కొత్త సంవత్ 2081లో సానుకూలంగా లార్జ్ క్యాప్స్
మిడ్, స్మాల్ క్యాప్స్‌పై ఆచితూచి వ్యవహరించాలి
కన్సాలిడేషన్‌కు అవకాశం ఆకర్షణీయంగా ఫైనాన్స్, ఫార్మా, ఐటీ
కొంత పసిడి, వెండిలో కూడా పెట్టుబడులు
మార్కెట్ నిపుణుల సూచనలు
అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులు, అధిక వడ్డీ రేట్లు వంటి సవాళ్లు నెలకొన్నప్పటికీ సంవత్ 2080లో దేశీ సూచీలు కొత్త రికార్డు స్థాయులను తాకాయి. నిఫ్టీ50 దాదాపు 26,250 మార్కును, బీఎస్‌ఈ సెన్సెక్స్ 85,900 మార్కును దాటాయి. గత దీపావళి నుంచి దాదాపు 25 శాతం పెరిగాయి. కొన్నాళ్లుగా అంతర్జాతీయ సూచీల్లో భారత్‌కి వెయిటేజ్ గణనీయంగా పెరుగుతోంది.
దిగ్గజ గ్లోబల్ ఫండ్స్ దృష్టిని భారత మార్కెట్లు ఆకర్షిస్తున్నాయి. అమెరికా డాలరు బలహీనత, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వంటి అంశాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐలు) మన మార్కెట్ల వైపు మళ్లించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టెక్నికల్ చార్ట్స్ ప్రకారం చూస్తే నిఫ్టీ 22 శాతం, సెన్సెక్స్ 27 శాతం పెరగవచ్చనే అంచనాలున్నాయి.
అయితే, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, కొంత ఉద్దీపన చర్యలతో చైనా మార్కెట్లు పుంజుకోవడం వంటి అంశాల ప్రభావం మన మార్కెట్లపైనా ఉంటుందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మార్కెట్లో కన్సాలిడేషన్ జరగవచ్చని, 2080 సంవత్‌తో పోలిస్తే కొత్త సంవత్ 2081లో రాబడులు తక్కువగానే ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. గత 12–18 నెలలుగా ర్యాలీ చేసిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ .. ఆదాయ అంచనాలను అందుకోలేకపోతే గణనీయంగా తగ్గవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం మిడ్, స్మాల్ క్యాప్స్‌తో పోలిస్తే కాస్త స్థిరంగా, మెరుగైన వేల్యుయేషన్స్‌తో లార్జ్ క్యాప్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్, కన్‌స్ట్రక్షన్, ఫైనాన్స్ తదితర రంగాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే పసిడి, వెండికి కూడా కొంత కేటాయించాలనే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పలు బ్రోకరేజీలు కొత్త సంవత్ 2081లో పరిశీలించతగిన స్టాక్స్‌ను సూచించాయి. వాటిలో కొన్ని ..
గణనీయంగా పెరిగిన బంగారం ధరలు రాబోయే రోజుల్లోనూ అదే ధోరణి కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 30న అంతర్జాతీయంగా పసిడి రేటు ఔన్సుకి (31.1 గ్రా) ఆల్ టైమ్ గరిష్టం 2,801 డాలర్లని దాటింది.. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ. 79,775కి ఎగిసింది. 2080 సంవత్ నాటి నుంచి చూస్తే అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, సెంట్రల్ బ్యాంక్‌ల పాలసీల కారణంగా గ్లోబల్‌గా గోల్డ్ ధరలు 41 శాతం పైగా, ఎంసీఎక్స్‌లో 27 శాతం పైగా పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు చైనాలో పటిష్టమైన డిమాండ్, స్పెక్యులేటివ్ కొనుగోళ్లు కూడా పసిడికి ఊతమిస్తున్నాయి.
దేశీయంగా ఇటీవల పసిడిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో దీనిపై ఆసక్తి మరింత పెరిగింది. 2081 సంవత్‌లో పసిడి రేట్లు మరింత బలపడొచ్చు. ఎంసీఎక్స్‌లో పది గ్రాముల పసిడి రూ. 70,000– 87,000 శ్రేణిలో తిరుగాడవచ్చు. అంతర్జాతీయంగా ఔన్సు ధర 3,030 డాలర్ల స్థాయికి తాకే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక గణాంకాల వల్ల పెరుగుదలకు కాస్త అడ్డుకట్ట పడినా, మొత్తం మీద చూస్తే మాత్రం సానుకూల అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇన్వెస్టర్లకు బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉంటుంది.
– కాయ్‌నాత్ చైన్‌వాలా, అసోసియేట్ వీపీ, కమోడిటీ రీసెర్చ్, కోటక్ సెక్యూరిటీస్
బ్రోకరేజి సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్
బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రస్తుత ధర: రూ. 107.35
టార్గెట్ ధర: రూ. 132
పటిష్టమైన క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి, నికర వడ్డీ మార్జిన్లు .. అసెట్ క్వాలిటీ మెరుగుపడటం వంటివి సానుకూలాంశాలు. వ్యవసాయ, ఎస్‌ఎంఈ సెగ్మెంట్లలో అసెట్ నాణ్యత పడిపోయే అవకాశాలు, మొండిబాకీల పరిష్కారం ఆశించినంత స్థాయిలో ఉండకపోవడం, ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీము వర్తింపచేయడం ప్రతికూలాంశాలు.
జ్యోతిల్యాబ్స్
ప్రస్తుత ధర: రూ. 513.55
టార్గెట్ ధర: రూ. 600
ప్రమోటర్ ఆధారిత, దక్షిణాది కేంద్రంగా, సింగిల్ ప్రోడక్ట్ కంపెనీగా పని చేయడం నుంచి ప్రొఫెషనల్స్ నిర్వహణలో, బహుళ ఉత్పత్తులతో, దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించిన సంస్థగా ఎదిగింది. నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం మార్జిన్లకు దన్నుగా ఉండగలవు. ప్రతికూల వర్షపాతం, ద్రవ్యోల్బణం ప్రతికూలతలు.
నాల్కో
ప్రస్తుత ధర: రూ. 227.20
టార్గెట్ ధర: రూ. 270
అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుండటం, సరఫరా అంతగా లేకపోవడంతో అల్యూమినియం ధరలు పెరుగుతుండటం కంపెనీకి సానుకూలాంశాలు. నియంత్రణ విధానాలపరమైన మార్పులు, ముడివస్తువుల ధరల పెరుగుదల, అల్యూమినా రేట్లలో హెచ్చుతగ్గులు మొదలైనవి ప్రతికూలంగా ఉండవచ్చు.
నవీన్ ఫ్లోరిన్
ప్రస్తుత ధర: రూ. 3,331.95
టార్గెట్ ధర: రూ. 3,948
సీడీఎంవో, స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్స్ విభాగాలు వృద్ధి చెందుతుండటం కలిసి రానున్నాయి. ప్రోడక్ట్ మిక్స్ మెరుగ్గా ఉండటం వల్ల వచ్చే మూడేళ్లలో మార్జిన్లు750 బేసిస్ పాయింట్ల మేర మెరుగుపడొచ్చు. ముడి సరుకుల ధరల్లో హెచ్చుతగ్గులు, చైనా కంపెనీల నుంచి పోటీ, వ్యాపార విస్తరణలో జాప్యాలు మొదలైనవి మైనస్.
ఎన్‌సీసీ
ప్రస్తుత ధర: రూ. 292.20
టార్గెట్ ధర: రూ. 363
మౌలిక రంగంపై ప్రభుత్వ వ్యయాలు సానుకూల అంశం. ఆర్డర్ బుక్, బ్యాలెన్స్ షీట్ బాగుంది. ప్రాజెక్టుల అమలు వేగవంతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మధ్యకాలికంగా కంపెనీ ఆరోగ్యకరమైన స్థాయిలో వృద్ధి నమోదు చేయవచ్చు. ముడి సరుకుల ధరల్లో హెచ్చుతగ్గులు, ప్రాజెక్టుల వ్యయాలు పెరిగిపోవడం, జాప్యం వంటి రిసు్కలు ఉన్నాయి.
చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్
బజాజ్ ఆటో
ప్రస్తుత ధర: రూ. 9,917
టార్గెట్ ధర: రూ. 12,483
మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయి. అమ్మకాలను పెంచుకునేందుకు ఎగుమతులపై దృష్టి పెడుతుండటం, కొత్త వాహనాలు, ఈవీ చేతక్‌కు డిమాండ్ పెరుగుతుండటం, సీఎన్‌జీ ఆధారిత టూ–వీలర్లు, ఎలక్ట్రిక్ వేరియంట్ల విక్రయాలను పెంచుకునే వ్యూహాలు మొదలైనవి కలసి రానున్నాయి.
భారత్ డైనమిక్స్
ప్రస్తుత ధర: రూ. 1,063.70
టార్గెట్ ధర: రూ. 1,501
భద్రతా బలగాల అవసరాల ఉత్పత్తులను అందిస్తోంది. భారీ ప్రాజెక్టులు 2025 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఎగుమతులను పెంచుకునే క్రమంలో 4–5 దేశాలతో చర్చలు జరుగుతున్నాయి. సాయుధ బలగాలకు సంబంధించి డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఉంది. 2024 ఏప్రిల్ 1 నాటికి రూ. 19,500 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది.
ఏసీసీ
ప్రస్తుత ధర: రూ. 2,337.80
టార్గెట్ ధర: రూ. 2,795
దేశీయంగా సిమెంట్‌కు డిమాండ్ 7–8 శాతం మేర వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఉత్పత్తిని 140 మిలియన్ టన్నుల స్థాయికి రెట్టింపు చేసుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఇది 89 మిలియన్ టన్నులుగా ఉంది. వ్యయాల నియంత్రణపై మరింతగా దృష్టి పెడుతోంది.
టీసీఎస్
ప్రస్తుత ధర: రూ. 4,085.60
టార్గెట్ ధర: రూ. 4,664
వృద్ధికి అవకాశమున్న వర్ధమాన మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించేందుకు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తోంది. టోటల్ కాంట్రాక్ట్ వేల్యూ దాదాపు
ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో
ఉండటం, జెన్‌ఏఐపై క్లయింట్ల
ఆసక్తి పెరుగుతుండటం వంటివి వ్యాపార వృద్ధికి దోహదపడే సానుకూలాంశాలు.
గ్రాన్యూల్స్ ఇండియా
ప్రస్తుత ధర: రూ. 551.60
టార్గెట్ ధర: రూ. 723
ఎఫ్‌డీ సెగ్మెంట్‌వైపు వ్యూహాత్మకంగా మళ్లుతుండటం, యూరప్‌లో పారాసెట్మల్ ఏపీఐల అమ్మకాలు స్థిరపడుతుండటం మొదలైనవి సానుకూలాంశాలు. అలాగే, కొత్త ఎఫ్‌డీ ప్లాంటు
అందుబాటులోకి రావడం, ఉత్తర అమెరికాలో కొత్త ఉత్పత్తుల లాంచింగ్ వంటి అంశాలు వ్యాపార వృద్ధికి తోడ్పడగలవు.
ఎస్‌బీఐ సెక్యూరిటీస్
కోల్ ఇండియా
ప్రస్తుత ధర: రూ. 449.55
టార్గెట్ ధర: రూ. 593
భారీ ఉత్పత్తి లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడంలో పురోగతి సాధించింది. లాభసాటి కాని భూగర్భ గనుల నుంచి తప్పుకోవడం ద్వారా వ్యయాలను నియంత్రించుకుంటోంది. గ్రాఫైట్ వంటి ఇతర విభాగాల్లోకి కూడా విస్తరిస్తోంది.
మ్యాక్రోటెక్ డెవలపర్స్
ప్రస్తుత ధర: రూ. 1,181.80
టార్గెట్ ధర: రూ. 1,398
రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజ సంస్థగా రాణిస్తోంది. రెసిడెన్షియల్, కమర్షియల్, వేర్‌హౌసింగ్ వంటి వివిధ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ. 23,363 కోట్లుగా ఉన్న రుణభారాన్ని గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా రూ. 7,680 కోట్లకు తగ్గించుకుంది.
భారతి హెక్సాకామ్
ప్రస్తుత ధర: రూ. 1,420.90
టార్గెట్ ధర: రూ. 1,747
రాజస్థాన్, ఈశాన్య టెలికం సర్కిళ్లలో కార్యకలాపాలు సాగిస్తోంది. 25,704 టవర్లు, 79,835 మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ స్టేషన్లతో పటిష్టమైన మౌలిక సదుపాయాల నెట్‌వర్క్ ఉంది. భారతి ఎయిర్‌టెల్‌తో అనుబంధం వల్ల డిజిటల్ ఇన్‌ఫ్రా, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలపరంగా ప్రయోజనాలను పొందుతోంది.
నిప్పన్ లైఫ్ ఏఎంసీ
ప్రస్తుత ధర: రూ. 683
టార్గెట్ ధర: రూ. 825
ఈక్విటీ, ఈటీఎఫ్ ఏయూఎంపరంగా పటిష్ట వృద్ధి కనపరుస్తోంది. 2024–26 ఆరి్ధక సంవత్సరాల మధ్య కాలంలో ఏయూఎం వృద్ధి రెండంకెల స్థాయిలో ఉండొచ్చనే అంచనాలున్నాయి. బలమైన రిటైల్ నెట్‌వర్క్, దేశీ యంగా మ్యుచువల్ ఫండ్ విస్తృతి తక్కువగా ఉండటం తదితర అంశాలు ఇందుకు తోడ్పడనున్నాయి.
ఎస్కార్ట్స్ కుబోటా
ప్రస్తుత ధర: రూ. 3,642.45
టార్గెట్ ధర: రూ. 4,408
12 హెచ్‌పీ నుంచి 120 హెచ్‌పీ వరకు వివిధ సామర్థ్యాలున్న ట్రాక్టర్లతో బలమైన పోర్ట్‌ఫోలియో ఉంది. మూడు తయారీ ప్లాంట్లు, ఏటా 12 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. హైడ్రాలిక్ మొబైల్ క్రేన్లకు సంబంధించి దేశీ మార్కెట్‌లో అగ్రగామిగా ఉంటోంది. 1,200 పైచిలుకు డీలర్లతో మార్కెట్లలో విస్తరిస్తోంది.
సిస్టమాటిక్స్ షేర్స్ అండ్ స్టాక్స్ (ఇండియా)
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్
ప్రస్తుత ధర: రూ. 925
టార్గెట్ ధర: రూ. 1,333
దేశీయంగా మూడో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఏయూఎం రూ. 71,243 కోట్లుగాను, లోన్ బుక్ రూ. 65,358 కోట్లుగా ఉంది. రిటైల్ లోన్ బుక్‌ను 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1 లక్ష కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. వార్షికంగా 50 చొప్పున 2026 నాటికి మొత్తం 400 శాఖలు ఏర్పాటు చేయనుంది.
శ్రీరామ్ ప్రాపరీ్టస్
ప్రస్తుత ధర: రూ. 106.95
టార్గెట్ ధర: రూ. 152
దక్షిణాదిలో దిగ్గజ రెసిడెన్షియల్ డెవ లపర్లలో ఒకటిగా వ్యాపార వృద్ధి, లాభదాయకతపై మరింతగా దృష్టి పెడుతోంది. వచ్చే మూడేళ్లలో 15 ఎంఎస్‌ఎఫ్ స్థాయిలో విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమపై సానుకూల అంచనాలు ఉండటం, మిడ్ సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉండటం వంటివి సంస్థకు సానుకూలాంశాలు.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ప్రస్తుత ధర: రూ. 464.85
టార్గెట్ ధర: రూ. 700
ఇది దేశీయంగా నాలుగో అతి పెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. 2021 ఆర్థిక సంవత్సరంలో 40 శాతంగా ఉన్న సెక్యూర్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో 2024 ఆర్థిక సంవత్సరంలో 60 శాతానికి పెరిగింది. నికర వడ్డీ మార్జిన్లు స్థిరంగా ఉండటం, నికర ఎన్‌పీఏలు తగ్గుతుండటంతో లాభాల మార్జిన్లు మెరుగుపడనున్నాయి. ఏయూఎం వృద్ధి 19–20% అంచనా.
