సిప్‌..సిప్‌..హుర్రే! | Mutual Fund SIPs accounts stood at 2.84 CRORE | Sakshi
Sakshi News home page

సిప్‌..సిప్‌..హుర్రే!

Published Thu, Nov 14 2019 4:49 AM | Last Updated on Thu, Nov 14 2019 4:49 AM

Mutual Fund SIPs accounts stood at 2.84 CRORE - Sakshi

న్యూఢిల్లీ: దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి సిప్‌ (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ద్వారా వస్తున్న పెట్టుబడుల వాటా అక్టోబర్‌లో 3.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫీ) వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం... గతనెల్లో ఈ పరిశ్రమ సిప్‌ మార్గంలో రూ.8,246 కోట్లను ఆకర్షించింది. అంతకుముందు ఏడాది ఇదే నెల్లో ఈ మొత్తం రూ.7,985 కోట్లు. గడిచిన 12 నెలల సగటు ఇన్‌ఫ్లో రూ. 8,000 కోట్లుగా నమోదయింది. ఈ ఏడాది సెప్టెంబర్లో రూ.8,263 కోట్లు, ఆగస్టులో రూ.8,231 కోట్లు, జూలైలో రూ.8,324 కోట్లు, జూన్‌లో రూ.8,122 కోట్లు, మే నెల్లో రూ.8,183 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,238 కోట్లు సిప్‌ మార్గంలో మ్యూచ్‌వల్‌ ఫండ్లలోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఏడు నెలల్లో సిప్‌ల ప్రవాహం రూ.57,607 కోట్లు కాగా, గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.52,472 కోట్లుగా ఉంది.  

నెలకు సగటున 9.35 లక్షల కొత్త అకౌంట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున నెలకు 9.35 లక్షల చొప్పున కొత్త సిప్‌ అకౌంట్లు జత అయినట్లు యాంఫీ తెలియజేసింది. వీటిద్వారా ఇన్వెస్ట్‌ చేస్తున్న సగటు మొత్తం మాత్రం రూ.2,850గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.89 కోట్ల సిప్‌ ఖాతాలున్నాయి. పెరుగుతున్న పెట్టుబడుల ప్రవాహ ధోరణి ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రెండ్‌లో సానుకూలతను సూచిస్తున్నట్లు మార్నింగ్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇన్వెస్టర్ల సెంట్‌మెంట్‌ని మెరుగుపరిచిన నేపథ్యంలో సిప్‌ పెట్టుబడులు జోరందుకున్నాయని విశ్లేషించారు. ఇక 2018–19లో రూ. 92,700 కోట్లు, 2017–18లో రూ. 67,000 కోట్లు, 2016–17లో రూ. 43,900 కోట్లు సిమ్‌ మార్గంలో మార్కెట్లోకి వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement