సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటు విషయమై చర్చిస్తున్నారు.
హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటు విషయమై చర్చిస్తున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ సాయంత్రం పీసీపీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసంలో సమావేశమయ్యారు.
ఇదిలా ఉండగా, సీఎం కొత్తపార్టీ ఏర్పాటు విభజన సమస్యకు పరిష్కారం కాదని మంత్రి రామచంద్రయ్య అన్నారు. సిడబ్ల్యూసి తెలంగాణ తీర్మానం చేసినప్పుడే సీఎం రాజీనామా చేసి ఉండాల్సిందని అన్నారు. రాజకీయ ప్రయోజనాలకే సీఎం రాజీనామా అని విమర్శించారు. ఇది నిజమైన సమైక్యవాదం కాదని కూడా ఆయన అన్నారు. కాంగ్రెస్ బలహీనపడిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. పార్టీలో కొనసాగుతూ పార్టీని బలోపేతం చేయాలే తప్ప, కాంగ్రెస్‌ను వీడాలనుకోవడం సరికాదని రామచంద్రయ్య అన్నారు.