మంచిర్యాలక్రైం : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నేరవేర్చుటకు రాష్ట్రంలో ఓ కొత్త పార్టీ ఏర్పాటు అవశ్యకత ఉందని టీజేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గురిజాల రవీందర్‌రావు అన్నారు. మంచిర్యాలలోని టీజేఏసీ పార్టీ కార్యాలయంలో సోమవారం కోదండరామ్ పార్టీ అవిర్భావ సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత తిరిగి పాత కథే పునరావృత్తం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంకుశ, దొరల, కుటుంబ పాలనకు తెరలేపారని విమర్శించారు. ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమద్రోహులకు పదవులు అంటగట్టడం తెలంగాణకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోíషించిన కోదండరామ్ నేతృత్వంలో ఏర్పడుతున్న పార్టీకి ప్రజలందరు మద్దతు పలకాలని కోరారు. అనంతరం మంచిర్యాల, కుమురంభీం జిల్లాల సమన్వయ కమిటీలను నియమించారు.
సమన్వయ కమిటీ సభ్యులు...
మంచిర్యాల జిల్లా సమన్వయ కమిటీ సభ్యులుగా బాబన్న, సంజీవ్, శ్యాంసుందర్‌రెడ్డి, ఎండీ.ఫయాజ్, చంద్రశేఖర్, పరంధాంకుమార్, ఇబ్రహీం, మనోహర్, లక్ష్మి, మద్దెల భవాని, రవికుమార్, రమేష్, పెరుగు రవీందర్, ఎర్రబెల్లి రాజేష్, రాజన్న, రాజునాయక్, రాజు, రమణాచారి, ప్రవీణ్‌కుమార్‌లను నియమించారు.
తెలంగాణలో కొత్త పార్టీ ఆవశ్యం
Published Tue, Mar 27 2018 6:48 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment