సాక్షి, హైదరాబాద్: అధికారులు తమ మాట వినడం లేదంటూ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్నామో.. ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారుల వ్యవహారాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులకు మహేష్‌గౌడ్ అప్పగించారు. కాగా, రేపు సాయంత్రం 4 గంటలకు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మాదాపూర్ రాడియంట్ హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
మరోవైపు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేపడుతోంది. పీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో శనివారం నుంచి జిల్లా స్థాయి సమీక్షలు ప్రారంభమయ్యాయి.
ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల స్థితిగతులు, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తీరు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ అంశాల ప్రాతిపదికగా ఈ సమీక్షలు జరుగుతాయని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో పార్టీ అన్ని స్థాయిల నాయకులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment