తెలుగువారి ఆత్మగౌరవమే అజెండాగా కొత్తపార్టీ పెట్టనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మాదాపూర్ ఇమేజ్ హాలులో ఈ సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగువారి గుండెచప్పుడే తమ విధానంగా పార్టీ అని చెప్పారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన, రాజీనామా చేసిన కొందరు నేతలతో కిరణ్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కొత్త పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నెల 12వ తేది గురువారం సాయంత్రం 4 గంటలకు రాజమండ్రిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ సభలో పార్టీ పేరు, పార్టీ విధివిధానాలు, ఇతర అంశాలు ప్రకటిస్తామన్నారు. పదవుల కోసం కాదని, ప్రజల కోసం పార్టీ పెడుతున్నట్లు చెప్పారు.
Published Thu, Mar 6 2014 7:12 PM | Last Updated on Wed, Mar 20 2024 5:20 PM
Advertisement
Advertisement
Advertisement