20 నెలల్లో రూ.లక్ష కోట్లు
రియల్ ఎస్టేట్ కంపెనీల సమీకరణ
అధిక మొత్తం డెట్ రూపంలోనే
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ పరిశ్రమ డిమాండ్‌కు తగ్గట్టుగా భారీ పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తోంది. గడిచిన 19–20 నెలల్లో రియల్ ఎస్టేట్ సంస్థలు రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు సమీకరించడం ఈ డిమాండ్‌కు అద్దం పడుతోంది. 92 శాతం పెట్టుబడులను డెట్ ఇష్యూల జారీ ద్వారానే సమీకరించాయి. అంతేకాదు మరో రూ.28,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇష్యూలు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.
హౌసింగ్ మార్కెట్లో బూమ్‌కు తోడు స్థిరమైన నగదు ప్రవాహాలు ఈ రంగంలోని కంపెనీలకు అనుకూలిస్తున్నాయి. తక్కువ క్రెడిట్ రిస్క్ ఉండడంతో డెట్ పత్రాల మార్గంలో నిధుల సమీకరణకు మొగ్గు చూపిస్తున్నాయి. 2023, 2024లో ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్, సివిల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు డెట్ మార్గంలో రూ.95,975 కోట్ల నిధులు సమీకరించాయి.
ఇందులో 2023లో రూ.61,600 కోట్లు, ఈ ఏడాది రూ.34,375 కోట్ల చొప్పున సమకూర్చుకున్నాయి. ఈక్విటీ రూపంలో నిధుల సమీకరణ తక్కువగానే ఉన్నప్పటికీ, ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. 2023లో ఈక్విటీ జారీ రూపంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ కంపెనీలు రూ.124 కోట్లు రాబట్టగా, 2024లో ఇప్పటి వరకు రూ.8,772 కోట్లు సమీకరించాయి. ఇందులో ఐపీ వోలు కూడా ఉన్నాయి. ఇక సమీప కాలంలో సమీకరించనున్న రూ.28,350 కోట్లలో.. డెట్ మార్గంలో రూ.16,635 కోట్లు, రూ.9,695 కోట్లు క్యూఐపీ రూ పంలో, మిగిలినది ఐపీవోల రూపంలో రానుంది.
మెరుగైన అమ్మకాలు
లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీల అమ్మకాలు కరోనా అనంతరం ఏటా 15–20 శాతం మేర వృద్ధి చెందడంతో నగదు ప్రవాహాలు (నికర నిధుల మిగులు) మెరుగయ్యాయి. అంతేకాదు భవిష్యత్ నగదు ప్రవాహాలు అంచనాలపైనా స్పష్టత ఏర్పడింది. ‘‘ఇళ్ల అమ్మకాలపై చెల్లింపులు సాధారణంగా క్రమానుగతంగా (మైలురాయి చేరికల ఆధారంగా) ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్ సంస్థల నగదు ప్రవాహాలు మెరుగయ్యేలా చేసింది’’అని ఈక్విరస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ ఎండీ విజయ్ అగర్వాల్ తెలిపారు. కొత్త ప్రాజెక్టులను ఆరంభించిన వెంటనే 25–30 శాతం మేర అమ్ముడుపోయే పరిస్థితులు కనిపిస్తున్నట్టు చెప్పారు. దీంతో నగదు ప్రవాహాలపై అంచనాలకు ఇది వీలు కలి్పస్తోందని, దీంతో అవి డెట్ రూపంలోనిధుల సమీకరణకు ఆసక్తి చూపిస్తున్నట్టు వివరించారు.
ఈక్విటీఈక్విటీ మార్గమే చౌక మార్గమే చౌక
ఈ ఏడాది ఈక్విటీ జారీ రూపంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద మొత్తంలో నిధుల సమీకరణకు ఉన్న కారణాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. రుణాలపై వడ్డీ రేట్లు పెరిగిపోవడం ఇందులో ప్రధానమైనది. రియల్ ఎస్టేట్ కంపెనీలు రెండంకెల రాబడులను ఆశిస్తుంటాయి. దీంతో ప్రస్తుత తరుణంలో ఈక్విటీ జారీయే మెరుగైన మార్గమని భావించడంతో.. ఈ దిశగా ఆసక్తి నెలకొంది. ఈ నిధులను భూముల సమీకరణపై ఎక్కువగా వెచి్చస్తున్నాయి. 2024 మొదటి ఆరు నెలల్లో 54 భూ లావాదేవీలు నమోదయ్యాయి. వీటి పరిమాణం 1,000 ఎకరాలపైనే ఉంది. గతేడాది 100 భూలావాదేవీలు నమోదు కాగా, వీటి పరిమాణం 2,700 ఎకరాలుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment