అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : పైసల్లేక ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కుంటుపడ్డాయి. జనం ఇబ్బందులు పడుతున్నా ఏమీ చేయలేని స్థితిలో అధికారులు ఉన్నారు. కొత్త బడ్జెట్ విడుదలయ్యే దాకా అవస్థలు తప్పవని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో గత ఆరు నెలలుగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు నిధుల విడుదల ఆగిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమం కారణం గా మూడు నెలలు, ఎన్నికల కోడ్ వల్ల మరో రెండు నెలలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజ ధానిలో శాఖల విభజన జరుగుతుండడంతో నెల రోజులుగా ప్రభుత్వం నుంచి పైసా విడుదల కావడం లేదు. కొన్ని నెలలుగా గ్రామాల్లో ప్రజలు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.5.50 కోట్లు కావాలని జిల్లా అధికారులు గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రభుత్వానికి నివేదిక పంపారు.
135 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, స్థానిక రైతుల నుంచి వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకొని 65 గ్రామాలకు నీటి సరఫరా, 119 గ్రామాల్లోని ఆర్‌డబ్ల్యూఎస్ బోర్ల ఫ్లషింగ్, ఎండిపోయిన 209 బోర్లను మరింత లోతుకు వేయడం.. తదితర పనుల కోసం ఈ నిధులను కోరారు. అయితే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ప్రస్తుతం 120 గ్రామాల్లో నీటిఎద్దడి జఠిలం కావడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వాటికి కూడా బిల్లులు చెల్లించలేని స్థితిలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు. మరోవైపు రెండు నెలలుగా వేతనాలందక ఉపా ధి హామీ పథకం కూలీలు అవస్థ పడుతున్నా రు. జిల్లాలో 1006 గ్రామ పంచాయతీలు ఉం డగా.. 885 పంచాయతీల్లో ఉపాధిహామీ ప థకం పనులు జరుగుతున్నాయి. కూలీలకు మా ర్చి నుంచి వేతనాలు ఆగిపోయాయి.
దాదాపు రూ.12 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో పనులు కూడా పూర్తిస్థాయిలో కల్పించలేని స్థితిలో అధికారులు ఉన్నారు. 2,62,202 మంది కూలీలకు గాను 80 వేల మందికి మాత్రమే కల్పిస్తున్నారు. జిల్లాలోని పింఛన్‌దారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసినప్పటి నుంచి పింఛన్లకు సంబంధించిన నిధులు విడుదల కాలేదు. అధికారులు మూ డు నెలలు సర్దుబాటు చేసినా... రెండు నెలల నుంచి మాత్రం అవస్థ పడుతున్నారు. ఈ నెల లో ఇంత వరకూ పింఛన్ ఇవ్వలేదు. ఇంది రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా రూ.1.50 కోట్ల బిల్లులు పెండింగ్ పడ్డాయి. వైఎస్సార్ అభయహస్తం, 108,104 వైద్య సేవ లు తదితర కార్యక్రమాలపైనా నిధుల ఎఫెక్ట్ పడుతోంది.
పైసల్లేవ్!
Published Mon, May 19 2014 2:00 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement