సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో హైడ్రా ఆపితే హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అలాగే, ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో కొండా సురేష్, కేటీఆర్ అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైడ్రా, మూసీ యజ్ఞం ఏదీ ఆగదు. హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరిస్తాం. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం. మా కుటుంబసభ్యులు కబ్జా చేసిన కూల్చేయండి. మూసీ సుందరీకరణపై ఇంకా డీపీఆర్ సిద్ధం కాలేదు. నిధులు ఎలా మళ్లిస్తాం. బీఆర్‌ఎస్ నేతలు దాదాపు 1500 చెరువులను కబళించారు. మూసీ సుందరీకరణ ప్రారంభానికి ముందే అవినీతి జరుగుతుందంటూ బీఆర్‌ఎస్ విమర్శలు అవివేకం. ఇప్పుడు జరుగుతుంది మూసీ ప్రక్షాళన మాత్రమే.
రుణ మాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు మాట తప్పారు. సవాలు విసిరి వెనక్కి తగ్గారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ రుణమాఫీకి ఇచ్చిన సొమ్మెంత.. కాంగ్రెస్ ఇచ్చిన సొమ్మెంతో హరీష్ చెప్పాలి. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాము.. తొమ్మిదినెలల్లోనే 18 వేల కోట్లు రుణమాఫీని ప్రభుత్వం చేసింది. దీనిపై చర్చకు మేం సిద్దమే..హరీష్ సిద్దమా?. ఏడున్నర లక్షలపైగా అప్పుతో బీఆర్‌ఎస్ మాకు రాష్ట్రాన్ని అప్పగించింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ చేశాం.
కేటీఆర్ అమెరికాలో చదివాడా? లేక సర్టిఫికెట్ కొన్నాడా?. కేటీఆర్‌పై కోపంతో కొండా సురేఖ మాట్లాడారు. పీసీసీ సూచనతో వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. మాటల్లో తప్పులు దొర్లాయి కాబట్టి.. సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ వివాదానికి తెర లేపిందే కేటీఆర్. యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. కానీ, రఘునందన్ రావు విషయంలో కొండా సురేఖపై దుబాయ్ నుంచి సోషల్ మీడియాలో తప్పుగా పోస్టు చేశారు. దానివల్లే సురేఖ అలా మాట్లాడారు. అయినా అలా మాట్లాడటం సరైంది కాదు కాబట్టి కొండా సురేఖ చెప్పాం. దీంతో, తన మాటలను ఉపసంహరించుకున్నారు. ఆ వివాదానికి ముగింపు పలకాలని సూచించాం. ఎవరు అయినా కోర్టుకు వెళ్ళే హక్కు ఉంటుంది. అందుకే నాగార్జున కూడా వెళ్లి అంటారు.
త్వరలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ జరుగుతుంది. రాష్ట్ర మంత్రి వర్గంలో నిజామాబాద్‌కు తప్పుకుండా ప్రాతినిధ్యం దక్కుతుంది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం లభిస్తుంది. నిజామాబాద్ స్మార్ట్ సిటీ జాబితాలో ఉండాల్సిందే. సాంకేతిక అంశాలు అన్నీ అనుకూలంగా ఉన్నా జాబితాలో రాలేదు. కొందరి అసమర్థత వల్ల జాబితాలో రాలేదు. స్మార్ట్ సిటీ జాబితాలో వచ్చేలా ప్రయత్నం చేస్తాం. జిల్లాలో మరో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నా. 2025 నాటికి సీఎంసీ మెడికల్ కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటాం అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: హరీష్.. కేసీఆర్‌ను తీసుకొచ్చే కెపాసిటీ ఉందా?: జగ్గారెడ్డి సవాల్
Comments
Please login to add a commentAdd a comment