సాక్షి, నెల్లూరు : సమైక్య ఉద్యమంలో భాగంగా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి వైఎస్సార్‌సీపీ సోమవారం యత్నించింది. ఈ ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్దకు వెళ్లకుం డా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోవూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నేతల అరెస్ట్ సమయంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. నేతల అరెస్ట్‌ను అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున మోహరించిన సీఆర్‌పీఎఫ్ బలగాలు కార్యకర్తలను పక్కకు లాగి పడేశాయి. దీంతో పలువురు కార్యకర్తలు, విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.
ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వచ్చి ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్వార్థంతో రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ధ్వజమెత్తారు. కొడుకు రాహుల్‌ను ప్రధానిగా చేసేందుకు సోనియాగాంధీ విభజనకు ఆమోద ముద్ర వేశారని, ప్రతిపక్ష నేత చంద్రబాబు మద్దతు పలకడంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్నిప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తం
ముక్కలు చేస్తోందని విమర్శించారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్ర తీవ్రంగా నష్ట పోతుందన్నారు. అన్ని ప్రాంతాల వారు 60 ఏళ్లపాటు కష్టపడగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ఇవాళ హైదరాబాద్‌ను వీడి పొమ్మంటే ఎలా వెళతారని కోటంరెడ్డి ప్రశ్నించారు. డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల కుట్రల వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందన్నారు. మంత్రి ఆనం సీఎం పదవి కోసం గోతి కాడ గుంటనక్కలా కాచుక్కూర్చున్నారని ధ్వజమెత్తారు. మరో వైపు ఆనం వివేకా తాను సమైక్యవాదినంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని అనిల్ విమర్శించారు.
ఆనం సోదరులకు ధైర్యం ఉంటే కాంగ్రెస్ జెండాలు పట్టుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలోకి వచ్చి చూడాలని సవాల్ విసిరారు. అనంతరం ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడికి కార్యకర్తలతో వెళ్లాలనుకున్న వైఎస్సార్‌సీపీ నేతలను పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శివారెడ్డి నేతృత్వంలో పోలీసులు చుట్టు ముట్టారు. ఒక్కసారిగా కాకాణి, అనిల్, కోటంరెడ్డిలను జీపుల్లో తరలించేందుకు ముందుకు వచ్చారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తాము శాంతియుతంగా ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద ధర్నా చేస్తామంటుంటే అడ్డుకోవడం ఏంటంటూ డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డిని నిలదీశారు. అయినా వినిపించుకోని పోలీసులు కాకాణి, అనిల్‌లను తొలుత బలవంతంగా పోలీసు జీపులో ఎక్కించారు. వీరిని అడ్డుకునేందుకు కార్యకర్తలతో పాటు కోటంరెడ్డి సైతం ప్రయత్నించారు. సీఆర్‌పీఎఫ్ బలగాలు వీరిని లాగి పక్కకు నెట్టేసి కాకాణి, అనిల్‌ను కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అరెస్టులకు నిరసనగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కొద్దిసేపు ధర్నా చేశారు.
ఏఆర్ డీఎస్పీ శివారెడ్డి నేతృత్వంలో పోలీసులు కోటంరెడ్డిని సైతం అరెస్టు చేసి జీపులో కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య పెనుగులాటలో పలువురు కార్యకర్తలు స్వల్ప గాయాలతో సొమ్మ సిల్లారు. వారిని కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత పోలీసులు సొంత పూచీకత్తుపై పార్టీ నేతలను వదిలి పెట్టారు. ఈ కార్యక్రమంలో బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, కెవి రాఘవరెడ్డి, మందా బాబ్జీ, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మునీర్ సిద్ధిక్, ముప్పసాని శ్రీనివాసులు, దార్ల వెంకటేశ్వర్లు, ఎస్‌కె. ఖాసీం, బాల కోటేశ్వరరావు, రఘురామిరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, ఎస్‌కె. మంజూర్, ఇంతియాజ్, వేనాటి శ్రీకాంత్‌రెడ్డి, పిగిలాం సుధాకర్, శ్రావణ్ కుమార్, జయవర్ధన్, హరి ప్రసాద్, ఎస్‌కె. హాజీ, హరికృష్ణ, సత్యకృష్ణ, సుభాషిణి, సోనీ, మీనమ్మ పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తం
Published Tue, Oct 8 2013 4:37 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement