స్ ఎలా నిర్వహిస్తారని లైవ్‌లో ఉన్న ఉషారాణిని నాయకులు ప్రశ్నించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో దీక్షలో ఉన్నవారికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మకూరు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, గాంధీ బొమ్మ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా అయ్యప్పగుడి నుంచి వేదాయపాళెం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం రాస్తారోకో చేశారు. డైకస్‌రోడ్డు సెంటర్లో మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్ హైస్కూలు మైదానంలో మానవహారం నిర్వహించారు. విద్యుత్, వాణిజ్యపన్నుల శాఖ అధికారుల దీక్షలు కొనసాగాయి. నిరవధిక సమ్మెకు సంబంధించిన నోటీసును కలెక్టర్ శ్రీకాంత్‌కు గెజిటెడ్ అధికారులు అందజేశారు. కావలిలోని పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ, ఏరియా వైద్యశాల వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆర్టీసీ సెంటర్లో ఉద్యోగ జేఏసీ, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాలు, ఆ ర్డీఓ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ, మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా రిలే దీక్షలు చేపట్టారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్, వైద్యులు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి బైక్ ర్యాలీ చేశారు. బోగోలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. గూడూరులోని టవర్‌క్లాక్ కూడలిలో విద్యార్థి జేఏసీ చేస్తున్న నిరాహారదీక్షలకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మద్దతు పలికారు. రాజావీధిలో స్థానిక మహిళలు రోడ్డుపై వంటావార్పు చేశారు. విద్యార్థులు, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు శరీరానికి వేపమండలు కట్టుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఉద్యమానికి వాకాడు ఆర్టీసీ డిపో మేనేజర్ సహకరించడం లేదంటూ విద్యార్థులు సెల్‌టవర్ ఎక్కారు. వైఎస్సార్సీపీ సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముత్తుకూరులో భారీ ర్యాలీ, బస్టాండ్ సెంటర్లో వంటావా ర్పు చేశారు. ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు మనుబోలు వద్ద జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఉపాధ్యాయులు మానహారం నిర్వహించారు. పొదలకూరులో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. సూళ్లూరుపేటలో ఆటో కార్మికులు, విద్యార్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. వారికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య సంఘీభావం తెలిపారు. నాయుడుపేటలో యువకులు చే పట్టిన ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో, అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. తడలోనూ రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన ఐటీఐ విద్యార్థులకు కిలివేటి సంజీవయ్య మద్దతు ప్రకటించారు. అక్కంపేట వాసులు రాస్తారోకో నిర్వహించి, కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇందూరు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రిలేదీక్షలు చేపట్టారు. వెంకటగిరిలో జేఏసీ, టీడీపీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఉదయగిరిలో ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయూ కార్యకర్తలు ఆసనాలతో నిరసన తెలిపారు. పంచాయతీ బస్టాండ్ ఆవరణలో తిరుమలాపురం పంచాయతీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. కొండాపురంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. వింజమూరు మండలంలోని చాకలికొండలో ఆర్కే హైస్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. -
సమరోత్సాహం
సాక్షి, విజయవాడ : జిల్లాలో సమైక్య ఉద్యమం సమరోత్సాహంతో ఉరకలెత్తుతోంది. వేలమంది విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనంచేశారు. వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు మండలాలలో రిలేదీక్షలు చేపడుతున్నారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద రెండోరోజు నిర్వహించిన నిరశన దీక్షలను జిల్లా కన్వీనర్ ఉదయభాను ప్రారంభించారు. తిరువూరులో ఉద్యోగుల జేఏసీ చేపట్టిన రిలేనిరాహారదీక్షలకు ఎమ్మెల్యే పద్మజ్యోతి మద్దతు ప్రకటించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. గుడివాడలో సంపూర్ణబంద్ నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో రిలేదీక్షలు చేశారు. కైకలూరు పార్టీ కార్యాలయం వద్ద సాగుతున్న రిలే దీక్షలు ఐదో రోజుకు చేరాయి. కలిదిండి మండలం గుర్వాయిపాలెంలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్షలు జరిగాయి. మూలలంక గ్రామస్తులు రోడ్డుపై వంటావార్పు చేశారు. జగ్గయ్యపేట పట్టణంలో సమైక్యాంధ్ర కోరుతూ రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన రిలేదీక్షలలో ఎస్జీఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ సెంటర్లో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. జిల్లా సరిహద్దు గరికపాడు వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై కొద్దిసేపు ఆందోళన జరిపారు. మైలవరంలో ఎన్జీఓల సంఘం అధ్వర్యంలో రిలేదీక్షలు ప్రారంభించారు. మైలవరం రిక్షా వర్కర్స్ యూనియన్ సభ్యులు భారీగా ర్యాలీ నిర్వహించి, కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ అధ్వర్యంలో మైలవరంలో నాలుగో రోజు కూడా దీక్షలు కొనసాగాయి. తెలుగు తల్లి సెంటర్లో కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు జరిపారు. నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విజయమ్మ దీక్షకు మద్దతుగా నందిగామలో భారీ ర్యాలీ చేశారు. చల్లపల్లిలో పలు విద్యాసంస్ధల విద్యార్థులు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. గిలక్కాయలు ఊదుతూ నిరసన వ్యక్తంచేశారు. జి. కొండూరులోని గెయిల్ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన చేశారు. చల్లపల్లిలో ఎస్సార్‌వైఎస్పీ జూనియర్ కళాశాల విద్యార్థులు సైకిల్‌ర్యాలీ చేశారు. వార్డెన్లు సమ్మెలో పాల్గొనడంతో చల్లపల్లి మండలంలో ఆరు వసతి గృహాలు మూతపడ్డాయి. వైఎస్సార్సీపీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి ర మేష్‌బాబు ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో విజయమ్మ దీక్షాస్థలికి తరలి వెళ్లారు. గన్నవరంలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు పదో రోజుకు, హనుమాన్‌జంక్షన్‌లో నాన్ పోలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఉయ్యూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు భారీ ప్రదర్శన చేశారు. ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. వ్యాపారులంతా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కంకిపాడులో బైక్ ర్యాలీ జరిగింది. పెనమలూరు మండలంలో సిద్ధార్థ కళాశాల వద్ద దీక్షలు కొనసాగాయి. విజయమ్మ దీక్షకు మద్దతుగా గంగూరులో రిలే నిరశన మూడో రోజూ కొనసాగింది. ఆటో వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. విజయవాడలో... ఎన్జీవోల ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు బెంజిసర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులు ఎన్‌హెచ్-5 పైప్రదర్శన చేశారు. విజయవాడ విద్యాసంస్థల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఎంజీరోడ్డులోని సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏటీఏ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు సామినేని ఉదయభాను, ఉప్పులేటి కల్పన సంఘీభావం ప్రకటించారు. ఆటోనగర్ గేట్ వద్ద నిర్వహించిన ఆందోళనలో పాల్గొని ఉదయభాను డప్పు కొట్టారు. సెప్టెంబర్ రెండు తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. గుణదల కమర్షియల్ టాక్స్ కార్యాలయం వద్ద ఆ శాఖ ఉద్యోగులు రాస్తారోకో చేశారు. వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ నేతృత్వంలో వైఎస్ విజయమ్మ ఆమరణదీక్షకు మద్దతుగా స్థానిక మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. -
ఉద్యమకారులపై ఉక్కుపాదం
సాక్షి, తిరుపతి: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సమైక్యవాదులపై పోలీసులు ఉక్కుపాదం మోపడానికి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా ఉద్యమకారులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తున్నారు. సమైక్య ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ఎక్కడా లాఠీ ఎత్తవద్దని, సంయమనంతో వ్యవహరించమని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా, అలిపిరిలో వీహెచ్‌ను అడ్డుకున్న ఘటనలో ఆందోళనకారులను పక్కనెట్టి, లాఠీచార్జీ చేసి హడావుడి చేశారు. తీరా దెబ్బలు తిన్నవారిపైనే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. ఉద్యమం ఆరంభంలో కొందరు ఉద్యమకారులు పాత కారును తగులబెడితే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకపోయినా, గొడవలు చేయకపోయినా ఉద్యమాన్ని కఠినంగా అణచివేసే ధోరణిలో పోలీసులు సాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. తిరుపతి అర్బన్ జిల్లా పోలీసుల పరిధిలో ఇప్పటి వరకు హింసాత్మక ఘటనలు జరగకపోయినా, పోలీసులు మాత్రం అవసరానికి మించి అత్యుత్సాహం చూపుతూ ఉద్యమకారులను అడ్డుకుంటున్నారని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు విమర్శిస్తున్నారు. తిరుమలకు వచ్చి సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతినేవిధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావుపై న్యాయవాదులే స్వయంగా ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. అదే అలిపిరిలో పుష్పగుచ్ఛం ఇచ్చి నిరసన తెలిపినవారిని ఎవరూ ఫిర్యాదు చేయకుండానే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారు. దీనిపై న్యాయవాదులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు పైకి మాత్రం తాము ఉద్యమానికి సానుకూలం అని చెబుతున్నా లోలోపల తమకు అందిన ఉత్తర్వుల ప్రకారం ఉద్యమాన్ని కఠినంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే భారీ ఎత్తున సాయుధబలగాలను మోహరిస్తున్నారు. మరోవైపు ఉద్యమాలను అణచి వేసేందుకు కొత్త కొత్త పద్ధతులను అమల్లోకి తెస్తున్నారు. ఇంతవరకు తిరుపతివాసులకు తెలియని ముళ్లకంచె పద్ధతిని తెరపైకి తెచ్చారు. తప్పుడు కేసుల్లో ఇరికించిన సమైక్యవాదులను విడుదల చేయాలని, వీహెచ్‌పై కేసు నమోదు చేయాలని జిల్లా పోలీసు కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, కార్యకర్తలను నిలువరించేందుకు ముళ్లకంచెను అడ్డుగా వేశారు. ఇద్దరు డీఎస్పీల సారథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. సాక్ష్యాధారాల సేకరణ తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు సమైక్య ఉద్యమాలను నిశితంగా పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఎక్కడైనా ఉద్యమకారులు ఆందోళనలకు, నిరసనలకు దిగే అవకాశం ఉందని సమాచారం అందితే, అక్కడ పోలీసు వీడియో కెమెరాలను, స్టిల్ ఫొటోగ్రాఫర్లను ఉంచి జరుగుతున్న ఘటనలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తున్నారు. వీహెచ్ ఘటనలో కూడా ఇలా వీడియోల ఆధారంగానే, ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, నిరసనకారులను అరెస్టు చేశారు. వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అలిపిరి ఘటన సంచలనం సృష్టించటంతో దీనిపై డీజీపీ దినేష్‌రెడ్డి నుంచి కూడా అర్బన్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు అక్షింతలు పడినట్లు సమాచారం. ఈ క్రమంలో నిఘావర్గాలు నగరంలో జరిగే ఉద్యమాలకు సంబంధించి ప్రతి క్షణం సమాచారాన్ని ఎస్పీకి అందించే విధంగా స్పెషల్ బ్రాంచ్ వర్గాలు రంగంలోకి దిగాయి. అదే సమయంలో ఉద్యమ తీవ్రత, పాల్గొంటున్న సంఘాలు, సంస్థలు, నాయకుల వివరాలను ఇంటెలిజెన్స్ వర్గాలు క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నాయి. -
ఊరూవాడా సమైక్య సమరం
సాక్షి, తిరుపతి: పట్టణాలు, పల్లెలని తేడా లేకుండా వాడవాడలా సమైక్య ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. రాజకీయ పార్టీలకు అతీతంగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసేందుకు సోమవారం తిరుపతితో ఉద్యమ సారథులు సమావేశ మయ్యారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తిరుపతిలో మానస అనాథాశ్రమం, సాయిశ్రీ స్కూలు విద్యార్థులు సమైక్యాంధ్ర జాతర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వాన్ని దున్నపోతుతో పోల్చారు. దున్నపోతు ఆకారంలో తయారు చేసిన బొమ్మను కార్పొరేషన్ కార్యాలయం ముందు రోడ్డుపై నరికారు. దున్నను నరికితే రక్తం వచ్చేలా బొమ్మను తీర్చిదిద్దారు. మున్సిపల్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎల్.వర్మ ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అలాగే ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు సుమారు వెయ్యి బైక్‌లతో ర్యాలీ చేశారు. ఏపీ ఎన్జీవోలు ఎన్టీఆర్ కూడలిలో వంటావార్పు నిర్వహించారు. ఆటోవాలాలు ర్యాలీ, బధిరుల సంఘం ఆధ్వర్యంలో విభజన పరులు దిష్టిబొమ్మలను దహనం చేశారు. రెస్టారెంట్ల అసోసియేషన్ వారు బంద్ పాటించారు. హోటల్ యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు దీక్షలు చేశారు. కోర్టు సిబ్బంది విధుల బహిష్కరణ జిల్లాలో కోర్టుల్లో పనిచేసే సిబ్బంది సోమవారం విధులు బహిష్కరించారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పీలేరు, పుత్తూరులో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. న్యాయవాదులు సంఘీబావం ప్రకటించారు. చిత్తూరులో వైద్యఆరోగ్య శాఖ జేఏసీ ఆధ్వర్యంలో రాల్యీ నిర్వహించారు. తిరుపతి, చిత్తూరులో ఫొటో వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో షాపులు మూసివేసి నిరసన తెలిపారు. చిత్తూరులో పూలమార్కెట్లో కేసీఆర్‌కు పాడెకట్టి శవయాత్ర నిర్వహించారు. ఐసీడీఎస్ ఉద్యోగులు, అంగన్వాడీలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పీలేరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సుమారు 3 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ, వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పశు సంవర్థకశాఖ అధికారులు, సిబ్బంది నిరసన ర్యాలీ చేశారు. గర్జించిన విద్యార్థులు శ్రీకాళహస్తిలో సుమారు 10 వేల మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రామకుప్పంలో విద్యార్థుల ర్యాలీ, మానవహారం నిర్వహించారు. పలమనేరులో జేఏసీ ఆధ్వర్యంలో అన్ని మండలాల తహశీల్దార్లు, వీఆర్వో, వీఆర్ఏ, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు నిరవధిక దీక్షలో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా న్యాయవాదులు పాల్గొన్నారు. నడింపల్లి, చిన్నూరు గ్రామస్తులు సుమారు వెయ్యిమంది జేఏసీ వారికి మద్దతు తెలిపి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మున్సిపల్ అధికారులు విధులు బహిష్కిరించారు. గంగవరం మండలంలో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ చేశారు. బెరైడ్డిపల్లిలో టీడీపీ కార్యకర్తలు అర్థనగ్న ప్రదర్శన చేశారు. వీకోటలో చికెన్ దుకాణ యజమానులు రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మహిళలు పాల్గొన్నారు. మదనపల్లెలో న్యాయ, విద్య, వైద్య, మహిళా, మున్సిపల్ ఉద్యోగులు, సెరికల్చర్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ సంఘాలు, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు సుమారు నాలుగు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మున్సిపల్ మాజీ చైర్మన్ నరేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రీవెన్ససెల్ను అడ్డుకున్నారు. సత్యవేడులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు, ఎన్జీవోలు, విద్యార్థులు, కోర్టు సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారుల దిగ్బంధం సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనకారులు పలుచోట్ల జాతీయ రహదారులను దిగ్బంధించారు. చంద్రగిరిలో పొలిటికల్ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనంతరం వంటావార్పు నిర్వహించారు. కుప్పం వద్ద జాతీయ రహదారులను దిగ్బంధించారు. శాంతిపురంలో జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. పుంగనూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. వాల్మీకి సంఘ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు. పుత్తూరులో విద్యుత్‌శాఖ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరిలో ముస్లిం సోదరులు దీక్షలు చేశారు. -
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై ‘సమైక్య’ ప్రభావం
విజయవాడ, న్యూస్‌లైన్ : ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ సమైక్య ఉద్యమం ప్రభావం కనిపించింది. విజయవాడలోని మూడు సెంటర్లలో అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిం చారు. ఈ మూడు కేంద్రాల వద్ద సమైక్యవాదులు కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూడు గంటలపాటు కౌన్సెలింగ్ నిలిచిపోయింది. ఇప్పటికే రెండునెలల ఆలస్యంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, ఇప్పుడు అడ్డుకుంటే ఎలాగని సమైక్యవాదులతో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. తమ పిల్లల భవిష్యత్ ఏమిటని ఆందోళనకారులను ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోతే ఇంజినీరింగ్ విద్యార్థులకు భవిష్యత్తు అంధకారమవుతుందన్న ఆందోళనతోనే తాము ఉద్యమం చేస్తున్నామని, తల్లిదండ్రులు సహకరించాలని సమైక్యవాదులు కోరారు. పాలిటెక్నిక్ కళాశాలలో నిలిచిన కౌన్సెలింగ్ ప్రభుత్వ పాలిటెక్నిక కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సిబ్బంది హాజరుకాలేదు. సిబ్బంది మొత్తం ఉద్యమంలో పాల్గొనడంతో ఒకటి నుంచి 5 వేల ర్యాంక్ వరకూ జరగాల్సిన కౌన్సెలింగ్ నిలిచిపోయింది. ఈ కేంద్రానికి హాజరుకావాల్సిన విద్యార్థులను లయోలా కళాశాల, ఎస్ఆర్ఆర్ కళాశాల్లో జరిగే కౌన్సెలింగ్ సెంటర్లకు తరలించారు. ఆంధ్రా లయోలా కళాశాలలో లయోలా కాలేజీలో ఉదయం 9.30గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమయ్యింది. ఏపీఎన్జీవోస్ జేఏసీ నాయకులు వచ్చి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి వచ్చి సమైక్యవాదులను వారించారు. 5001నుంచి 10 వేల ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ నిర్వహించగా, 285 మంది సర్టిఫికెట్లు పరిశీలించారు. ఎస్ఆర్ఆర్కళాశాలలో.... ఎస్ఆర్ఆర్ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రారంభమైన సమయంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. విద్యార్థి జేఏసీ నాయకుడు దేవినేని అవినాష్ విద్యార్థి నాయకులతో కళాశాలకు వచ్చి ఉద్యమానికి మద్దతుగా కౌన్సెలింగ్ నిలిపివేయాల్సిందిగా నిర్వాహకులను కోరారు. దీంతో కొద్దిసేపు కౌన్సెలింగ్ నిలిచిపోయింది. అనంతరం నిర్వాహకులు ఉన్నతాధికారులతో సంప్రదించి కొనసాగించారు. 278 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. రెండో రోజూ కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని సమైక్య వాదులు ప్రకటించారు. -
అరగుండు గీయించుకున్న ఎమ్మెల్యే టీవీ రామారావు
పశ్చిమ గోదావరి జిల్లాలో సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. కొవ్వూరు బస్టాండు నుంచి రోడ్-కమ్ రైల్వే బ్రిడ్జి వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్-కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద అఖిలపక్షం మహా ధర్నా కూడా చేశారు. దీనికి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ర్యాలీలో ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు, వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ కొయ్యె మోషన్ రాజు, ఎమ్ఎస్ఓ మైపాల రాంబాబు, యువరాజు కేబుల్ అధినేత దుడ్డుపూడి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యే టీవీ రామారావు అరగుండు గీయించుకున్నారు. సమైక్యాంధ్ర ప్రకటించకుంటే కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎమ్ఎస్ఓ మైపాల రాంబాబు, యువరాజు కేబుల్ అధినేత దుడ్డుపూడి రామచంద్రరావు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజన ప్రకటన చేశారని కృష్ణబాబు, కొయ్యె మోషన్ రాజు విమర్శించారు. విభజన ఖాయమంటూ దిగ్విజయ్ చెబుతున్నా కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆంటోనీ కమిటీ ఢిల్లీలో కూర్చొని అభిప్రాయాలు సేకరించడం కాదని, సీమాంధ్ర ప్రాంతానికి వచ్చి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండు చేశారు. ప్రజలకు న్యాయం జరిగేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కృష్ణబాబు, కొయ్యె మోషన్ రాజు తెలిపారు.