కిరణ్ పార్టీకి ఒక్కసీటు కూడా రాదు: భూమన
కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే కొత్త పార్టీకి ఒక్క సీటు కూడా రాదని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్ఠానానికి పూర్తిస్థాయిలో సహకరించింది కిరణ్ కుమార్ రెడ్డేనని, ఇప్పుడు ఆయన కొత్త పార్టీ అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇప్పుడు కిరణ్ నిందలు వేయడం సిగ్గుచేటని భూమన మండిపడ్డారు. అసలు జగన్ పేరు వింటేనే కిరణ్, చంద్రబాబులకు వెన్నులో వణుకు పుడుతోందని ఆయన అన్నారు.