నర్సంపేట, న్యూస్‌లైన్ :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య ఉద్యమానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తూ అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నాడని టీజేఏసీ రాష్ర్ట కోకన్వీనర్ వుల్లేపల్లి లక్ష్మయ్యు ఆరోపించారు. విభజను అడ్డుకోవాలని సీమాం ధ్రులు కృత్రిమ ఉద్యమాలు చేయడం సిగ్గుచేట ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెం ట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి హైదరాబాద్‌తో కూడిన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా మల్లేపల్లి లక్ష్మయ్య హాజరై మాట్లాడారు.
తెలంగాణ కోసం 56 ఏళ్లుగా ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారని, రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసిన వెంటనే సీమాంధ్రుల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడిన తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు. హైదరాబాద్ వూది అనే నినాదంతో త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వూనవహారం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఇకపై సీవూంధ్రుల స్కూళ్లకు వెళ్లకుండా, సినివూలను చూడకుండా తెలంగాణ ప్రాంత ప్రజలను చైతన్యవంతం చేస్తావున్నారు. సదస్సులో నున్నా అప్పారావు, కోడి సోవున్న, ఆబర్ల రాజన్న, తోటకూరి రాజు, లావుడ్యా రాజు, బూర్క వెంకటయ్యు, నర్సక్క, గుండె శ్రీను, రాజేం దర్, యూకన్న పాల్గొన్నారు. కాగా, సదస్సుకు ముందుకు న్యూడెమోక్రసీ కళాకారులు పట్టణంలో ఆటపాటలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ వచ్చే వరకూ తెగించి కొట్లాడుడే.. అంటూ చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాకారులు గుండె శ్రీను, తిరువుల, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
సమైక్య ఉద్యమానికి సీఎం కన్వీనర్
Published Sat, Sep 21 2013 2:44 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement