
కొత్త పార్టీ పెట్టిన మాజీ ప్రధాని
కట్మాండు: నేపాల్ మాజీ ప్రధాని బాబురామ్ భట్టారాయ్ కొత్త పార్టీ స్థాపించాడు. ఆయన తన పార్టీకి 'న్యూ ఫోర్స్ నేపాల్' అని నామకరణం చేశాడు. అంతకుమందు ప్రచండ ఆధ్వర్యంలో నడుస్తున్న యూసీపీఎన్-మావోయిస్టు పార్టీలో కొనసాగిన బాబురామ్ ఆయనతో విభేదాల కారణంగా గత నాలుగు నెలల కిందటే ఆ పార్టీని వదిలి బయటకొచ్చారు.
ఆ తర్వాత సుదీర్ఘంగా మాజీ మావోయిస్టులు, ఇతరులతో చర్చలు జరిపి చివరికి నేడు(ఆదివారం) 35 మంది అంతర్గత కేంద్ర మండలి సభ్యుల పేరుతో పార్టీని ప్రకటించారు. దఫాల వారిగా వీరి సంఖ్య 265కు పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం నేపాల్ ల్లో ఉన్న పార్టీకి తమ పార్టీ ప్రత్యామ్నాయం కానుందని, తమ పార్టీలో మాజీ మావోయిస్టులు ఉంటారని ఆయన ప్రకటించారు.