![TPCC Chief Revanth Reddy Slams KCR - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/12/Untitled-8.jpg.webp?itok=Ou_rXMHp)
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ అనే కాలం చెల్లిన మెడిసిన్ ఇక పనిచేయదని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.శనివారం టీపీసీసీ ముఖ్య నేతల సమావేశం అనంతరం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో సీనియర్ నేతలు షబ్బీర్‌అలీ, మల్లు రవి, బలరాం నాయక్, అంజన్‌కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, దాసోజు శ్రవణ్, అనిల్ కుమార్ యాదవ్‌లతో కలసి మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన పాత్రను పెద్దది చేసి చూపడానికే కేసీఆర్ జాతీయపార్టీ ఏర్పాటు అంశాన్ని ఎత్తుకున్నారని అన్నారు. కేసీఆర్ ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి కథలు చెప్తా రని, వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ లేనప్పు డు పొత్తు కోసం ఎందుకు ప్రయత్ని స్తున్నా రని రేవంత్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లైంగిక దాడి ఘటనపై సీఎం కేసీఆర్ కానీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకానీ ఇంతవరకూ స్పందిం చలేదని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత లపై చర్చించేందుకు కేసీఆర్ వెంటనే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో శాంతిభద్రతల సమస్య తీవ్రమైన నేపథ్యంలో ఈ నెల 15న ‘హైద రాబాద్ బచావో’నినాదంతో అఖిల పక్ష సమా వేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
3న ఈడీ కార్యాలయం వద్ద నిరసన
నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగకపో యినా కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట రేట్(ఈడీ) నోటీసులు ఇప్పించి ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాల యంలో విచారణకు హాజరవుతున్న రాహు ల్ బయటకు వచ్చేవరకు అక్కడే శాంతి యుత నిరసన తెలపాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment