ఎంవోయూలపై నిరంతరం శ్రమించాలి
వేలకోట్ల పెట్టుబడులు వస్తాయని అమెరికా, దక్షిణ కొరియా వెళ్లలేదు
ప్రభుత్వ ఆలోచనలు, లక్ష్యాలను దిగ్గజ కంపెనీలకు వివరించాం
మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తాను, తమ అధికారులు చేసుకున్న అవగాహన ఒప్పందాల (ఎంవోయూ)తో రాత్రికి రాత్రే వేలకోట్ల పెట్టుబడులు వచ్చిపడవని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆ ఎంవోయూలపై నిరంతరం శ్రమిస్తేనే అవి పెట్టుబడుల రూపంలో వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. అయినా వేలకోట్ల పెట్టుబడులు వస్తాయని తాము అమెరికా, దక్షిణ కొరియా వెళ్లలేదని వ్యా ఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, లక్ష్యాలను ప్ర ముఖ పరిశ్రమల యాజమాన్యాలతో పంచుకున్నామని తెలిపారు. పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు. శనివారం సచివాలయంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో అధికారి శ్రీనివాస్, ప్రజా సంబంధాల కమిషనర్ హనుమంతరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణ
అభివృద్ధిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా తమ పర్యటన సాగిందని శ్రీధర్‌బాబు చెప్పారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ (భవిష్యత్ రాష్ట్రం)గా దిగ్గజ కంపెనీల ముందు ఆవిష్కరించామన్నారు. పలు సంస్థలు అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు (జీసీసీ) ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయని, 11 రోజుల పర్యటనలో మొత్తం 19 ఒప్పందాలు, 50 మందితో వ్యాపార సమావేశాలు జరిపామని తెలిపారు.
మొత్తం రూ. 31,500 కోట్ల పెట్టుబడులతో 30,750 మందికి ఉపాధి కల్పించడానికి ఆయా సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. వీటిల్లో ముఖ్యంగా కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీయంఆర్, ట్రైనెట్, ట్రైజిన్, కారి్నంగ్, ఆమ్‌జెన్, జోయ్‌టిస్, థెర్మో ఫిషర్ సైంటిఫిక్, మోనార్క్ ట్రాక్టర్స్, స్వచ్ఛ్‌బయో, వాల్‡్షకర్ర హోల్డింగ్స్ లాంటి సంస్థలు ఉన్నాయని వెల్లడించారు. ఇవి కాకుండా హ్యుందాయ్ మోటార్స్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు చేస్తోందని, దుస్తులు, ఫ్యాషన్, కాస్మోటిక్స్ సంస్థలు కూడా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని తెలిపారు.
గతంలో దావోస్‌లో రూ.40,230 కోట్ల పెట్టుబడులకు తమ ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇటీవలి కాలం వరకు ముఖ్యమంత్రి స్థాయిలో పెట్టుబడులను ఆహ్వానించడానికి, ప్రభుత్వ ఆలోచనలు పంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదనే అభిప్రాయం ప్రవాస భారతీయులు, పలు పరిశ్రమల యజమానుల్లో వ్యక్తమైందని మంత్రి చెప్పారు.
సీఎం సోదరుడు అయితే ఒప్పందం కుదుర్చుకోకూడదా?
సీఎం సోదరుడి కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన వారికి రాయితీల కల్పన, భూముల ధారాదత్తం లాంటివి చేయలేదు కదా అని శ్రీధర్‌బాబు అన్నారు. 30 సంవత్సరాలుగా అమెరికాలో ఉండి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమ పెట్టడానికి వస్తామంటే ఎందుకు వద్దనాలని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల బంధువులు పెట్టుబడులు పెడతామన్నా తాము స్వాగతిస్తామన్నారు.
గత ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో కేవలం 30 నుంచి 35 శాతం పరిశ్రమలు మాత్రమే ఏర్పాటయ్యాయని, వారు పాస్ అయ్యారో, ఫెయిల్ అయ్యారో ప్రజలే చెప్పాలని అన్నారు. తాము మాత్రం సంవత్సర కాలంలో ఈ ఎంవోయూలను పెట్టుబడుల రూపంలోకి మార్చడానికి ప్రయతి్నస్తామని చెప్పారు. త్వరలోనే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకుని వస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment