
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ శివారులోని భూముల అక్రమ కేటా యింపులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడు లు, కేసుల నుంచి తప్పించుకునేందుకే సీఎం కేసీఆర్ పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలతో ఆందోళన చేయించారని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ఈ భూముల వ్యవహారానికి సంబంధించి మంత్రి కేటీఆర్‌ను ఈడీ పిలిపించాలని చూసిందని, చివరి నిమిషంలో అది వాయిదా పడిందని తెలిపారు. తాత్కాలికంగా వాయిదా వేశారనే కృతజ్ఞతతోనే ఆ పార్టీ ఎంపీలు సభాకార్య క్రమాలకు ఆటంకం కలిగించి బీజేపీ ప్రభుత్వానికి పరోక్షంగా సహకరిం చారన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వా లని ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తుంటే, దానిని పక్కదోవ పట్టించేందుకు టీఆర్‌ఎస్ ఎంపీలు పోడియం చుట్టుముట్టి ఆందోళన చేశారు.
హైదరాబాద్ శివార్లలో రూ.3 వేల కోట్ల విలువైన భూముల విషయంలో కేసీఆర్ సన్నిహితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. వారందరినీ పిలిచి విచారించింది. ఉమ్మడి ఏపీలో 15 ఏళ్ల క్రితం విదేశీ కంపెనీ లకు రూ.450 కోట్లకు ఈ భూములను అప్పటి ప్రభుత్వం కట్టబెడితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి నుంచి బలవంతంగా రూ.350 కోట్లకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు చెందిన పెద్ద రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్, టీవీ చానల్ యజమానికి కట్టబెట్టారు. ఈ భూముల అక్రమాల ఫైలుపై మంత్రి కేటీఆర్ సంతకం చేశారు’అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment