Real estate industry
-
భారీ పెట్టుబడుల దిశగా రియల్ ఎస్టేట్
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ పరిశ్రమ డిమాండ్‌కు తగ్గట్టుగా భారీ పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తోంది. గడిచిన 19–20 నెలల్లో రియల్ ఎస్టేట్ సంస్థలు రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు సమీకరించడం ఈ డిమాండ్‌కు అద్దం పడుతోంది. 92 శాతం పెట్టుబడులను డెట్ ఇష్యూల జారీ ద్వారానే సమీకరించాయి. అంతేకాదు మరో రూ.28,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇష్యూలు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. హౌసింగ్ మార్కెట్లో బూమ్‌కు తోడు స్థిరమైన నగదు ప్రవాహాలు ఈ రంగంలోని కంపెనీలకు అనుకూలిస్తున్నాయి. తక్కువ క్రెడిట్ రిస్క్ ఉండడంతో డెట్ పత్రాల మార్గంలో నిధుల సమీకరణకు మొగ్గు చూపిస్తున్నాయి. 2023, 2024లో ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్, సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీలు డెట్ మార్గంలో రూ.95,975 కోట్ల నిధులు సమీకరించాయి. ఇందులో 2023లో రూ.61,600 కోట్లు, ఈ ఏడాది రూ.34,375 కోట్ల చొప్పున సమకూర్చుకున్నాయి. ఈక్విటీ రూపంలో నిధుల సమీకరణ తక్కువగానే ఉన్నప్పటికీ, ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. 2023లో ఈక్విటీ జారీ రూపంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ కంపెనీలు రూ.124 కోట్లు రాబట్టగా, 2024లో ఇప్పటి వరకు రూ.8,772 కోట్లు సమీకరించాయి. ఇందులో ఐపీ వోలు కూడా ఉన్నాయి. ఇక సమీప కాలంలో సమీకరించనున్న రూ.28,350 కోట్లలో.. డెట్ మార్గంలో రూ.16,635 కోట్లు, రూ.9,695 కోట్లు క్యూఐపీ రూ పంలో, మిగిలినది ఐపీవోల రూపంలో రానుంది.మెరుగైన అమ్మకాలు లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీల అమ్మకాలు కరోనా అనంతరం ఏటా 15–20 శాతం మేర వృద్ధి చెందడంతో నగదు ప్రవాహాలు (నికర నిధుల మిగులు) మెరుగయ్యాయి. అంతేకాదు భవిష్యత్ నగదు ప్రవాహాలు అంచనాలపైనా స్పష్టత ఏర్పడింది. ‘‘ఇళ్ల అమ్మకాలపై చెల్లింపులు సాధారణంగా క్రమానుగతంగా (మైలురాయి చేరికల ఆధారంగా) ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్ సంస్థల నగదు ప్రవాహాలు మెరుగయ్యేలా చేసింది’’అని ఈక్విరస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ విజయ్ అగర్వాల్ తెలిపారు. కొత్త ప్రాజెక్టులను ఆరంభించిన వెంటనే 25–30 శాతం మేర అమ్ముడుపోయే పరిస్థితులు కనిపిస్తున్నట్టు చెప్పారు. దీంతో నగదు ప్రవాహాలపై అంచనాలకు ఇది వీలు కలి్పస్తోందని, దీంతో అవి డెట్ రూపంలోనిధుల సమీకరణకు ఆసక్తి చూపిస్తున్నట్టు వివరించారు. ఈక్విటీఈక్విటీ మార్గమే చౌక మార్గమే చౌక ఈ ఏడాది ఈక్విటీ జారీ రూపంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద మొత్తంలో నిధుల సమీకరణకు ఉన్న కారణాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. రుణాలపై వడ్డీ రేట్లు పెరిగిపోవడం ఇందులో ప్రధానమైనది. రియల్ ఎస్టేట్ కంపెనీలు రెండంకెల రాబడులను ఆశిస్తుంటాయి. దీంతో ప్రస్తుత తరుణంలో ఈక్విటీ జారీయే మెరుగైన మార్గమని భావించడంతో.. ఈ దిశగా ఆసక్తి నెలకొంది. ఈ నిధులను భూముల సమీకరణపై ఎక్కువగా వెచి్చస్తున్నాయి. 2024 మొదటి ఆరు నెలల్లో 54 భూ లావాదేవీలు నమోదయ్యాయి. వీటి పరిమాణం 1,000 ఎకరాలపైనే ఉంది. గతేడాది 100 భూలావాదేవీలు నమోదు కాగా, వీటి పరిమాణం 2,700 ఎకరాలుగా ఉంది. -
Ananya Tripathi: కోడర్ టు రియల్ ఎస్టేట్ క్వీన్
రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల పేర్లు అరుదుగా వినిపిస్తాయి. కోడర్, స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, సీయీవోగా మంచి పేరు తెచ్చుకున్న 39 సంవత్సరాల అనన్య త్రిపాఠి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టి విజయం సాధించింది. ‘రియల్ ఎస్టేట్ క్వీన్’గా పేరు తెచ్చుకుంది... ఆర్మీ ఆఫీసర్ కూతురు అయిన అనన్య త్రిపాఠి తరచుగా ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు మారుతూ ఉండేది. ‘రకరకాల ప్రాంతాలలో చదువుకోవడం వల్ల ఎన్నో సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం, అదృష్టం దొరికింది’ అంటుంది అనన్య. పుణెలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ పూర్తిగా చేసిన అనన్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ‘టీసీఎస్’ తొలి ఉద్యోగం చేసింది. కోడర్‌గా మంచి పేరు వచ్చినా తన దృష్టి వ్యాపారంగంపై మళ్లింది. అలా కోళికోద్ – ఐఐఎంలో ఎంబీఏ చేసింది. క్యాంపస్ సెలెక్షన్లో ‘మెకిన్సీ’కి ఎంపికైన ఏకైక స్టూడెంట్ అనన్య. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెకిన్సీ’లో ఏడు సంవత్సరాల ప్రయాణం తనకు ఎన్నో పాఠాలు నేర్పింది. మార్గదర్శకులలాంటి వ్యక్తులతో పరిచయం జరిగింది. విశ్లేషణాత్మకంగా ఉండడంతో పాటు స్ట్రక్చర్డ్ డాటా తాలూకు సమస్యలను పరిష్కారించడానికి సంబంధించిన జ్ఞానాన్ని మెకిన్సీలో సొంతం చేసుకుంది. అయితే ఫ్యాషన్ ఇ–కామర్స్ కంపెనీ ‘మింత్రా’ నుంచి వచ్చిన అవకాశం అనన్య కెరీర్‌ను మార్చి వేసింది. ఇ–కామర్స్ గురించి ఎన్నో సందేహాలు ఉన్న ఆ కాలంలో ‘మింత్రా’ నుంచి వచ్చిన ఆఫర్‌కు వెంటనే ఓకే చెప్పడం కష్టమే. అయినప్పటికీ సందేహాలను పక్కన పెట్టి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ హోదాలో ‘మింత్రా’లో చేరింది అనన్య. మూడున్నరేళ్లలో ‘మింత్రా’ లాభాలను పెంచింది. ఆ తరువాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ‘కేకేఆర్ కేప్స్టోన్’ నుంచి కొత్త కెరీర్ ఆపర్చునిటీ వెదుక్కుంటూ వచ్చింది. ‘కేకేఆర్’లో మాక్స్ హెల్త్‌కేర్, వినీ కాస్మెటిక్స్‌లాంటి కంపెనీలతో కలిసి పనిచేసింది. అనన్య మెటర్నిటీ లీవ్‌లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ గ్రూప్ ‘బ్రూక్‌ఫీల్డ్’ నుండి పిలుపు వచ్చింది. మామూలుగానైతే మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్నప్పుడు సెలవు కాలం పూర్తయ్యేంత వరకు చాలా కంపెనీలు వేచి చూడవు. అయితే బ్రూక్‌ఫీల్డ్ మాత్రం అనన్య ప్రతిభాసామర్థ్యాలపై నమ్మకంతో ఓపిగ్గా వేచి చూసింది. వారి నమ్మకాన్ని అనన్య వమ్ము చేయలేదు. ‘పలు పరిశ్రమలకు సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లలో అనన్యకు అపారమైన అనుభవం ఉంది. స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌గా ఆమె ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది’ అంటాడు బ్రూక్‌ఫీల్డ్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ పార్టనర్ అంకుర్ గుప్తా. బ్రూక్‌ఫీల్డ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మరోసారి గెలుపు జెండా ఎగరేసిన అనన్య త్రిపాఠి నుంచి వినిపించే సక్సెస్మంత్రా ‘కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి’. -
రియల్టీ నుంచి ప్రభుత్వాలకు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రియల్ ఎస్టేట్ పరిశ్రమ పెద్ద ఆదాయ వనరుగా మారింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఈ పరిశ్రమ నుంచి రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం స్టాంప్ డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు తదితర రూపంలో ప్రభుత్వాలకు సమకూరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ వాటా 5.4 శాతంగా ఉంది. ఈ వివరాలను ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’తో కలసి రియల్ ఎస్టేట్ కౌన్సిల్ ‘నరెడ్కో’ విడుదల చేసింది. ‘‘భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 12 రెట్లు పెరిగి 2047 నాటికి 5.8 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది 477 బిలియన్ డాలర్లుగా ఉంది. 2047 నాటికి దేశ జీడీపీలో 15 శాతం వాటాను సమకూరుస్తుంది. ప్రస్తుతం పరిశ్రమ వాటా జీడీపీలో 7.3 శాతంగా ఉంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 33–40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’’అని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. నివాస మార్కెట్ 3.5 ట్రిలియన్ డాలర్లు నివాస గృహాల మార్కెట్ పరిమాణం గత ఆర్థిక సంవత్సరం నాటికి 299 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2047 నాటికి 3.5 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 40 బిలియన్ డాలర్ల నుంచి 473 బిలియన్ డాలర్లకు.. వేర్ హౌసింగ్ మార్కెట్ సైజు 2.9 బిలియన్ డాలర్ల నుంచి 34 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని అంచనా వేసింది. -
గృహ రుణాలకు తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ: గృహ రుణాలకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. రుణం తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో బ్యాంకుల పుస్తకాల్లో గృహ రుణాలు రెట్టింపై రూ.16.85 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లోనూ (ఏప్రిల్–ఆగస్ట్ వరకు) గృహ రుణాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. ఈ ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు ఆర్బీఐ 1.4 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. సెప్టెంబర్‌లోనూ అర శాతం మేర పెంచడం గమనార్హం. 2016–17 నాటికి బ్యాంకుల నుంచి గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.8,60,086 కోట్లుగా ఉండగా, 2022 మార్చి నాటికి రూ.16,84,424 కోట్లకు వృద్ది చెందింది. రేట్ల పెంపు ప్రభావం ఉండదు.. వడ్డీ రేట్ల అన్నవి ముఖ్యమైనవే అయినప్పటికీ.. అవి గృహ కొనుగోలుకు అవరోధం కాదని, రుణ గ్రహీతల ప్రస్తుత ఆదాయం, భవిష్యత్తు ఆదాయ అంచనాలపైనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గృహ రుణ కాలంలో (15–20 ఏళ్లు) వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం అన్నది సాధారణ ప్రక్రియగా ఇన్వెస్టర్లలోనూ అవగాహన పెరుగుతుండడాన్ని ప్రస్తావించాయి. రుణాలపై ఇళ్లను కొనుగోలు చేస్తున్నప్పుడు ఇంటి ధర కీలకం అవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్ట్గేజ్, రిటైల్ అసెట్స్ జనరల్ మేనేజర్ హెచ్‌టీ సోలంకి పేర్కొన్నారు. ‘‘గృహ రుణం అన్నది దీర్ఘకాలంతో ఉంటుంది. ఈ సమయంలో వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయని కస్టమర్లకూ తెలుసు. దేశంలో సగటు వేతన పెంపులు 8–12 శాతం మధ్య ఉంటున్నందున పెరిగే రేట్ల ప్రభావాన్ని వారు తట్టుకోగలరు’’అని సోలంకి అభిప్రాయపడ్డారు. ప్రణాళిక మేరకే.. వడ్డీ రేట్ల పెంపు గృహ రుణాల డిమాండ్‌పై పెద్దగా ఉంటుందని తాను అనుకోవడం లేదని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ రేణు సూద్ కర్నాడ్ సైతం పేర్కొన్నారు. ఇల్లు కొనుగోలు అన్నది మిగిలిన ఉత్పత్తుల మాదిరిగా కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య చర్చించిన తర్వాతే, ప్రణాళిక మేరకు ఉంటుందన్నారు. కారు, కన్జ్యూమర్ రుణాల మాదిరిగా కాకుండా, 12–15 ఏళ్లు, అంతకుమించి కాల వ్యవధితో ఉండే గృహ రుణాలపై ఫ్లోటింగ్ రేట్లు అమల్లో ఉంటాయని గుర్తు చేశారు. ‘‘కనుక వడ్డీ రేట్ల పెంపు వారి నగదు ప్రవాహాలపై తక్కువ ప్రభావమే చూపిస్తుంది. సాధారణంగా 12–15 ఏళ్ల కాలంలో రెండు మూడు విడతల్లో రేట్ల పెంపు ఉండొచ్చు. దీర్ఘకాలంలో రేట్లు దిగొస్తాయని వినియోగదారులకు సైతం తెలుసు’’అని కర్నాడ్ పేర్కొన్నారు. ఇళ్లకు డిమాండ్ చక్కగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు సైతం చెబుతున్నాయి. ‘‘ఇళ్ల విక్రయాలు బలంగా కొనసాగుతున్నాయి. 2022 చివరికి దశాబ్ద గరిష్టానికి చేరుకుంటాయి. స్థిరమైన ధరలకుతోడు, పండుగల డిమాండ్, గృహ రుణాలపై తక్కువ రేట్లు (గతంలోని 10–11 శాతంతో పోలిస్తే) సానుకూలతలు’’అని ప్రాపర్టీ కన్సల్టెంట్ జెల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ సమంతక్ దాస్ వివరించారు. కాకపోతే అదే పనిగా గృహ రుణాల వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే ఈఎంఐ పెరిగి, సెంటిమెంట్‌కు విఘాతం కలగొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 87 శాతం పెరిగి.. 2,72,709 యూనిట్లు అమ్ముడైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇటీవలే వెల్లడించడం గమనార్హం. -
NAREDCO: రానున్న నెలల్లో ఇళ్ల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: రానున్న నెలల్లో ఇళ్ల ధరలు పెరుగుతాయని భవిష్యత్తు కొనుగోలు దారుల్లో సగం మంది భావిస్తున్నారు. రియల్టీ పోర్టల్ హౌసింగ్ డాట్ కామ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ మండలి అయిన నరెడ్కో కలసి సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించాయి. ఇందులో పాల్గొన్న వారిలో 47 శాతం మంది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. 21 శాతం మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని చెప్పగా, 16 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటామని, 15 శాతం మంది బంగారంలో పెట్టుబడి పెడతామని తెలిపారు. ‘రెసిడెన్షియల్ రియల్టీ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే హెచ్2 2022’ పేరుతో ఈ సంస్థలు సర్వే నివేదికను విడుదల చేశాయి. ఇందులో 1,000 మందికి పైగా పాల్గొన్నారు. 48 శాతం మంది భవిష్యత్తులో ధరల పెరుగుదలను అంచనా వేస్తున్నారు. 58% మంది రెడీ టు మూవ్ (ప్రవేశానికి సిద్ధంగా ఉన్న) ప్రాపర్టీల పట్ల ఆసక్తితో ఉన్నట్టు చెప్పారు. ‘‘కరోనా రెండో విడత తీవ్రత తర్వాత భారత నివా స గృహాల మార్కెట్లో డిమాండ్ వేగంగా కోలుకుంది. రుణ వ్యయాలు పెరుగుతుండడ, నిర్మాణ ముడి సరుకుల ధరలు పెరగడం, బలమైన డిమాండ్ ఇళ్ల ధరల పెరుగుదలకు దారితీశాయి’’అని హౌసింగ్ డాట్ కామ్ సీఈవో అగర్వాల్ తెలిపారు. బలంగా డిమాండ్.. పెరిగిన నిర్మాణ వ్యయాలను సర్దుబాటు చేసుకునేందుకు, లాభాల మార్జిన్లను పెంచుకునేందుకు ప్రాపర్టీల ధరలను పెంచినట్టు లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుందని ధృవ్ అగర్వాల్ అంచనా వేశారు. పండుగల సమయాల్లో డిమాండ్ పుంజుకోవడానికి తోడు, కన్జ్యూమర్ సెంటిమెంట్ బలంగా ఉన్నట్టు గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉంటాయని ఇళ్ల కొనుగోలు దారులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని 73 శాతం మంది చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఎన్నో విధానపరమైన నిర్ణయాలు పరిశ్రమ రికవరీకి మద్దతుగా నిలిచినట్టు నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ తెలిపారు. సొంతింటిని కలిగి ఉండాలన్న కోరిక వినియోగదారుల్లో ఉన్నందున ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
‘దమ్మున్న లీడర్’తోనే పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్ (రాయదుర్గం): హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు రావాలంటే దమ్మున్న లీడర్షిప్ కావాలని, మతాల మధ్య చిచ్చుపెట్టే దుమ్ము రేపే లీడర్లు కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇండస్ట్రీ సజావుగా సాగాలంటే లా అండ్ ఆర్డర్ లేనిదే సాధ్యం కాదని, ఈ విషయాన్ని హైదరాబాదీలు ఆలోచించాలని కోరారు. ఆరేళ్ల నుంచి ఎటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూసిన లీడర్ కేసీఆర్ అని అన్నారు. క్రెడాయ్ హైదరాబాద్, ట్రెడా(తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్), తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్– 2020లో కేటీఆర్ మాట్లాడారు. గత ఆరేళ్లలో హైదరాబాద్‌లో రోడ్లు, ఫ్లైఓవర్లు, కేబుల్‌బ్రిడ్జ్.. తదితర మౌలిక వసతులు కల్పించామని, తాగునీటి, కరెంట్ సమస్య లేకుండా చూశామని, శివారు ప్రాంతాలకు కూడా తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. భూరికార్డుల సమగ్ర పర్యవేక్షణను అందుబాటులోకి తీసుకొచ్చిన ధరణి.. భవిష్యత్‌లో అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ అవుతుందని అన్నారు. ధరణి వల్ల నిలిచిపోయిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సాధ్యమైనంత తొందరగా తిరిగి ప్రారంభిస్తామని, దాని పూచీకత్తు తనదని హామీనిచ్చారు. ప్రజలపై భారం పడకుండా ఆస్తుల క్రమబద్ధీకరణ రాష్ట్రప్రజలపై భారం పడకుండా ఆస్తులను క్రమబద్ధీకరిస్తామని, ప్రతి ఇంచు భూమిని కూడా సర్వే చేసి డిజిటలైజేషన్ చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ఆస్తులను అన్‌లాక్ చేయాల్సిన అవసరం, అన్‌లాక్ చేస్తే వేల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలకు మార్గం సుగమమవుతుందని అన్నారు. వరదలప్పుడు నగరం అతలాకుతలం కావడానికి కారణమైన నాలాలు, చెరువులు, మూసీ నదిని స్ట్రాటాజిక్ ప్రోగ్రామ్‌లో భాగంగా మూడేళ్లలో మారుస్తామని నొక్కిచెప్పారు. హైదరాబాద్ పాకిస్థాన్‌లో ఉందా.. ‘హైదరాబాద్ ఏమైనా పాకిస్థాన్‌లోగానీ, చైనాలోగానీ ఉందా....మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నవారి అడ్డమైన వాదనలు 2020లో చెల్లవు. శాశ్వత ప్రయోజనాలతో నగరం ముడిపడి ఉంది. నాలుగు ఓట్ల కోసం రెచ్చగొట్టి వెళితే ఆ నిప్పు ఎవరూ ఆర్పాలి.. మతాన్ని, వర్గాన్ని టార్గెట్ చేస్తున్నవారిని బలంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత హైదరాబాదీలపైనే ఉంది. అమెజాన్, అపిల్, ఫేస్బుక్, గూగుల్ క్యాంపస్‌లు రావడంతో సంబరపడుతున్నాం.. అదే హైదరాబాద్ తల్లడిల్లుతుంటే వస్తారా.. ఆలోచించాలి’అని కేటీఆర్ అన్నారు. ‘హైదరాబాద్ పేరు మారుస్తామని అంటున్నారు.. భాగ్యనగరం అని పెట్టినంత మాత్రాన బంగారం అయితుందా’అని ప్రశ్నించారు. ·హైదరాబాద్‌లో అభివృద్ధి కావాలో.. అరాచకం రావాలో.. ఆలోచించాల్సిన సమయం ఆసన్నౖమైందన్నారు. గత ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో రూ.67 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. . వరదబాధితుల కోసం కేంద్రం కర్నాటకకు ఐదురోజులలో రూ.500 కోట్లు, గుజరాత్‌కు వారంరోజుల్లో రూ.600 కోట్లు ఇచ్చారు. మనకు రూ.1,350 కోట్లు ఇవ్వాలని సీఎం లేఖ రాస్తే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దు.. బయటకు వచ్చి ఓట్లేయండి నగరంలో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని, అందుకు ఓటర్లంతా ఓటు హక్కును వినియోగించు కోవాలని కేటీఆర్ సూచించారు. ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దని, విమర్శలు చేయవద్దని, అంతా బయటకు వచ్చి డిసెంబర్ 1న ఓటు వేసి అభివృద్ధి చేసే టీఆర్ఎస్ను బలపర్చాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు పి రామకష్ణారావు, ప్రధాన కార్యదర్శి వి రాజశేఖర్‌రెడ్డి, బి ప్రదీప్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, చలపతిరావు, ప్రభాకర్‌రావుతోపాటు పలువురు పాల్గొన్నారు. -
యాదగిరిగుట్ట వెంచరంటూ.. కుచ్చుటోపి!
హైదరాబాద్: ఎల్బీనగర్ అల్కాపురిలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. శ్రీ చంద్ర రియల్ ఎస్టేట్ అనే సంస్థ యాదగిరిగుట్ట వెంచర్లో ప్లాట్ల పేరుతో మోసానికి పాల్పడినట్టు తెలిసింది. యాదగిరిగుట్ట వెంచర్ పేరుతో.. ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయల మేర వసూళ్లు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. యాదగిరిగుట్ట వెంచరలో ప్లాట్లు ఇస్తామంటూ నమ్మబలికి చివరకు తమను మోసం చేసారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.