
బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ : బీసీల హక్కుల సాధనకు రాజకీయ వేదిక అవసరమని, అయితే పార్టీ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...బీసీలలో ఉన్న మేధావులు, కుల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని, భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్‌లు సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రశ్నించగా తనను రావాలని అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని ఇటీవల కాంగ్రెస్ పెద్దలు కూడా తనతో చర్చించారని, కానీ తాను ఏ పార్టీలోనూ చేరబోనని అన్నారు.