పేటీఎం
ప్రస్తుత ధర: రూ. 752.25
టార్గెట్ ధర: రూ. 900
ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారాన్ని రూ. 2,000 కోట్లకు జొమాటోకి విక్రయించడం ద్వారా కీలకమైన పేమెంట్, ఆర్థిక సేవలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ డీల్‌తో నగదు నిల్వలు పెరిగి, భవిష్యత్‌లో పెట్టుబడులకు కాస్త వెసులుబాటు లభిస్తుంది. విస్తృతమైన మర్చంట్ నెట్‌వర్క్, పటిష్టమైన సౌండ్–బాక్స్
సబ్‌్రస్కయిబర్లు సానుకూలాంశాలు.
జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
ప్రస్తుత ధర: రూ. 80.70
టార్గెట్ ధర: రూ. 108
దేశంలోనే రద్దీగా ఉండే రెండు విమానాశ్రయాలను (డీఐఏఎల్, జీహెచ్‌ఐఏఎల్) నిర్వహిస్తోంది. ఈ రెండింటిలో ప్యాసింజర్ ట్రాఫిక్ గత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 13%, 19% మేర వృద్ధి చెందింది. డ్యూ టీ–ఫ్రీ సర్వీసెస్ వంటి నాన్–ఏరోనాటికల్ ఆదాయ వనరులను పెంచుకుంటోంది. గ్రూప్ ఏడీపీతో భాగస్వా మ్యం వల్ల ఆర్థిక స్థిరత్వం మెరుగుపడింది.
యాక్సిస్ సెక్యూరిటీస్
గ్రావిటా ఇండియా
ప్రస్తుత ధర: రూ. 2,000.70
టార్గెట్ ధర: రూ. 3,000
వచ్చే ఏడాది వ్యవధిలో కంపెనీ పటిష్టమైన ఎబిటా నమోదు చేసే అవకాశం ఉంది. వాల్యూమ్స్, ప్రతి టన్నుపై ఎబిటా వృద్ధి మెరుగ్గా ఉండగలవు.
అరవింద్ స్మార్ట్ స్పేసెస్
ప్రస్తుత ధర: రూ. 918.75
టార్గెట్ ధర: రూ. 1,085
ఎన్‌హెచ్47 సూరత్, సౌత్ అహ్మదాబాద్ ప్రాజెక్టుల బుకింగ్స్ సానుకూలంగా ఉండవచ్చు. వీటి నుంచి వరుసగా రూ. 1,100 కోట్లు, రూ. 1,450 కోట్ల మేర రావచ్చని అంచనా.
ఐనాక్స్ విండ్
ప్రస్తుత ధర: రూ. 218.70
టార్గెట్ ధర: రూ. 270
2023–24 నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కంపెనీ రెవెన్యూ/ఎబిటాలు వార్షిక ప్రాతిపదికన 83 శాతం/90 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా.
కేపీఐటీ టెక్నాలజీస్
ప్రస్తుత ధర: రూ. 1,386.10
టార్గెట్ ధర: రూ. 2,150
ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉండటంతో దీర్ఘకాలంలో అధిక వృద్ధిని కొనసాగించగలమని మేనేజ్‌మెంట్ ధీమాగా ఉంది.
హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్
ప్రస్తుత ధర: రూ. 1,331.85
టార్గెట్ ధర: రూ. 1,700
వ్యూహాత్మక డైవర్సిఫికేషన్‌పై దృష్టి పెడుతుండటం సంస్థకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
– సాక్షి, బిజినెస్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment