బద్వేలు అర్బన్, న్యూస్‌లైన్: బద్వేలులో జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం భోగి మంటల్లో తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సాంబశివారెడ్డి, కో కన్వీనర్ ఆవుల శ్రీనివాసరావు మాట్లాడుతూ నెలల తరబడి సమైక్య ఉద్యమం కొనసాగిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా విభజనవైపు మొగ్గు చూపడం బాధాకరమన్నారు.
సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్వార్థ పూరిత రాజకీయాల కోసం రాష్ట్రానే విడదీయాలనుకోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ బి.మునెయ్య, వైఎస్సార్ సీపీ నాయకుడు బోడపాడు రామసుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీవీఎన్. ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకుడు నరసింహనాయుడు, ఉపాధ్యాయసంఘం నేతలు రామక్రిష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, జేఏసీ నాయకులు పెద్దిరెడ్డి చెన్నాక్రిష్ణారెడ్డి, రామానాయుడు, పుష్పరాజ్, శివరామిరెడ్డి, కొండయ్య, సత్యనారాయణరెడ్డి, శోభన్‌బాబు,నరసింహారెడ్డి, వార్డన్లు ఆనందరావు, రమణారెడ్డి, పాల్గొన్నారు.
ఎర్రగుంట్లలో: సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్టీపీపీ గేటువద్ద సోమవారం తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను దహనంచేసి నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ వి.సుబ్బిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనవల్ల దేశంలో అనేక ప్రాంతీయ ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న యూపీఏ ప్రభుత్వం ప్రజల ఆగ్రహావేశాల్లో దగ్ధమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు నరసింహులు, ఓబుళయ్య, ప్రతాప్, ఆనందరావు, రామారావు, గంగయ్య చంద్రశేఖర్ పాల్గొన్నారు.
భోగిమంటల్లో టీ బిల్లులు
Published Tue, Jan 14 2014 2:10 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement