
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు ఉండదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
సాక్షి, న్యూ ఢిల్లీ: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు ఉండదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందన్నారు.
కాంగ్రెస్‌కు 20, 30 సీట్లు వచ్చినా బీఆర్‌ఎస్‌కు వెళ్లిపోతారు.. అందుకే మాకు 60 సీట్లు కావాలి. పూర్తి మెజారిటీతో మమ్మల్ని గెలిపించే బాధ్యత ప్రజలదే. కాంగ్రెస్‌కు 20 సీట్లు వస్తే పోతారు కాబట్టి జనం 80 సీట్లు ఇస్తారు. బీఆర్‌ఎస్‌కు ఈ సారి 25 సీట్లే. ఎవరినైనా క్షమిస్తాం కానీ, కేసీఆర్‌ను క్షమించేది లేదని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో స్వేచ్చ లేదు. ఆంధ్రా, నిజాం పాలనలో కూడా అభివృద్ధి జరిగింది.. కానీ స్వేచ్ఛ కోసమే తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
‘‘బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంల మధ్య ట్రయాంగిల్ లవ్ ఉంది. బీజేపీతో కొట్లాడినట్లు నటిస్తూ కాంగ్రెస్‌ను మింగేస్తారు ధృతరాష్ట్ర కౌగిలికి మేం సిద్ధంగా లేం’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
చదవండి: పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన దిల్ రాజు.. రాజకీయాల్లోకి వస్తాడా? రాడా?